





Best Web Hosting Provider In India 2024

ఒకే కార్లో రష్మిక, విజయ్.. అసలేం జరుగుతోంది? డేటింగ్ గురించి అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారా?
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ డేటింగ్ విషయాన్ని కన్ఫామ్ చేస్తున్నారా? త్వరలోనే ఆ న్యూస్ బయట పెడతారా? అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎందుకంటే బుధవారం (జూన్ 18) వీళ్లిద్దరూ ఒకే కార్లో ముంబయి ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు రావడం హాట్ టాపిక్ గా మారింది.
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ మధ్య రొమాన్స్ అభిమానుల్లో క్యూరియాసిటీని రేకెత్తిస్తోంది. తాజాగా వీరిద్దరూ కలిసి ముంబయి ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చి ఒకే కారులో బయలుదేరారు. దీంతో వీరిద్దరి రిలేషన్ షిప్ స్టేటస్ పై మరోసారి ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారా లేదా అని అభిమానులు ఆసక్తిగా ఆలోచిస్తున్నారు. రష్మిక, విజయ్ బుధవారం (జూన్ 18) తెల్లవారుజామున ముంబై ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చారు.
ఆ ఫొటోలతో వైరల్
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ విమానాశ్రయం నుంచి ఒకే కార్లో బయటకు రావడం హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ తమ ముఖాలను పాక్షికంగా మాస్కులతో కప్పుకొన్నారు. వెనుక సీట్లో కూర్చొని ఉన్న వాళ్లను ఫొటోగ్రాఫర్లు బంధించారు. కొద్ది సేపటి తర్వాత వారి కారు వెళ్లిపోయింది. కానీ అప్పటికే కెమెరాలు ఈ జంట కలిసి ఉన్న దృశ్యాన్ని బంధించాయి. వీరిద్దరు కలిసి విహారయాత్రకు వెళ్లడంతో వీరి రొమాన్స్ గురించి తీవ్ర ఊహాగానాలకు తెరలేచాయి.
వెయిటింగ్ వెడ్డింగ్
రష్మిక, విజయ్ రిలేషన్ షిప్ పై ఫ్యాన్స్ ఇంట్రెస్టెంగ్ కామెంట్లు చేస్తున్నారు. వీళ్ల వెడ్డింగ్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. “వారు దీనిని అధికారికంగా ప్రకటించేస్తున్నారా’’ అని ఒక సోషల్ మీడియా యూజర్ ఆశ్చర్యపోగా, మరొకరు “మేము వారి వివాహం కోసం ఎదురుచూస్తున్నాము” అని రాశారు. “అందమైన జంట” అని ఒకరు వ్యాఖ్యానించగా, “వెయిటింగ్ వెడ్డింగ్” అని మరొకరు పేర్కొన్నారు.
ఎప్పటి నుంచో
రష్మిక, విజయ్ డేటింగ్ లో ఉన్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. 2024 లో రష్మిక, విజయ్ రిలేషన్ లో ఉన్నామని వేర్వేరుగా చెప్పారు కానీ.. వారి భాగస్వాముల పేర్లను వెల్లడించలేదు. 2018లో వచ్చిన గీత గోవిందం, 2019లో వచ్చిన డియర్ కామ్రేడ్ చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించినప్పటి నుంచి వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వారు తరచుగా కలిసి సమయాన్ని గడపడం కనిపిస్తుంది. రష్మిక తరచూ విజయ్ ఇంటికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఆయన ఫ్యామిలీతో క్లోజ్ రిలేషన్ షిప్ ని పంచుకుంటుంది.
పుష్ప 2
గత ఏడాది రష్మిక తన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప 2: ది రూల్ ను విజయ్ ఫ్యామిలీతో కలిసి థియేటర్ లో చూశారు. రష్మిక బర్త్ డే సందర్భంగా రష్మిక, విజయ్ ఒకే లొకేషన్ నుంచి ఫోటోలను పోస్ట్ చేయడం గమనించిన అభిమానులు ఇద్దరూ కలిసి సెలబ్రేట్ చేసుకున్నారనే ఊహాగానాలకు తెరలేపారు. రష్మిక త్వరలో ధనుష్, నాగార్జునలతో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న కుబేర చిత్రంతో థియేటర్లలో అలరించనుంది. ఈ సినిమా జూన్ 20న విడుదల కానుంది. విజయ్ తన తదుపరి చిత్రం కింగ్ డమ్ లో కనిపించనున్నాడు. గౌతం తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ తెలుగు స్పై థ్రిల్లర్ లో భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ కూడా నటించారు. జూలై 4న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.
సంబంధిత కథనం