ప్రభాస్ ది రాజా సాబ్ కోసం ప్రపంచంలో అతిపెద్ద సెట్.. హైదరాబాద్‌కు 20 కి.మీ. దూరంలోనే.. ఆ సెట్ లోపల ఎలా ఉంటుందో చూస్తారా?

Best Web Hosting Provider In India 2024

ప్రభాస్ ది రాజా సాబ్ కోసం ప్రపంచంలో అతిపెద్ద సెట్.. హైదరాబాద్‌కు 20 కి.మీ. దూరంలోనే.. ఆ సెట్ లోపల ఎలా ఉంటుందో చూస్తారా?

Hari Prasad S HT Telugu

ప్రభాస్ ది రాజా సాబ్ మూవీ కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ సెట్ వేశారన్న విషయం మీకు తెలుసా? హైదరాబాద్ కు కేవలం 20 కి.మీ. దూరంలో ఉన్న అజీజ్‌నగర్ లో ఈ సెట్ ఉంది. ఆ సెట్ లోపల ఎలా ఉంటుందో హిందుస్థాన్ టైమ్స్ మీ ముందుకు తీసుకు వచ్చింది.

ప్రభాస్ ది రాజా సాబ్ కోసం ప్రపంచంలో అతిపెద్ద సెట్.. హైదరాబాద్‌కు 20 కి.మీ. దూరంలోనే.. ఆ సెట్ లోపల ఎలా ఉంటుందో చూస్తారా?

ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ మూవీ టీజర్ ఈ మధ్యే రిలీజైన విషయం తెలుసు కదా. అయితే ఈ మూవీ కోసం అత్యంత భారీ సెట్ నిర్మించారన్న విషయం మీకు తెలుసా? ఆరు నెలలుగా ఈ సెట్ లోనే ప్రభాస్, సంజయ్ దత్ లాంటి స్టార్లు షూటింగ్ చేస్తున్నారు.

మూవీని నిర్మిస్తున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ భారీ సెట్ ను నిర్మించింది. దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ సెట్ గా చెబుతున్నారు. ఇండియాలోనే అతిపెద్ద హారర్ మూవీగా మేకర్స్ చెబుతున్న ది రాజా సాబ్ సెట్ ఎలా ఉందో చూడండి.

‘ది రాజాసాబ్’ కోసం భారీ సెట్

ది రాజాసాబ్‘ టీజర్ ఈ మధ్యే రిలీజైంది. ఈ హారర్ ఫాంటసీ మూవీలో మరోసారి వింటేజ్ ప్రభాస్ ను చూసే అవకాశం అభిమానులకు కలగనుంది. ఇక ఈ సినిమాలో ఎక్కువ భాగం టైటిల్ పాత్ర పోషించిన రాజా సాబ్ (సంజయ్ దత్) ఉండే రాజభవనం లాంటి సెట్లోనే మూవీ షూటింగ్ జరుగుతోంది.

షూటింగ్ ను సులభతరం చేయడానికి, నిర్మాత టి.జి. విశ్వ ప్రసాద్, దర్శకుడు మారుతి స్టూడియోలో 160 అడుగుల బై 220 అడుగుల స్థలంలో మొత్తం భవనాన్ని ఒకే చోట నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఈ భారీ 38000 చదరపు అడుగుల సముదాయాన్ని రాతితోపాటు ఫైబర్, కలపతో నిర్మించారు. ఇందులో రెండు అంతస్తులు ఉన్నాయి. ఇది వంటశాలల నుండి లైబ్రరీల వరకు, డైనింగ్ హాల్స్ నుండి భయంకరమైన మెట్ల వరకు కలిగి ఉండటం విశేషం.

ఈ సెట్ ఎలా వేశారంటే..

ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ నంబియార్ ఈ భారీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాడు. “ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ సెట్” అని అతడు చెప్పాడు. “ప్రపంచంలో ఎక్కడా ఈ పరిమాణం, స్థాయిలో ఒకే సెట్‌ను మీరు చూడలేరు. దీనిని నిర్మించడానికి 1000-1200 మంది వ్యక్తులు ప్రతిరోజూ 4-6 నెలల పాటు పనిచేశారు” అని నంబియార్ వెల్లడించాడు.

ఇది భారతదేశంలోనే అతిపెద్ద సినిమా సెట్ అని మేకర్స్ అంటున్నారు. చిత్రీకరణ పూర్తయిన తర్వాత వారు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుండి ధ్రువీకరణ కోసం కూడా వెళ్లే అవకాశం ఉంది. ఈ భారీ సెట్లో షాండ్లియర్లది ప్రత్యేక పాత్ర. 100 అడుగుల వరకూ ఉన్న నాలుగు భారీ షాండ్లియర్లు మొదట్లోనే కనిపిస్తాయి. 16 మంది కూర్చేనే వీలున్న ఓ పెద్ద డైనింగ్ టేబుల్ పై మరో భారీ షాండ్లియర్ చూడొచ్చు.

సెట్‌లో భయపెట్టే గది

ఇంత పెద్ద సెట్లో ఓ భయంకరమైన గది కూడా ఉంది. ఇక్కడ వెంటిలేషన్ అస్సలు ఉండదు. ఈ సినిమా దర్శకుడు మారుతి.. దీనిని సరదాగా పూజ గది అని పిలుస్తాడు. లోపల చూస్తే అది చాలా భయంకరమైనది అని తెలుస్తుంది. బ్లాక్ మ్యాజిక్, క్షుద్ర పూజల తాలూకు ఆనవాళ్లు, గోడలపై రక్తపు మరకలు, నకిలీ మానవ అవశేషాలు వంటివి కూడా ఇందులో ఉండటం గమనార్హం. ఈ గది సినిమాలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని సినిమా బృందం చెబుతోంది.

దర్శకుడు మారుతి మూవీ షూటింగ్ పై స్పందిస్తూ.. ఇప్పటికే 90% పూర్తయిందని, కొన్ని సన్నివేశాలు ఇంకా మిగిలి ఉన్నాయని వెల్లడించాడు. ఇప్పటికే 8 నెలలు ఆలస్యమైంది. వీఎఫ్‌ఎక్స్ పని భారీగా ఉండటం, పోస్ట్-ప్రొడక్షన్ దీనికి కారణమని మారుతి చెప్పాడు. సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ భారీ సెట్ ను ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. దీనిని కూల్చేస్తారా లేక సందర్శకుల కోసం అనుమతిస్తారా అన్నది చూడాలి.

ది రాజా సాబ్ మూవీ కోసం వేసిన భారీ సెట్ లోపల ఇలా..
ది రాజా సాబ్ మూవీ కోసం వేసిన భారీ సెట్ లోపల ఇలా.. (HT Photos /Abhimanyu Mathur)
ఈ సెట్లోని లైబ్రరీ రూమ్. వీటిలోని వందల సంఖ్యలో బుక్స్
ఈ సెట్లోని లైబ్రరీ రూమ్. వీటిలోని వందల సంఖ్యలో బుక్స్ (HT Photos /Abhimanyu Mathur)
సెట్లోని ఓ భయంకరమైన పియానో, రాజా సాబ్ సంజయ్ దత్ భారీ ఫొటో
సెట్లోని ఓ భయంకరమైన పియానో, రాజా సాబ్ సంజయ్ దత్ భారీ ఫొటో (HT Photos/Abhimanyu Mathur)
చిత్ర హింసలకు గురి చేసే ప్రత్యేకమైన గది ఇదే
చిత్ర హింసలకు గురి చేసే ప్రత్యేకమైన గది ఇదే (HT Photos /Abhimanyu Mathur)
హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024