





Best Web Hosting Provider In India 2024

తిరుపుతి వీధుల్లో భిక్షమెత్తా.. హీరో ధనుష్ సంచలన వ్యాఖ్యలు
సినిమా కోసం ఎంత దూరమైనా వెళ్తానని మరోసారి తమిళ స్టార్ హీరో ధనుష్ నిరూపించారు. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన కుబేర మూవీ కోసం ఆయన తిరుపతి వీధుల్లో భిక్షమెత్తారు. ఈ విషయాన్ని ధనుష్ స్వయంగా వెల్లడించారు.
ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న లీడ్ రోల్స్ చేసిన కుబేర మూవీ ఈ రోజు రిలీజైంది. జూన్ 20న థియేటర్లకు వచ్చేసింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీపై ఇప్పటికైతే మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. యూఎస్ ప్రీమియర్స్, ఇక్కడ స్పెషల్ షోలు చూసిన వాళ్ల టాక్ బాగుంది. ఈ సినిమాలో ధనుష్ బిచ్చగాడి పాత్రలో నటించారు. నాగార్జున రిచ్ పర్సన్ క్యారెక్టర్ లో కనిపించారు. ఈ ఇద్దరి చుట్టూ కథ తిరుగుతోంది. కుబేర రిలీజ్ సందర్భంగా ధనుష్ ఈ మూవీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
వీధుల్లో భిక్షాటన
శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సోషల్ డ్రామా చిత్రం కుబేరలో జాతీయ అవార్డు గ్రహీత నటుడు ధనుష్ తన జీవితంలోని సవాళ్లను ఎదుర్కొనే బిచ్చగాడి పాత్రలో కనిపించారు. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డానని ధనుష్ తెలిపారు. తిరుపతి వీధుల్లో భిక్షాటన చేశాననన్నారు. ఈ క్యారెక్టర్ లో వీధుల్లో అడుక్కున్నా అని వెల్లడించారు.
‘‘దర్శకుడి పేరు, పేరు ప్రఖ్యాతులను నమ్మి వెంటనే ఈ సినిమాకు ఒప్పుకున్నా. కానీ చివరికి తిరుపతి వీధుల్లో నన్ను భిక్షాటన చేయించారు. ‘కుబేర’ నా 51వ తమిళ చిత్రం, సర్ తర్వాత నా రెండో తెలుగు సినిమా. నిజానికి సర్ కంటే ముందే శేఖర్ సార్ కుబేర స్క్రిప్ట్ తో నన్ను సంప్రదించారు’’ అని ధనుష్ తెలిపారు.
వేరే లెవల్
కుబేర మూవీలో హీరో ధనుష్ వేరే లెవల్ యాక్టింగ్ చేశారనే టాక్ వినిపిస్తోంది. ఇంతముందెప్పుడూ లేని విధంగా బిచ్చగాడి క్యారెక్టర్ చేశారు. అలాగే ఓ బిచ్చగాడు ప్రభుత్వాన్ని ప్రమాదంలో పడేసేలా ఈ స్టోరీ లైన్ సాగుతోంది. అతని కోసం నాగార్జున సాగించే వేట సినిమాకు మంచి హైప్ తెచ్చిందని సమాచారం. ఈ సినిమా కోసం బిచ్చగాడి గెటప్ లో ధనుష్ బాగానే కష్టపడ్డారు. వీధుల్లో భిక్షాటన చేయడంతో పాటు గంటల తరబడి డంపింగ్ యార్డులో చెత్త మధ్య షూటింగ్ చేశారు.
గుర్తుపట్టలేనంతగా
కుబేర ట్రైలర్ లో ధనుష్ ను చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ట్రైలర్ లో మందపాటి గడ్డంతో, చిరిగిన దుస్తులు ధరించి దాదాపు గుర్తుపట్టలేనంతగా కనిపించారు. నాగార్జున, రష్మిక మందన్న, జిమ్ సర్భ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ధనుష్ కు ఈ ఏడాది ఫస్ట్ ఫిల్మ్. ఈ మూవీ పాన్ ఇండియా రిలీజ్ కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్ సీ) అనుమతి ఇచ్చింది. ఒరిజినల్ కట్ నుంచి 19 సన్నివేశాలను కట్ చేయడంతో కుబేరకు సీబీఎఫ్ సీ నుంచి యూఏ సర్టిఫికేట్ లభించింది. అమిగోస్ క్రియేషన్స్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ‘కుబేర’ జూన్ 20న విడుదలైంది.
సంబంధిత కథనం