ఓటీటీలోకి తెలుగులో వచ్చిన సూపర్ హిట్ కన్నడ లీగల్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో 9.2 రేటింగ్.. ఎక్కడ చూడాలంటే?

Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి తెలుగులో వచ్చిన సూపర్ హిట్ కన్నడ లీగల్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో 9.2 రేటింగ్.. ఎక్కడ చూడాలంటే?

Hari Prasad S HT Telugu

కన్నడ సూపర్ హిట్ లీగల్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు తెలుగులో ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది. థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ అయింది. శుక్రవారం (జూన్ 20) నుంచే ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఓటీటీలోకి తెలుగులో వచ్చిన సూపర్ హిట్ కన్నడ లీగల్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో 9.2 రేటింగ్.. ఎక్కడ చూడాలంటే?

కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన లీగల్ థ్రిల్లర్ మూవీ యుద్ధకాండ ఛాప్టర్ 2. ఈ ఏడాది ఏప్రిల్ 18న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. రెండు నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. కన్నడతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం. ఐఎండీబీలో ఏకంగా 9.2 రేటింగ్ సొంతం చేసుకున్న సినిమా ఇది.

యుద్ధకాండ ఛాప్టర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్

యుద్ధకాండ్ ఛాప్టర్ 2 సినిమా శుక్రవారం (జూన్ 20) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీకి మొదటి షో నుంచే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.

అలాంటి సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ అయింది. ఒకేసారి కన్నడతోపాటు తెలుగు ఆడియోతోనూ రావడంతో ఇక్కడి ప్రేక్షకులను కూడా మూవీ అలరించబోతోంది. అజయ్ రావ్, అర్చన జోయిస్ లాంటి వాళ్లు నటించిన సినిమా ఇది.

యుద్ధకాండ ఛాప్టర్ 2 గురించి..

కన్నడ ఇండస్ట్రీ నుంచి కోర్టురూమ్ డ్రామాలు చాలా అరుదుగా వస్తుంటాయి. తాజాగా వచ్చిన యుద్ధకాండ ఛాప్టర్ 2 అలాంటి సినిమానే. పవన్ భట్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను తానే నిర్మించి లీడ్ రోల్లో నటించాడు అజయ్ రావు. ఈ మూవీ కోర్టులో జరిగే ఓ హత్యతో మొదలవుతుంది. ఈ హత్యను నివేదిత (అర్చన జోయిస్) చేసిందంటూ ఆమెపై ఐపీసీ 302 కింద కేసు నమోదవుతుంది. అయితే ఆమె తరఫున అడ్వొకేట్ భరత్ (అజయ్ రావు) కోర్టులో వాదిస్తాడు.

అవతలి వైపు అతని గురువు అయిన సీనియర్ లాయర్ రాబర్ట్ డిసౌజా (ప్రకాష్ బెలవాడి) ఉంటాడు. ఈ గురుశిశ్యుల కోర్ట్ రూమ్ డ్రామానే ఈ యుద్ధకాండ ఛాప్టర్ 2 మూవీ. ఈ సినిమాలో కోర్టు సన్నివేశాలు ఉత్కంఠభరితంగా ఉన్నాయి. మూవీలో అజయ్ రావు, అర్చన పోటాపోటీ నటన కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కోర్ట్ రూమ్ డ్రామాకు ఓ సోషల్ మెసేజ్ జోడించి తీసిన ఈ యద్ధకాండ ఛాప్టర్ 2 మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024