





Best Web Hosting Provider In India 2024

సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు ఎమోషనల్ డ్రామా.. ఐఎండీబీలో 8.2 రేటింగ్.. ఇక్కడ చూడండి
ఓటీటీలోకి ఓ తెలుగు ఎమోషనల్ డ్రామా స్ట్రీమింగ్ కు వచ్చింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సైలెంట్ గా శుక్రవారం (జూన్ 20) డిజిటల్ ప్రీమియర్ అయింది. ఈ సినిమాకు ఐఎండీబీలో 8.2 రేటింగ్ ఉండటం విశేషం.
తెలుగు మూవీ ఒక బృందావనం ఓటీటీలోకి వచ్చేసింది. గత నెల 23న థియేటర్లలో రిలీజైన ఈ ఎమోషనల్ డ్రామా.. నెల రోజుల్లోపే ఓటీటీలోకి అడుగుపెట్టింది. అయితే ఈ విషయం స్ట్రీమింగ్ మొదలైన తర్వాతగానీ ఆ ఓటీటీ వెల్లడించలేదు. ఓ అబ్బాయి, ఓ అమ్మాయి, మరో చిన్నారి చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఒక బృందావనం ఓటీటీ స్ట్రీమింగ్
ఓటీటీలోకి శుక్రవారం (జూన్ 20) అడుగుపెట్టిన మూవీ ఒక బృందావనం. ఈ సినిమాను ఈటీవీ విన్ ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తోంది. ఆ విషయాన్ని ఆ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
“కొత్త వైబ్స్. కొత్త ముఖాలు. స్వచ్ఛమైన భావోద్వేగాలు. ఒక బృందావనం ఇప్పుడు ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది” అనే క్యాప్షన్ తో ఈటీవీ విన్ ఈ విషయం తెలిపింది. ఈ సందర్భంగా మూవీలోని ప్రధాన క్యారెక్టర్లు ఉన్న పోస్టర్ ను కూడా పోస్ట్ చేసింది.
ఒక బృందావనం మూవీ గురించి..
ఒక బృందావనం మూవీ మే 23న థియేటర్లలో రిలీజైంది. బొత్స సత్య డైరెక్ట్ చేసిన ఈ సినిమాను కిశోర్ తాటికొండ, వెంకట్ రేగట్టె, ప్రహ్లాద్ బొమ్మినేని, మనోజ్ నిర్మించారు. ఇందులో బాలు, షిన్నోవా, శుభలేఖ సుధాకర్, అన్నపూర్ణమ్మ ముఖ్యమైన పాత్రలు పోషించారు. సన్నీ, సాకేత్ మ్యూజిక్ అందించారు. ఈ లోబడ్జెట్ సినిమాకు ఐఎండీబీలో మాత్రం 8.2 రేటింగ్ రావడం విశేషం.
ఈ సినిమా రాజా విక్రమ్ (బాలు) అనే ఓ కెమెరామ్యాన్, మహి (షిన్నోవా) అనే అమ్మాయి, నైనికా (సాన్విత) అనే ఓ చిన్నారి చుట్టూ తిరుగుతుంది. రాజా విక్రమ్ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు. అటు మహి కూడా తన తల్లి కథను రాయాలని అనుకుంటూ ఉంటుంది. మరోవైపు నైనికా తాను చాలా రోజుల కిందటే కోల్పోయిన తల్లిదండ్రుల కోసం వెతుకుతూ ఉంటుంది. ఈ చిన్నారి ద్వారానే రాజా విక్రమ్, మహి కలుసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? వీళ్ల జీవితాలు ఎలాంటి మలుపు తిరిగిందన్నదే ఈ సినిమా స్టోరీ.
ఈ సినిమాకు థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాలేదు. మరి ఇప్పుడు ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీకి డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
సంబంధిత కథనం