గ్రిప్పింగ్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఇప్పుడు తెలుగులో ఓటీటీలోకి.. ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Best Web Hosting Provider In India 2024

గ్రిప్పింగ్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఇప్పుడు తెలుగులో ఓటీటీలోకి.. ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Hari Prasad S HT Telugu

ఓ గ్రిప్పింగ్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ రెండేళ్ల తర్వాత తెలుగులో ఓటీటీలోకి వస్తోంది. ఈ విషయాన్ని ఒక రోజు ముందే వెల్లడించిన ఈటీవీ విన్ ఓటీటీ.. తాజాగా బుధవారం (జూన్ 18) తెలుగు ట్రైలర్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది.

గ్రిప్పింగ్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఇప్పుడు తెలుగులో ఓటీటీలోకి.. ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

మలయాళం థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఊహించని ట్విస్టులు, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో అలరిస్తాయి. అలా ఇప్పుడు కొల్లా (Kolla) అనే మరో మూవీ తెలుగులో రాబోతోంది. థియేటర్లలో రిలీజైన రెండేళ్లకు తెలుగులో ఓటీటీలోకి వస్తున్న ఈ మూవీ ట్రైలర్ ను బుధవారం (జూన్ 18) ఈటీవీ విన్ ఓటీటీ రిలీజ్ చేసింది. ఆ ట్రైలర్, మూవీ విశేషాలేంటో ఇక్కడ చూడండి.

కొల్లా మూవీ ట్రైలర్

కొల్లా మూవీ 2023లోనే రిలీజైనా.. తెలుగులో మాత్రం ఇప్పుడు వస్తోంది. ఈ విషయాన్ని ఒక రోజు ముందే ఈటీవీ విన్ ఓటీటీ వెల్లడించింది. గురువారం (జూన్ 19) నుంచి మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు కూడా తెలిపింది. ఇక తాజాగా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేసింది. అందులో ఇద్దరు అమ్మాయిలు ఓ ఊరికి వస్తారు. అక్కడ ఓ బ్యూటీ పార్లర్ తెరవడానికి ప్లాన్ చేస్తారు.

తమ మాటతీరు, అందంతో అక్కడి వాళ్లను త్వరగానే ఆకర్షిస్తారు. అయితే దీని వెనుక వాళ్లది పెద్ద ప్లానే ఉంటుంది. పక్కనే ఉండే బ్యాంకును దోచుకోవడమే ఆ ప్లాన్. ఈ మూవీ ట్రైలర్ కూడా ఆసక్తికరంగా సాగింది. ఆ ఇద్దరు అమ్మాయి, బ్యాంకు దోపిడీ, తర్వాత పోలీసుల దర్యాప్తుతో ఉత్కంఠ రేపింది.

“కొల్లా.. అధికారిక ట్రైలర్ వచ్చేసింది. ఓ బ్యూటీ పార్లర్, ఓ సీక్రెట్ ప్లాన్. ఓ డేరింగ్ దోపిడీ. ఇప్పటి వరకూ చూడని గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్ చూడటానికి సిద్ధంగా ఉండండి. తెలుగులో కొల్లా మూవీని జూన్ 19 నుంచి ఈటీవీ విన్ లో చూడండి” అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ ఈ విషయం తెలిపింది. అయితే ట్రైలర్లో మాత్రం పొరపాటున జులై 19 నుంచి అంటూ ఇవ్వడం గమనార్హం.

కొల్లా మూవీ గురించి..

కొల్లా అనే ఈ మలయాళం మూవీ 2023, జూన్ 9న థియేటర్లలో రిలీజైంది. కొల్లా అంటే దోపిడీ అని అర్థం. ఇది ఆనీ (రజిషా విజయన్), శిల్పా (ప్రియా ప్రకాష్ వారియర్) అనే ఇద్దరు అమ్మాయిల చుట్టూ తిరిగే కథ. ఈ ఇద్దరూ ఓ బ్యాంకు దోపిడీ చేస్తారు. ఓ చిన్న ఊళ్లో బ్యూటీ పార్లర్ పెట్టి.. పక్కనే ఉన్న కోఆపరేటివ్ బ్యాంకు దోపిడీకి ప్లాన్ చేస్తారు. అనుకున్నట్లే దోచేస్తారు.

వాళ్లు ఆ దోపిడీ ఎందుకు చేస్తారు? పోలీసులకు ఎలా చిక్కుతారు? వాళ్ల నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి మాస్టర్ ప్లాన్ వేస్తారు? వాళ్ల భవిష్యత్తు ఏం కానుంది అన్నదే ఈ కొల్లా మూవీ స్టోరీ. ఈ సినిమాను సూరజ్ వర్మ డైెరెక్ట్ చేశాడు. దీనికి ఐఎండీబీలో 5.5 రేటింగ్ నమోదైంది.

కేవలం రెండు గంటల నిడివి ఉన్న ఈ సినిమాకు థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాలేదు. తర్వాత ప్రైమ్ వీడియోలో మలయాళం ఆడియోతో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇక ఇప్పుడు ఈటీవీ విన్ ఓటీటీలో తెలుగు డబ్బింగ్ వెర్షన్ స్ట్రీమింగ్ కానుంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024