





Best Web Hosting Provider In India 2024

నిన్ను కోరి జూన్ 20 ఎపిసోడ్: ప్రెగ్నెన్సీ ఎలా వస్తుందో కూడా నీకు తెలియదా? కూతురిపై కోప్పడిన తల్లి.. చంద్రకళ వార్నింగ్!
నిన్ను కోరి సీరియల్ జూన్ 20 ఎపిసోడ్‌లో శ్యామల తమ గదిలో పడకోకుండా ప్లాన్ చేస్తారు. కానీ, శ్యామల దోమల స్ప్రే కొడుతుంది. దోమల స్ప్రే వాసన భరించలేక తల్లీకూతుళ్లు డోర్ తీస్తారు. దాంతో శ్యామల వెళ్లి పడుకుంటుంది. చంద్రకళ సెకండ్ నైట్ తర్వాత వాంతులు వచ్చినట్లు చేస్తుంది. అది చూసి శ్రుతి భయపడిపోతుంది.
నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రెండో కార్యంలో విరాట్ వాటర్ తాగుతూ చంద్ర నడుము చూసి సోఫాపై నీళ్లు పడేలా చేస్తాడు. దాంతో బెడ్ మీద పడుకుంటానని పడుకుంటుంది చంద్రకళ. విరాట్ కూడా అదే బెడ్‌పై మరోవైపు పడుకుంటాడు. మరోవైపు శ్రుతి వాళ్ల గదిలోకి శ్యామల రావడం చూసి కామాక్షిని లేపుతుంది. గురక సౌండ్ తట్టుకోలేమని అనుకుంటారు.
దోమల స్ప్రే కొట్టి
దాంతో మనమే లాక్ వేసుకుని నిద్రపోయినట్లు చేస్తే రాకుండా వెళ్లిపోతుందని కామాక్షి చెప్పడంతో డోర్ లాక్ వేస్తుంది శ్రుతి. నేను వస్తానని తెలిసి ఎందుకు లాక్ చేసుకున్నారని శ్యామల పిలిస్తుంది. కానీ, తల్లీకూతుళ్లు పలకరు. చెబుతా మీ సంగతి అని దోమల స్ప్రే తీసుకొచ్చి కిటికీ లోనుంచి గదిలోకి కొడుతుంది శ్యామల. దోమల స్ప్రే వాసన తట్టుకోలేక కామాక్షి, శ్రుతి లేస్తారు. ఊపిరాడక విలవిల్లాడుతారు.
ఊపిరి ఆడక వెళ్లి డోర్ తీస్తారు శ్రుతి, కామాక్షి. ఇలా దోమల స్ప్రే కొట్టి మమ్మల్ని చంపేస్తావా. లోపల తిప్పుతుంది అని కామాక్షి అంటుంది. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని వెళ్లి శ్యామల గురక పెట్టి పడుకుంటుంది. ఇక ఏం చేయలేక లోపలికి వెళ్లిపోతారు తల్లీకూతుళ్లు. మరుసటి రోజు ఉదయం విరాట్‌ను నిద్రలేపి ఫస్ట్ నైట్ రోజు శోభనం జరిగినట్లు గెటప్ మార్చేయమని చంద్రకళ అంటుంది.
చంద్రకు ప్రెగ్నెన్సీ
తప్పుతుందా నాకు అని చంద్రకళ గెటప్ చెరిపేస్తాడు విరాట్. నువ్వు నిజంగా నన్ను అర్థం చేసుకున్న రోజు వాటంతటా అవే జరగాలి అని చంద్ర అంటుంది. చంద్ర ముద్దు పెట్టడానికి ట్రై చేస్తే విరాట్ ఆపుతాడు. బయట శ్రుతి కంగారుగా చూస్తుంటుంది. ఇంతలో మళ్లీ చంద్రకళ బొట్టు చెరిగి, పూలు వాడిపోయి కనిపిస్తుంది. సెకండ్ నైట్ కూడా సక్సెస్‌ఫుల్‌గా జరిగిందని శ్రుతి ఫీల్ అవుతుంది.
వీళ్లకు ఓ ఝలక్ ఇస్తాను అని వాంతులు చేసుకున్నట్లు చేస్తుంది చంద్ర. వాంతులు కూడా చేసుకుంటుంది అంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లే కదా. ఇక నేను బావ మీద ఆశలు వదులుకునేడేనా శ్రుతి బాధపడుతుంది. రెండు రోజులకే ప్రెగ్నెన్సీ ఎలా వస్తుందే. పెళ్లీడుకు వచ్చావ్ ప్రెగ్నెన్సీ ఎలా వస్తుందో కూడా తెలియదా అని కూతురు శ్రుతిని తల్లి కామాక్షి కోప్పడుతుంది.
క్లారిటీగా చెప్పు
ఇంతలో శాలిని వచ్చి ఎందుకు ఏడుపు మొహం పెట్టావ్ అని శ్రుతిని అడుగుతుంది. దాంతో జరిగింది కామాక్షి చెబుతుంది. విరాట్ రాని నేనే అడుగుతాను అని కామాక్షి అంటుంది. సూటిగా అడుగుతాను క్లారిటీగా చెప్పు. చంద్రకు నీకు ఫస్ట్ నైట్ జరిగిందా అని కామాక్షి అంటుంది. నా గురించి తెలిసి ఎలా అడుగుతున్నావని విరాట్ అంటాడు.
తనను టచ్ కూడా చేయలేదు. నేనే గెటప్ మారుస్తున్నా అని విరాట్ అంటాడు. దాంతో శ్రుతి సంతోషిస్తుంది. కిచెన్‌లో ఉన్న చంద్ర దగ్గరికి వెళ్లి కాఫీ ఇవ్వమని ఓవర్ చేస్తుంది శ్రుతి. దాంతో ఇంగువ కలిపి కాఫీ ఇస్తుంది చంద్ర. ఇంతలో కామాక్షి వచ్చి ఏంటే ఎక్కువ చేస్తున్నావంటే నీకు కూడా అదే కలుపుతా అని వార్నింగ్ ఇస్తుంది చంద్రకళ. విరాట్‌కు కాఫీ తీసుకెళ్లి ఇస్తుంది చంద్రకళ. విరాట్‌కు ఎక్కిళ్లు వస్తే శ్రుతి హడావిడి చేస్తుంది.
చంద్రకళ వార్నింగ్
అది చంద్రకళకు నచ్చదు. లే అని కోపంగా తోస్తుంది చంద్రకళ. నీకు సిగ్గులేదా. ఆల్రెడీ పెళ్లయిన వ్యక్తి మీద పడతావేంటీ అని వార్నింగ్ ఇస్తుంది చంద్రకళ. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్