కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: గుంజీలు తీసిన జ్యోత్స్న.. చంపేస్తానంటూ పారిజాతం ప్లాన్.. దీపకు విజిల్ నేర్పించిన కార్తీక్

Best Web Hosting Provider In India 2024

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: గుంజీలు తీసిన జ్యోత్స్న.. చంపేస్తానంటూ పారిజాతం ప్లాన్.. దీపకు విజిల్ నేర్పించిన కార్తీక్

కార్తీక దీపం 2 సీరియల్ జూన్ 20 ఎపిసోడ్ లో పందెం ఓడిపోయిన జ్యోత్స్నతో గుంజీలు తీయిస్తాడు కార్తీక్. జ్యోత్స్న కోసం అవసరమైతే కుటుంబాన్ని చంపేస్తా అని పారిజాతం అంటుంది. మరోవైపు అనసూయకు దీప, కార్తీక్ పై అనుమానాలు వస్తాయి. దీపకు విజిల్ నేర్పిస్తాడు కార్తీక్. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇక్కడ చూసేయండి.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎసిసోడ్ లో నేను నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని చంపేశావ్, అంతకుమించిన హత్య లేదు, అంతకుమించిన నేరం లేదు అందుకే నువ్వొక హంతకురాలివి అని దీపతో కోపంతో సుమిత్ర అని లోపలికి వెళ్లిపోతుంది. ఈ మాటలను భరించలేని దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. కానీ నా భార్యను భోజనం తినేలా చేసినందుకు కార్తీక్, దీపకు దశరథ్ థ్యాంక్యూ చెప్తాడు. వంటలు బాగున్నాయని దశరథ్ అంటే చాలా వరస్ట్ గా ఉన్నాయని జ్యోత్స్న వెళ్లిపోతుంది. పారిజాతంతో వెటకారాన్ని కొనసాగిస్తాడు కార్తీక్.

పందెం ఓడిపోయిన జ్యో

పెద్ద మేడం మేం ఒకటి కాదు కదా పందెం అంటే పందెం అని కార్తీక్ గుర్తు చేస్తాడు. మన పందెం కోపం గురించి కాదు భోజనం గురించి అని జ్యోత్స్నకు చెప్తాడు కార్తీక్. చిన్న మేడం కడుపు నిండా భోజనం తిన్నారు కాబట్టి గుంజీలు తీయాల్సిందేనని కార్తీక్ ఖరాకండీగా చెప్పేస్తాడు. అందరినీ పిలిచి పంచాయతీ పెట్టేస్తా అని కార్తీక్ అంటే.. జ్యోత్స్న గుంజీలు తీసేందుకు రెడీ అవుతుంది. జ్యోత్స్న గుంజీలు తీస్తుంటే దీప కౌంట్ చేస్తుంది. 50 గుంజీలు తీశాక కార్తీక్ స్టాప్ అంటాడు. పెద్ద మేడం ఫిట్ నెస్ కు మరో 50 కూడా చేస్తుంది అని కార్తీక్ అంటాడు.

ఐయామ్ వెయిటింగ్

నువ్వే గెలిచావ్ అని కార్తీక్ తో జ్యో అంటే.. దీప విజిల్ వేసేందుకు ట్రై చేస్తుంది. బావను నేనున్నా కదా అన్నీ నేను నేర్పిస్తా అని పారు ఓ విజిల్ వేసుకో అని కార్తీక్ అంటాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పారు పెద్దగా విజిల్ వేస్తుంది. విలన్ మీద హీరో గెలిచినప్పుడు సీటీ మార్ కొడితే సౌండ్ తో థియేటర్ పగిలిపోతుంది అని కార్తీక్ అంటాడు. గెలిచానని సంబరపడకు, నాతో హాఫ్ సెంచరీ కొట్టించావ్ కదా ఏదో ఒక రోజు నీతో సెంచరీ కొట్టిస్తా అని జ్యో వార్నింగ్ ఇస్తుంది. ఐయామ్ వెయిటింగ్ అంటూ చిరంజీవి రేంజ్ లో చెప్తాడు కార్తీక్.

ఆత్మాభిమానం

ఇటు కార్తీక్ ఇంట్లో అమ్మమ్మ చాలా మంచిది నాన్నమ్మ అని కాంచనతో శౌర్య చెప్తుంది. మా వదిన తీనలేదు కదా అని కాంచన బాధపడుతుంటే తినిపించాం కదా అని కార్తీక్ చెప్తాడు. తినను అంటే బావ ఊరుకుంటాడా అని దీప చెప్తుంది. ప్రతి మనిషికి ఓ వీక్ నెస్ ఉంటుంది అని కార్తీక్ అంటాడు. సుమిత్ర, దీప ఇద్దరిదీ ఒకే లక్షణం ఆత్మాభిమానం, ఆత్మ గౌరవం. నువ్వు నా భార్య చేతి వంట తింటే ఎక్కడ మనసు మారిపోతుందోనని తినకుండా తప్పించుకుంటాన్నావ్ అని రెచ్చగొట్టే అంతే వెంటనే తినేసి ఎవరి వంటలు ఏం చేయలేవ్ అని వెళ్లిపోయింది.

