కన్నప్పలో కొడుకును చూసి గర్వపడుతున్న మంచు విష్ణు.. ఈ సినిమాతోనే అరంగేట్రం.. ఎమోషనల్ పోస్ట్ చేసిన మంచు హీరో

Best Web Hosting Provider In India 2024

కన్నప్పలో కొడుకును చూసి గర్వపడుతున్న మంచు విష్ణు.. ఈ సినిమాతోనే అరంగేట్రం.. ఎమోషనల్ పోస్ట్ చేసిన మంచు హీరో

Hari Prasad S HT Telugu

కన్నప్ప మూవీతో మంచు విష్ణు తనయుడు అవ్రామ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సందర్భంగా ఈ మూవీ బిహైండ్ ద సీన్స్ వీడియో ఒకటి షేర్ చేస్తూ విష్ణు ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. అతని రియాక్షన్ ఎలా ఉందో చూడండి.

కన్నప్పలో కొడుకును చూసి గర్వపడుతున్న మంచు విష్ణు.. ఈ సినిమాతోనే అరంగేట్రం.. ఎమోషనల్ పోస్ట్ చేసిన మంచు హీరో

పాన్ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా విడుదల కాబోతున్న మూవీ కన్నప్ప. ఇందులో మంచు విష్ణు లీడ్ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ ద్వారానే విష్ణు చిన్న కుమారుడు అవ్రామ్ (7) ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. దీనిపై విష్ణు తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఇది తన జీవితంలో అత్యంత భావోద్వేగ క్షణాలలో ఒకటి అని విష్ణు అన్నాడు.

విష్ణు మంచు ఏమన్నాడంటే?

విష్ణు మంచు తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో ఒక తెరవెనుక (BTS) వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియోలో అవ్రామ్ సినిమా సెట్‌లో ఎంతో చురుగ్గా అటూ ఇటూ తిరుగుతూ, తాను నటించిన సీన్లను చూసుకుంటూ కనిపిస్తున్నాడు. అవ్రామ్ తన తండ్రితో మాట్లాడుతూ, కాస్ట్యూమ్‌లు వేసుకుంటూ, తన డైలాగులు ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు.

ఈ వీడియోను విష్ణు షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ఏడేళ్ల వయసులోనే తెరంగేట్రం చేస్తున్న తన కొడుకుని చూసి అతడు గర్వపడుతున్నాడు. వీడియో చివర్లో అవ్రామ్.. సెట్‌లో విల్లు, బాణాలతో ఆడుకోవడం కూడా చూడొచ్చు.

ఇది జీవితాంతం నిలిచిపోయే జ్ఞాపకం

ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని విష్ణు చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. “నా చిట్టి అవ్రామ్, కన్నప్పతో అరంగేట్రం చేస్తున్నాడు. వాడు సెట్‌లోకి అడుగు పెట్టడం, డైలాగులు చెప్పడం, తన కలను సాకారం చేసుకోవడం అనేది నా జీవితంలో అత్యంత భావోద్వేగ క్షణాలలో ఒకటి.

ఒక తండ్రిగా, నేను ఒకప్పుడు కన్న కలలనే నా కొడుకు కూడా నిజం చేసుకోవడం చూడటం కంటే గొప్ప సందర్భం మరొకటి లేదు. ఇది కేవలం అరంగేట్రం కాదు. ఇది జీవితాంతం నిలిచిపోయే జ్ఞాపకం” అని విష్ణు అభిప్రాయపడ్డాడు.

“మీరు నాకు ఎల్లప్పుడూ ఇచ్చిన ప్రేమ, ఆశీర్వాదాలను వాడిపై కూడా కురిపిస్తారని ఆశిస్తున్నాను. అవ్రామ్ ప్రయాణం మొదలవుతుంది. అది కన్నప్పతోనే మొదలవుతుంది. హర్ హర్ మహాదేవ్ ” అని విష్ణు అన్నాడు.

కన్నప్ప మూవీ గురించి..

ఈ పౌరాణిక ఫాంటసీ థ్రిల్లర్ మూవీని శివుడికి గొప్ప భక్తుడైన కన్నప్ప పురాణం ఆధారంగా రూపొందించారు. ఈ మూవీలో విష్ణు మంచు కన్నప్ప పాత్రలో నటిస్తుండగా.. మోహన్ బాబు, శరత్‌కుమార్, ప్రభాస్, మోహన్ లాల్ వంటి నటీనటులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

ఈ సినిమాలో అక్షయ్ కుమార్ శివుడిగా, మోహన్‌లాల్ కిరాతుడిగా, ప్రభాస్ రుద్రుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతి దేవిగా కనిపించనున్నారు. ఈ మూవీ జూన్ 27న థియేటర్లలో విడుదల కానుంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024