




Best Web Hosting Provider In India 2024

ప్రైమ్ వీడియోను ఊపేస్తున్న నవీన్ చంద్ర సినిమాలు.. టాప్ 3 ట్రెండింగ్‌లో రెండు అతనివే.. రెండూ క్రైమ్ థ్రిల్లర్సే..
అమెజాన్ ప్రైమ్ వీడియోను ఊపేస్తున్నాయి టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర సినిమాలు. టాప్ 3 ట్రెండింగ్ లో అతనికి చెందినవే రెండు సినిమాలు ఉండటం విశేషం. థియేటర్లలో వీటికి పెద్దగా రెస్పాన్స్ రాకపోయినా.. ఓటీటీలో మాత్రం దుమ్ము రేపుతున్నాయి.
నవీన్ చంద్ర.. ఎప్పుడో అందాల రాక్షసి మూవీతో పాపులర్ అయిన నటుడు. ఈ మధ్యే ఈ మూవీ రీరిలీజ్ కూడా అయింది. అదే సమయంలో అతడు నటించిన రెండు సినిమాలు లెవెన్ (Eleven), బ్లైండ్ స్పాట్ (Blind Spot) సినిమాలు ప్రైమ్ వీడియోలో దూసుకెళ్తున్నాయి. టాప్ 3 ట్రెండింగ్ సినిమాల జాబితాలో ఈ రెండూ ఉండటం విశేషం.
ప్రైమ్ వీడియోలోని నవీన్ చంద్ర మూవీస్
అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి ఈ మధ్యే నవీన్ చంద్ర నటించిన రెండు సినిమాలు అడుగుపెట్టాయి. అందులో ఒకటి లెవెన్ కాగా.. మరొకటి బ్లైండ్ స్పాట్. వీటిలో లెవెన్ మూవీ తెలుగు సహా వివిధ భాషల్లో వచ్చింది. తమిళ వెర్షన్ అయితే ప్రస్తుతం ట్రెండింగ్ సినిమాల్లో తొలి స్థానంలో ఉండటం విశేషం. ఇక ఇదే మూవీ తెలుగు వెర్షన్ ఐదో స్థానంలో ఉంది.
మరోవైపు బ్లైండ్ స్పాట్ మూవీ మూడో స్థానంలో ఉంది. ఇదో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా. ఓ గృహిణి సూసైడ్ కేసు మర్డర్ అని పసిగడతాడు పోలీస్. ఆ తర్వాత ఆ కేస్ ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే బ్లైండ్ స్పాట్. రాశి సింగ్, రవి వర్మ, గాయత్రి భార్గవి, అలీ రెజా నటించిన బ్లైండ్ స్పాట్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
లెవెన్ మూవీ గురించి..
లెవెన్ మూవీ మే 16న థియేటర్లలో రిలీజైంది. అప్పుడు కూడా ఈ సినిమాకు మంచి రివ్యూలే వచ్చాయి. దీంతో ఇప్పుడీ మూవీ ప్రైమ్ వీడియోలో రెండు వెర్షన్లలో ఒకటి టాప్ లో, మరొకటి 5వ స్థానంలో ట్రెండింగ్ అవుతున్నాయి. ఇది కూడా క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీయే. వైజాగ్‌లో మొహం కూడా తెలియకుండా జరిగే హత్యలను చేధించే కథతో సాగే ఈ సినిమాకు లోకేష్ అజీల్స్ దర్శకత్వం వహించాడు.
ఐఎమ్‌డీబీలో 7.9 రేటింగ్ సాధించిన లెవెన్ మూవీ ఓటీటీలో దూసుకెళ్తోంది. ఊహించని మలుపులు, థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేటివ్ ఎలిమెంట్స్‌తో మనల్ని సీట్లో నుంచి లేవకుండా చేసే క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఈ లెవెన్. ఈ రెండు సినిమాలను మీరు ఇప్పటి వరకూ చూసి ఉండకపోతే వెంటనే అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వెళ్లి చూసేయండి.
సంబంధిత కథనం