





Best Web Hosting Provider In India 2024

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మీనా ఫస్ట్ నైట్‌కు ఆటంకాలు- హల్వా మత్తులో మనోజ్- బాలుతో గొడవకు శోభన కన్నింగ్ ప్లాన్
గుండె నిండా గుడి గంటలు జూన్ 20 ఎపిసోడ్లో నల్లపూసల కార్యక్రమం పేరుతో శ్రుతి, రవిని ఇంటికి పిలిచి బాలుతో గొడవ పుట్టించాలని శ్రుతి తల్లి శోభన ప్లాన్ వేస్తుంది. శ్రుతి, రవిలను శాశ్వతంగా అత్తింట్లో ఉంచేలా ప్లాన్ చేస్తుంది. మీనాతో ఫస్ట్ నైట్ ప్లాన్ చేసిన బాలుకు ఇంట్లోవాళ్ల వల్ల ఆటంకాలు ఏర్పడతాయి.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో అల్లుడు రవిని ఇంటికి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు, నల్లపూసలు కార్యక్రమం గ్రాండ్‌గా చేసి ఇక్కడే ఉండేలా ప్లాన్ చేశాను అని శ్రుతి తల్లి శోభన చెబుతుంది. ఎంత చేసిన రెండు రోజులు మాత్రమే ఉంచగలం. తర్వాత ఎలా ఉంటారు అని సురేంద్ర అంటాడు.
మీనా పట్టించుకోవట్లేదు
నేను అన్నీ ప్లాన్ చేసే ఇవన్నీ చేస్తున్నాను. ఒక్కసారి ఇక్కడికి వస్తే వెళ్లకుండా చేస్తాను. పెద్ద గొడవ చేయడానికే ఫంక్షన్ చేస్తున్నాను. బాలును రెచ్చగొడితే చాలు వాడే గొడవ చేస్తాడు. ఏం చేస్తానో మీరే చూస్తారుగా అని శోభన అంటుంది. మరోవైపు రాత్రిపూట సడెన్‌గా లేచి మీనా పనులు పట్టించుకోవట్లేదు. టిఫిన్‌కు పిండి కలిపిపెట్టిందో లేదో అంటుంది ప్రభావతి.
ఇంకొకరు ఉంటే మూటముళ్లే పెట్టి పంపించేవాన్ని. కట్టుకున్న భార్యవి కాబట్టి చచ్చినట్లు భరిస్తున్నాను అని సత్యం అంటాడు. నేనేం చేశాను అని ప్రభావతి అంటుంది. ఇంటి చాకిరి మీనా చేస్తున్న మీనాను అంటున్నావా అని తిడతాడు సత్యం. మీకు పాలు తీసుకొస్తాను అని విజిల్ పట్టుకుని కిందకు వెళ్తుంది ప్రభావతి. బెడ్ మీద రొమాంటిక్‌గా రోహిణితో మాట్లాడుతాడు మనోజ్.
విజిల్స్ వేస్తూ
ఇంతలో ప్రభావతి విజిల్ వేయడంతో మనోజ్ ఆగిపోతాడు. మరోవైపు రవి, శ్రుతి పరిస్థితి కూడా ఇలాగే అవుతుంది. అర్ధరాత్రుళ్లు విజిల్స్ వేయడం ఏంటీ అని బాలు అంటాడు. తర్వాత పాల గురించి మీనాను అడుగుతుంది. పాలు తీసుకొచ్చి ఇచ్చిన మీనా అన్ని పనులు చేసినట్లు చెబుతుంది మీనా. తర్వాత ప్రభావతి వెళ్లిపోతుంది. తర్వాత పాలు తీసుకొచ్చి బాలుకు ఇస్తుంది మీనా.
ఫస్ట్ నైటా అని బాలు అంటే మీనా సిగ్గుపడుతుంది. తర్వాత బాలు మల్లెపూలు తీసి మీనాకు పెడతాడు. ఇప్పుడు ఫస్ట్ నైట్ పెళ్లికూతురిలా ఉన్నావ్ అని చెప్పిన బాలు హల్వా ఇస్తాడు. కొత్త పెళ్లికొడుకులా చేస్తున్నారు అని మీనా అంటుంది. నాగు సిగ్గేస్తుంది అని మీనా అంటే ఎవరు రారు అని బాలు అంటాడు. ఇంతలో బిర్యానీ ఆర్డర్ పెట్టినట్లు కిందకు వస్తుంది శ్రుతి.
వరస్ట్ నైట్
బిర్యానీ వచ్చిందని తీసుకెళ్లిపోతుంది శ్రుతి. ఇక్కడే కూర్చుని తింటుంది. ఇది ఫస్ట్ నైట్ కాదు వరస్ట్ నైట్ అని బాలు అంటాడు. మళ్లీ వాటర్ బాటిల్లో నీళ్లు లేవని మళ్లీ కిందకు వస్తుంది ప్రభావతి. కింద శ్రుతి బిర్యాని తింటుంది. వీళ్లు ఇంకా పడుకోలేదు కాబట్టి నేను కూడా ఓ పట్టు పట్టొచ్చు అని ప్రభావతి అనుకుంటుంది. ప్రభావతిని శ్రుతి తినమంటే వెంటనే తింటుంది ప్రభావతి.
చాలా బాగుందనుకుంటూ ఇద్దరు తింటారు. శ్రుతి వెళ్లిపోతుంది. తర్వాత ప్రభావతి కూడా వెళ్లిపోతుంది. ఆ తర్వాత మనోజ్, రోహిణి కిందకు వస్తారు. బాలు పక్కన పెట్టిన హల్వాను మనోజ్, రోహిణి తింటారు. పడుకున్నట్లు చేసిన బాలు ఇకనుంచి ఇంటికి ఏది తీసుకురాకూడదు అంటారు. దా పైకి వెళ్దాం అని మనోజ్ అంటే తాగినవాడిలా చేస్తున్నావేంటీ అని రోహిణి అంటుంది.
మత్తుగా మనోజ్
అంతా హల్వా మయం. బాగా పనిచేస్తుందని రోహిణిని పైకి తీసుకెళ్తాడు మనోజ్. తర్వాత మీనా వచ్చిన సైలెంట్‌గా పడుకుంటాడు బాలు. అర్ధరాత్రి నిద్రలేచిన ప్రభావతి బిర్యానీ అరగకా అటు ఇటు నడుస్తుంది. ఏమైందని సత్యం అడుగుతాడు.
చికెన్ అరగలేదని కిందకు వెళ్లి నడుస్తానని వెళ్తుంది ప్రభావతి. ఇలా బాలు మీనా ఫస్ట్ నైట్‌కు అన్నీ ఆటంకాలు ఎదురవుతాయి. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్