విపరీతంగా చాట్​జీపీటీ వాడుతున్నారా? ఇక మెదడు పనిచేయదు!

Best Web Hosting Provider In India 2024


విపరీతంగా చాట్​జీపీటీ వాడుతున్నారా? ఇక మెదడు పనిచేయదు!

Sharath Chitturi HT Telugu

ప్రతి చిన్న విషయానికి చాట్​జీపీని వాడటం అలవాటైపోయిందా? అయితే జాగ్రత్త! చాట్​జీపీటీ వినియోగంతో బ్రెయిన్​ ఎంగేజ్​మెంట్​ పడిపోతోందని తాజా అధ్యయనం షాకింగ్​ వివరాలను వెల్లడించింది..

విపరీతంగా చాట్​జీపీటీ వాడుతున్నారా? (REUTERS)

విపరీతమైన చాట్​జీపీటీ వినియోగంతో ప్రజల్లో సైడ్​ ఎఫెక్ట్స్​ కనిపిస్తున్నట్టు ఎంఐటీ మీడియా ల్యబ్​ పరిశోధకుల తాజా అధ్యయనం వెల్లడించింది. ఏఐ చాట్​బాట్​ వినియోగంతో బ్రెయిన్​ ఎంగేజ్​మెంట్​ నానాటికీ పడిపోతోందని ఈ అధ్యయనం ఆందోళన వ్యక్తం చేసింది.

చాట్​జీపీటీ విపరీతంగా వాడితే..

బోస్టన్ ప్రాంతానికి చెందిన 18 నుంచి 39 సంవత్సరాల వయస్సు గల 54 మందిపై పలు నెలల పాటు ఈ అధ్యయనం నిర్వహించారు. ప్రతి ఒక్కరినీ చాట్‌జీపీటీ, గూగుల్ సెర్చ్ లేదా ఎటువంటి డిజిటల్ సాధనం లేకుండా (బ్రెయిన్​ ఓన్లీ) వ్యాసాలు రాయమని కోరారు.

ఫలితాలు షాక్​కి గురి చేశాయి! 32 మెదడు ప్రాంతాలలో మెదడు కార్యకలాపాలను ట్రాక్ చేసిన ఈఈజీ స్కాన్‌లు.. చాట్‌జీపీటీని ఉపయోగించిన వారిలో అత్యల్ప స్థాయి బ్రెయిన్​ ఎంగేజ్​మెంట్​ చూపించాయి. ఈ వినియోగదారులు “నాడీ, భాషా, ప్రవర్తనా స్థాయిలలో నిలకడగా తక్కువ పనితీరును కనబరిచారు,” అని పరిశోధకులు తెలిపారు.

అధ్యయనం చివరి వచ్చేసరికి.. పరిశోధనలో పాల్గొన్న వారు పెద్దగా ఏం పనిచేయలేదు. కాపీ- పేస్ట్​ పద్ధతులను అనుసరించారు అంతే!

మరోవైపు, ఎటువంటి సహాయం లేకుండా వ్యాసాలు రాసిన “మెదడు-మాత్రమే” (brain-only) సమూహంలోని వారు అత్యధిక నాడీ కనెక్టివిటీని చూపించారు. ముఖ్యంగా సృజనాత్మకత, జ్ఞాపకశక్తి. సెమాంటిక్ ప్రాసెసింగ్‌తో సంబంధం ఉన్న ఆల్ఫా, తీటా, డెల్టా బ్యాండ్‌లలో ఇది స్పష్టంగా కనిపించింది. ఈ సమూహం తమ పని పట్ల ఎక్కువ ఉత్సుకత, ఓనర్​షిప్​, సంతృప్తిని వ్యక్తం చేసింది.

గూగుల్ సెర్చ్ ఉపయోగించిన వారు కూడా హై ఎంగేజ్​మెంట్​, సంతృప్తిని ప్రదర్శించారు. పరిశోధకుల ప్రకారం.. ఎక్కువ మంది వినియోగదారులు సమాచారం కోసం సాంప్రదాయ సెర్చ్ ఇంజిన్‌లకు బదులుగా ఏఐ చాట్‌బాట్‌లను ఆశ్రయిస్తున్నందున ఈ వ్యత్యాసం గమనించదగినది.

చాట్‌జీపీటీ వినియోగదారుల్లో తక్కువ బ్రెయిన్​ ఎంగేజ్​మెంట్​..

వ్యాసాలు పూర్తి చేసిన తర్వాత, పార్టిసిపెంట్లను తమ మునుపటి డ్రాఫ్ట్‌లలో ఒకదానిని సవరించమని కోరారు. చాట్‌జీపీటీ సమూహంలోని వారు, ఇప్పుడు ఆ సాధనం లేకుండా రాస్తున్నప్పుడు, తమ మునుపటి పనిని గుర్తుచేసుకోవడానికి కష్టపడ్డారు! తక్కువ మెదడు తరంగ కార్యకలాపాలను చూపించారు.

దీనికి విరుద్ధంగా, మెదడు-మాత్రమే వినియోగించిన సమూహానికి, తిరిగి రాయడానికి చాట్‌జీపీటీకి ప్రాప్యత కల్పించినప్పుడు, మెదడు కనెక్టివిటీ పెరిగింది. ఇది చురుకైన, స్వతంత్ర ఆలోచన తర్వాత ఉపయోగించినట్లయితే ఏఐ అభ్యాసాన్ని మెరుగుపరుస్తుందని సూచిస్తుంది.

ఈ అధ్యయనానికి ఇంకా పీర్ రివ్యూ అవ్వలేదు. సాపేక్షంగా చిన్న నమూనాతో నిర్వహించినప్పటికీ, ఇది జనరేటివ్ ఏఐ విస్తృత ప్రభావాన్ని పరిశీలిస్తున్న ఎంఐటీ వద్ద పెరుగుతున్న పరిశోధనలకు తోడ్పడుతుంది. ల్యాబ్ నుంచి గత అధ్యయనాలు కూడా ఏఐ విస్తృత వినియోగాన్ని ఒంటరితనం పెరిగిన భావాలతో ముడిపెట్టాయి.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link