చెరిగిపోని పచ్చబొట్టు.. సమంత మెడపై చైతన్య మూవీ నేమ్.. తాజా ఫొటోలు వైరల్

Best Web Hosting Provider In India 2024

చెరిగిపోని పచ్చబొట్టు.. సమంత మెడపై చైతన్య మూవీ నేమ్.. తాజా ఫొటోలు వైరల్

సమంత తన మెడపై ఉన్న ‘వైఎంసీ’ టాటూ తొలగించుకుందని ఇటీవల వార్తలొచ్చాయి. ఓ వీడియోలో ఆ టాటూ కనిపించలేదు. కానీ రీసెంట్ ఫొటోల్లో ఆ టాటూ ఉంది. ఇప్పుడు ఇందుకు సంబంధించిన సమంత ఫొటోలు వైరల్ గా మారాయి.

సమంత మెడపై పచ్చబొట్టు (x)

స్టార్ నటి సమంత బాడీపై టాటూస్ ఉన్న సంగతి తెలిసిందే. నాగ చైతన్యను గతంలో పెళ్లి చేసుకున్న ఆమెతో కొన్ని మెమొరీస్ ఎప్పటికీ నిలిచిపోవాలని టాటూస్ వేయించుకుంది. కానీ చైతో విడాకులు తీసుకున్న తర్వాత ఆ పచ్చబొట్లను చెరిపేస్తోంది. ఈ క్రమంలో మెడపై ఉన్న వైఎంసీ టాటూను కూడా తొలగించుకుంది అనే వార్తలు వచ్చాయి. కానీ రీసెంట్ ఫొటల్లో ఆ టాటూ కనిపించింది.

ఆ వీడియోలో మిస్

సమంత రూత్ ప్రభు రీసెంట్ గా తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియో షేర్ చేసింది. నథింగ్ టు హైడ్ ప్రకటనతో జూన్ 6న వీడియో పెట్టింది. ఈ వీడియోలో సమంత కెమెరా దగ్గరికి వెళ్లి మార్కర్ తో ‘నథింగ్ టు హైడ్’ అని రాస్తోంది. ఆ తర్వాత ఆమె వెనుదిరిగి వెళ్లిపోతుంది. వెనక్కి వెళ్లిపోతున్న సమయంలోనే సమంత శరీరంపై టాటూ మిస్ అయిన సంగతి ఫ్యాన్స్ కంటపడింది.

పెళ్లి చేసుకున్నప్పుడు

సమంత పోస్టు చేసిన వీడియోలో ఆమె శరీరం వెనుక భాగంలో మెడ కింద ‘వైఎంసీ’ అనే టాటూ లేదు. తన వీపుపై కొన్నేళ్ల క్రితం నాగచైతన్యను పెళ్లి చేసుకున్నప్పుడు వేయించుకున్న టాటూ అప్పుడు మిస్ అయింది. ‘ఏ మాయ చేసావే‘ సినిమాను సూచిస్తూ సమంత వేసుకున్న వైఎంసీ టాటూ కనిపించడం లేదని కొందరు అభిమానులు పేర్కొన్నారు. ‘సమంత తన వైఎంసీ టాటూను తొలగించింది’ అని ఓ అభిమాని కామెంట్ చేశాడు. “నాకు పచ్చబొట్టు కనిపించడం లేదు” అని మరొకరు పేర్కొన్నారు.

జిమ్ బయట ఫొటోలు

సమంత ఇటీవల ముంబయిలోని జిమ్ నుంచి బయటకు వస్తూ ఫొటోగ్రాఫర్ల కంట పడింది. ఫొటోలు తీయొద్దని సమంత ఫైర్ అయినా ఫొటోగ్రాఫర్లు క్లిక్ మనిపించారు. ఈ ఫొటోల్లో కొన్ని బ్యాక్ సైడ్ నుంచి ఉన్నాయి. ఈ ఫొటోల్లోనే సమంత మెడపై వైఎంసీ టాటూ కనిపించింది. దీంతో ఆ యాడ్ వీడియో కోసం సమంత టాటూను కవర్ చేసిందని, ఆ పచ్చబొట్టు చెరిగిపోలేదని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

ఆ సినిమాతోనే

సమంతకు ఏ మాయ చేసావే పచ్చబొట్టు ఎంతో స్పెషల్. 2010లో సమంత నటిగా అరంగేట్రం చేసిన చిత్రం ఏ మాయ చేసావే. హీరో నాగ చైతన్యకు ఆమెను పరిచయం చేసింది కూడా ఆ సినిమానే. కొన్నాళ్లకు డేటింగ్ మొదలుపెట్టిన వీరిద్దరూ 2017లో పెళ్లి చేసుకున్నారు. యితే నాగచైతన్య, సమంత 2020లో విడిపోగా, 2021లో విడాకులు ఖరారయ్యాయి. సమంత ఇటీవల ప్రొడ్యూసర్ గా మారి శుభం మూవీ నిర్మించింది. డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ లో ఉందనే రూమర్లు బలంగా వినిపిస్తున్నాయి.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024