





Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి వచ్చేసిన రెండు మలయాళం సినిమాలు.. ఓ సిరీస్.. డిఫరెంట్ జోనర్స్.. కామెడీ, రొమాన్స్, క్రైమ్ థ్రిల్లర్.. ఎక్కడంటే?
ఓటీటీ ఆడియన్స్ ను అలరించేందుకు మలయాళ ఫిల్మ్స్ వచ్చేశాయి. రెండు సినిమాలు, ఓ సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. డిఫరెంట్ జోనర్లో వచ్చిన ఈ రెండు సినిమాలు, సిరీస్ ఈ రోజు (జూన్ 20) ఓటీటీలో అడుగుపెట్టాయి. అవి ఏమిటీ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో ఇక్కడ చూసేయండి.
మలయాళ సినిమాలకు ఓటీటీలో ఉండే క్రేజే వేరు. డిజిటల్ స్ట్రీమింగ్ లో తెలుగు ఫ్యాన్స్.. మలయాళ సినిమాలకు పట్టం కడుతుంటారు. స్టోరీ బాగుంటే చాలు తెగ చూసేస్తారు. ఇప్పుడు అలాంటి రెండు సినిమాలు, ఓ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేశాయి. మలయాళం సినిమాలు, సిరీస్ ఈ రోజు (జూన్ 20) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అవి ఏమిటంటే?
ఆప్ కైసే హో
బ్యాచిలర్ పార్టీ నేపథ్యంలో సాగే కామెడీ సినిమా ‘ఆప్ కైసే హో’. కడుపుబ్బా నవ్వంచే ఈ మలయాళ సినిమా శుక్రవారం నుంచి ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. సన్ నెక్ట్స్ లో ఈ మూవీని చూడొచ్చు. ప్రధాన పాత్రలో ధ్యాన్ శ్రీనివాసన్ నటించిన ఈ చిత్రంలో పెళ్లికి ముందు చేసుకునే బ్యాచిలర్ పార్టీ కారణంగా ఎలాంటి గందరగోళం తలెత్తిందనే విషయాన్ని ఫన్నీగా చూపించారు. లైట్-హార్టెడ్ ప్రీ-వెడ్డింగ్ గందరగోళం నుండి తీవ్రమైన పోలీసు దర్యాప్తుల వరకు ఈ మలయాళం మూవీ మంచి కామెడీ అందిస్తుంది.
కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2
మలయాళంలో ఫస్ట్ వెబ్ సిరీస్ గా వచ్చిన కేరళ క్రైమ్ ఫైల్స్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్ గా కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2 వచ్చేసింది. క్రైమ్ థ్రిల్లర్ గా సాగే ఈ సిరీస్ కచ్చితంగా గూస్ బంప్స్ తెప్పించే అవకాశముంది. కేసు దర్యాప్తులో ఎదురైన సవాళ్లను పోలీసులు దాటే తీరు, మధ్యలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు, ఉత్కంఠను పెంచే సన్నివేశాలు ఇలా ఈ సిరీస్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. శుక్రవారం నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ
మోడర్న్ లవ్, రొమాన్స్, ఫ్యామిలీ సంబంధాలను చాటే సినిమానే ‘ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ’. ఈ సినిమా జీ5 ఓటీటీలోకి వచ్చేసింది. ఈ కథ కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత కోరికల మధ్య బ్యాలెన్స్ ను చక్కగా చూపిస్తోంది. హీరో జీవితం సోషల్ మీడియాలో అమ్మాయి నుంచి వచ్చే మ్యారేజీ ప్రపోజల్ తో మలుపు తీసుకుంటుంది. ఈ చిత్రం సంప్రదాయాల మార్పులను నావిగేట్ చేస్తున్న నేటి ప్రేక్షకులకు సమకాలీన అంశాలైన మ్యాచ్‌మేకింగ్ తదితర విషయాల గురించి చెప్తుంది.
సంబంధిత కథనం