నాది మిడిల్ క్లాస్ క్యారెక్టర్.. మూడు సొసైటీల మధ్య క్లాష్ ఉంటుంది.. హీరో నాగార్జున కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

నాది మిడిల్ క్లాస్ క్యారెక్టర్.. మూడు సొసైటీల మధ్య క్లాష్ ఉంటుంది.. హీరో నాగార్జున కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

నాగార్జున డిఫరెంట్ రూల్‌లో కనిపించనున్న సినిమా కుబేర. డైరెకట్ర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర సినిమాలో నాగార్జునతోపాటు ధనుష్, రష్మిక మందన్నా ముఖ్య పాత్రలు పోషించారు. ఇవాళ (జూన్ 20) థియేటర్లలో కుబేర రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ విశేషాలను హీరో నాగార్జున పంచుకున్నారు.

నాది మిడిల్ క్లాస్ క్యారెక్టర్.. మూడు సొసైటీల మధ్య క్లాష్ ఉంటుంది.. హీరో నాగార్జున కామెంట్స్

సరికొత్త పాత్రలో హీరో నాగార్జున అలరించడానికి సిద్ధంగా ఉన్న సినిమా కుబేర. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర మూవీలో నాగార్జునతోపాటు తమిళ స్టార్ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ముఖ్య పాత్రలు పోషించారు.

పాన్ ఇండియాగా కుబేర రిలీజ్

ఇవాళ (జూన్ 20) థియేటర్లలో పాన్ ఇండియా స్థాయిలో కుబేర సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో నాగార్జున ఇంట్రెస్టింగ్‌ సినీ విశేషాలను పంచుకున్నారు.

కుబేర లాంటి మల్టీస్టారర్ ప్రాజెక్ట్ చేయడానికి కారణం?

-మంచి కథలు రావాలంటే స్టార్స్ కలిసి పనిచేయాలి. ఇంతకుముందు కూడా నేను చాలా సినిమాలు చేశాను. నాన్నగారు (ఏఎన్ఆర్) ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు.. ఇలా అంతమంది కలిసి ఎన్నో సినిమాలు చేశారు.

శేఖర్ కమ్ముల గారితో వర్క్ చేయాలని ఎప్పటినుంచో ఉండేది. ఆనంద్ మూవీ దగ్గర నుంచి ఆయన సినిమాలు గురించి మనందరికీ తెలుసు. ఆయన సినిమాలు నాకు బాగా ఇష్టం. ఆయన కథల్లో సోషల్ రెలివెంట్ పాయింట్ ఉంటుంది. మిగతావన్నీ కూడా కమర్షియల్‌గానే ఉంటాయి. అద్భుతమైన పాటలు ఉంటాయి.

కుబేరలో ఉన్న యూనిక్ పాయింట్ ఏమిటి ?

కుబేరలో చాలా మంచి యూనిక్ పాయింట్ ఉంది. ఇప్పుడున్న సొసైటీకి ఆ పాయింట్ చాలా రిలెవెంట్. శేఖర్ గారికి ఈ పాయింట్ మైండ్‌లో ఎప్పటినుంచో ఉంది. ఈ సినిమాల్లో మంచోళ్లు ఉన్నారు. చెడ్డోళ్లు ఉన్నారు. అల్ట్రా రిచ్, మిడిల్ క్లాస్, బిలో పావర్టీ లైన్.. ఇలా మూడు సొసైటీల మధ్య క్లాష్ ఈ సినిమాలో ఉంటుంది.

ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?

-నాది మిడిల్ క్లాస్ క్యారెక్టర్. సీబీఐ ఆఫీసర్ క్యారెక్టర్‌లో కనిపిస్తాను. మంచి చేయాలా? చెడు చేయాలా? అనే సంఘర్షణ మధ్య ఆ క్యారెక్టర్ ఉంటుంది. నా క్యారెక్టర్‌లో చాలా షేడ్స్ ఉంటాయి.

-శేఖర్ కమ్ముల నా క్యారెక్టర్‌ని చాలా అద్భుతంగా రాశారు. షటిల్ పర్ఫామెన్స్‌కి మంచి స్కోప్ ఉండే క్యారెక్టర్. ఇందులో చాలా అద్భుతమైన ఇన్సిడెంట్స్ ఉంటాయి. అవన్నీ కూడా రియల్ లైఫ్‌కి రిలేటెడ్‌గా ఉంటాయి. ధనుష్ తన పాత్రలో ఒదిగిపోయాడు. అద్భుతంగా చేశాడు.

శేఖర్ గారు మీ ఇమేజ్‌కి తగ్గట్టు స్క్రిప్ట్‌లో ఏమైనా మార్పులు చేశారా ?

-లేదండి. ఆయన (శేఖర్ కమ్ముల) ఏమనుకున్నారో అదే చేశారు. నేను కూడా ఎలాంటి మార్పులు అడగలేదు. మారిస్తే చెడిపోతుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024