అనసూయ సందేహాలు

బంగారం లాంటి మేనకోడలు ఉండగా బెంగ ఎందుకమ్మా అని కాంచనతో అంటాడు కార్తీక్. తన కుటుంబం అంటూ మళ్లీ కవర్ చేస్తాడు కార్తీక్. మీరేం చేసినా దానికో అర్థం ఉంది అంటూ మురిసిపోతుంది కాంచన. దీప నా తమ్ముడి కూతురు కాదని ఆమెకు తెలిసినప్పటి నుంచి ఏదో తేడాగా ఉన్నారు చెల్లెమ్మా అని మనసులో అనుకుంటుంది అనసూయ. ఏదో తేడాగా ఉందని అనుకుంటుంది అనసూయ.

కోపం కూడా ప్రేమే

కోపం కూడా ప్రేమే శౌర్య అని కూతురుకు చెప్తుంది దీప. అమ్మమ్మ నువ్వు కూతురు కాదు కదా, మరి నువ్వు నన్ను చూసినట్లు అమ్మమ్మ నిన్ను ఎలా చూస్తుంది అని శౌర్య అంటుంది. దీప కన్నవాళ్ల గురించి తెలుసుకోవాలనుంది, ఆ దాసు వస్తే బాగుండు అని మనసులోనే అనుకుంటుంది అనసూయ. బిడ్డ బాధపడితే తల్లి ఊరుకుంటుందా? ఎందుకంటే అది తల్లి మనసు కాబట్టి, లేని వాళ్లను ఉన్నవాళ్లలో చూసుకోవచ్చు కదా అని శౌర్యతో కార్తీక్ చెప్తాడు.

దీప థ్యాంక్యూ

మా అత్తలో ఉన్న తల్లి మనసు ఈ తల్లి మనసును తెలుసుకోవచ్చు కదా అని శౌర్యతో అంటాడు కార్తీక్. నాకేం అర్థం కాలేదు అని శౌర్య అంటే తర్వాత అన్నీ అర్థం అవుతాయి అంటూ తినడానికి వెళ్తారు కార్తీక్, శౌర్య. నేను పుట్టాలని కోరుకున్నందుకు, నా కోసం కొడుకును కన్నందుకు, నన్ను కోడలిని చేసుకున్నందుకు థ్యాంక్యూ అని అనసూయను ఉద్దేశించి మనసులోనే అనుకుంటుంది దీప.

విలన్ పారు

జ్యోత్స్న కాళ్లు నొక్కుతూ కార్తీక్ పెద్ద జాదూగాడు అని పారు చెప్తుంది. వాడితో సంతకం పెట్టించుకుని నిప్పుల కుంపటి నెత్తి మీద పెట్టుకున్నావ్ అని పారు అంటుంది. మాటలతో గొంతు నొక్కుతున్నావని జ్యో కోపంతో అంటుంది. వాళ్లకు ఏదో తెలిసింది, నీ కొడుకు ఏదో చెప్పి ఉంటాడు, నేను ఈ ఇంటి వారసురాలిని కాదు అని పారుతో జ్యోత్స్న చెప్తుంది. నీ కొడుకును వీళ్లే ఏదో చేసి ఉంటే, ఎక్కడైనా మనిషిని దాచి ఉంటారేమో అని అనుమానపడింది జ్యో.

నా కొడుకు నిజం చెప్పడు ఎందుకంటే వాడికి గతం గుర్తులేదు అని పారు అంటుంది. నిజం తెలియాలి అంటే వాడు రావాలి అని చెప్తుంది. నేను ఏ ఉద్దేశ్యంతో అయితే నిన్ను ఈ ఇంటిదాన్ని చేశానో ఆ ఉద్దేశ్యం నెరవేరకుండా ఎవరూ ఆపలేరు అని విలన్ వాయిస్ లో చెప్తుంది పారు. ఆపితే బతకరు, అవసరమైతే ఈ ఇంటిల్లిపాదినీ చంపేయడానికి కూడా రెడీ అని పారు అంటుంది. నువ్వు ఇదే మాట మీద ఉండూ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను అని జ్యో అంటుంది.

విజిల్ వేస్తే

శౌర్యకు పూరీ అంటే ఇష్టం అదే టిఫిన్ చేయమని దీపతో అంటాడు కార్తీక్. విజిల్ నేర్పించమంటూ బెడ్ పైనా అడుగుతుంది కార్తీక్. దీపకు విజిల్ ఎలా వేయాలో నేర్పిస్తాడు కార్తీక్. దీప వేస్తే విజిల్ రాకపోవడంతో కార్తీక్ నవ్వుతాడు. దీప నోట్లో కార్తీక్ వేళ్లు పెట్టగానే విజిల్ వేస్తుంది. దీంతో శౌర్య ఉలిక్కిపడి లేస్తుంది. శౌర్యను పడుకోబెట్టి.. దీప, శౌర్య కూడా నిద్రకు ఉపక్రమిస్తారు. ఇప్పుడు అన్ని సరదాలు తీరిపోతున్నాయని కార్తీక్ అంటాడు. నాన్న ముందు నువ్వు పడుకో అని శౌర్య అనడంతో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024