




Best Web Hosting Provider In India 2024
రెండు రోజుల షోలతోనే రూ.526 కోట్లు.. అమెరికన్ సింగర్ బియాన్సె సరికొత్త చరిత్ర.. లండన్ స్టేడియంలో రికార్డుల మోత
అమెరికన్ సింగర్ బియాన్సె కౌబాయ్ కార్టర్ షోతో చరిత్ర సృష్టించింది. లండన్ లోని టోటెన్హామ్ హాట్స్పర్ స్టేడియంలో ఒకటి కాదు ఏకంగా మూడు రికార్డులను తిరగరాసింది. అంతేకాదు ఈ రెండు రోజుల షోల ద్వారానే ఏకంగా 61 మిలియన్ డాలర్లు సంపాదించింది.
అమెరికన్ సింగర్ బియాన్సె.. తన ‘కౌబాయ్ కార్టర్’ ఎరాతో దూసుకుపోతోంది. లండన్‌లోని టోటెన్హామ్ హాట్స్పర్ స్టేడియంలో ఆమె ఇటీవల చేసిన ప్రదర్శనలు మ్యూజిక్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించాయి. జూన్ 14, 16న తన ప్రపంచ పర్యటనలో భాగంగా ప్రదర్శనలు ఇస్తూ.. ఈ స్టేడియంలో క్వీన్ బే అధికారికంగా ఒకటి కాదు, మూడు భారీ రికార్డులను బ్రేక్ చేసింది.
బియాన్సె రికార్డులు ఇవీ..
బియాన్సె తన కౌబాయ్ కార్టర్ టూర్ తో లండన్ లోని టోటెన్హామ్ హాట్స్పర్ స్టేడియంలో రికార్డుల మోత మోగించినట్లు పాప్ క్రేవ్ ఎక్స్ అకౌంట్ వెల్లడించింది. ఆ పోస్ట్ ప్రకారం బియాన్సె.. ఈ స్టేడియంలో ఏ ఇతర ఆర్టిస్ట్ కు సాధ్యం కాని రీతిలో అత్యధిక వసూళ్లు సాధించిన వ్యక్తిగా నిలిచింది. ఈ షోల ద్వారా ఆమె 45 మిలియన్ల పౌండ్లు (సుమారు 61.5 మిలియన్ల డాలర్లు) అంటే మన కరెన్సీలో సుమారు రూ.526 కోట్లు సంపాదించింది.
అంతేకాదు ఈ షోల కోసం బియాన్సె ఏకంగా 275,000 టికెట్లను కూడా విక్రయించడం విశేషం. ఈ స్టేడియంలో గతంలో ఏ ఇతర ఆర్టిస్ట్ కూ సాధ్యం కాని రికార్డే ఇది కూడా. అంతేకాదు ఈ స్టేడియంలో అత్యధికసార్లు పర్ఫామ్ చేసిన ఆర్టిస్ట్ గానూ చరిత్ర సృష్టించింది. బియాన్సె ఇక్కడ ఆరు ప్రదర్శనలు ఇవ్వడం విశేషం.
బియాన్సె రికార్డులపై ఫ్యాన్స్ రియాక్షన్
బియాన్సె రికార్డులు బ్రేక్ చేయడంపై అభిమానులు ఎలా స్పందించారో చూడండి. “బియన్సె, ఆమె బృందానికి అభినందనలు” అని ఓ అభిమాని రాశారు. “ఆమె ఆల్ టైమ్ గ్రేట్ ఆర్టిస్ట్. ఎవరూ ఆమెను టచ్ చేయలేరు” అని మరొకరు అభిప్రాయపడ్డారు. “క్వీన్ బే టోటెన్హామ్లో పూర్తిగా అదరగొట్టింది! ఆ నంబర్స్ పిచ్చెక్కిస్తున్నాయి” అని ఇంకొకరు అన్నారు.
బియాన్సె తన ‘కౌబాయ్ కార్టర్’ టూర్‌ను ఏప్రిల్ 28న లాస్ ఏంజిల్స్‌లోని సోఫై స్టేడియంలో ప్రారంభించింది. అప్పటి నుండి ఆమె షికాగో, న్యూయార్క్, హూస్టన్, వాషింగ్టన్ డీసీ, అట్లాంటా వంటి ఉత్తర అమెరికాలోని కొన్ని పెద్ద నగరాల్లో పర్ఫామ్ చేసింది. ఇక జూన్‌లో ఆమె లండన్, పారిస్ లలో కౌబాయ్ కార్టర్ టూర్ నిర్వహించింది. ఈ టూర్ జులై 26న లాస్ వెగాస్ లో ముగియనుంది.
సంబంధిత కథనం
టాపిక్