ఆనాటి ముద్దులేవి అని అడుగుతున్న యువ జంట.. ఓటీటీలోకి మరో రొమాంటిక్ మూవీ

Best Web Hosting Provider In India 2024

ఆనాటి ముద్దులేవి అని అడుగుతున్న యువ జంట.. ఓటీటీలోకి మరో రొమాంటిక్ మూవీ

Hari Prasad S HT Telugu

ఓటీటీలోకి మరో రొమాంటిక్ తెలుగు మూవీ రాబోతోంది. ఈటీవీ విన్ కథాసుధలో భాగంగా ఆ షార్ట్ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది. అయితే వెరైటీ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా పోస్టర్ కూడా ఆసక్తి రేపుతోంది.

ఆనాటి ముద్దులేవి అని అడుగుతున్న యువ జంట.. ఓటీటీలోకి మరో రొమాంటిక్ మూవీ

ఆనాటి ముద్దులేవి అంటూ ఓ యువ జంట నేరుగా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. గత మూడు నెలలుగా ప్రతి ఆదివారం ఓ కొత్త షార్ట్ మూవీని తీసుకొస్తున్న ఈటీవీ విన్ ఈసారి కూడా అలాంటిదే మరో సినిమాను అందిస్తోంది. ఈ సినిమా పేరు ఏవి… అలనాటి ముద్దులు. మరి ఈ సినిమా విశేషాలేంటో చూడండి.

ఏవి… అలనాటి ముద్దులు ఓటీటీ స్ట్రీమింగ్

ఈటీవీ విన్ ఓటీటీ కథా సుధలో భాగంగా ఈ ఆదివారం (జూన్ 22) సరికొత్త షార్ట్ మూవీ ఏవి.. అలనాటి ముద్దులు రాబోతోంది. ఈ విషయాన్ని శుక్రవారం (జూన్ 20) ఆ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

“ఊహించని అనురాగం, భావోద్వేగాల కథ ఇది. ఏవి అలనాటి ముద్దులు.. కథా సుధ నుంచి వస్తున్న ఈ కథ జూన్ 22 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. స్టోరీ, స్క్రీన్‌ప్లే, ప్రొడ్యూసర్, దర్శకత్వ పర్యవేక్షణ కే రాఘవేంద్రరావు కాగా.. డైరెక్టర్ రాంకీ. కృష్ణకాంత్ డైలాగులు అందించాడు. అర్జున్ కల్యాణ్, నటాషా నటించారు. కిరణ్ కుమార మ్యూజిక్ అందించాడు” అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ ఈ విషయం తెలిపింది.

ఈటీవీ విన్ కథా సుధ మూవీస్

ఈటీవీ విన్ కథా సుధలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రతి ఆదివారం ఓ కొత్త షార్ట్ మూవీ వస్తున్న విషయం తెలిసిందే. 30 నుంచి 40 నిమిషాల నిడివితో ఇవి ఉంటున్నాయి. గత ఆదివారం కూడా ప్రేమంటే ఇది కదా పేరుతో ఓ కొత్త షార్ట్ మూవీ వచ్చింది. ఇక ఈ వారం ఏవి.. అలనాటి ముద్దులు పేరుతో మరొకటి వస్తోంది.

ఈటీవీ విన్ ఓటీటీ కొన్ని నెలలుగా కథా సుధ పేరుతో ఓ సరికొత్త సిరీస్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రతి ఆదివారం ఓ సరికొత్త షార్ట్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే 12 ఎపిసోడ్లు వచ్చేశాయి. జూన్ 22న 13వ ఎపిసోడ్ వస్తోంది. కథాసుధలో భాగంగా ఏప్రిల్ 6న తొలి మూవీ స్ట్రీమింగ్ అయింది. ఆ రోజు ఉత్తరం, లైఫ్ పార్ట్‌నర్ అనే రెండు ఎపిసోడ్లు వచ్చాయి.

ఆ తర్వాత లవ్ యు నానమ్మ, వెండి పట్టీలు, ట్రింగ్ ట్రింగ్, పెంకుటిల్లు, సుందరం గాడి ప్రేమ కథ, కాలింగ్ బెల్, నాతి చరామి, అమృతవల్లి, డియర్ డాడీ,ప్రేమంటే ఇది కదా లాంటి షార్ట్ మూవీస్ వచ్చాయి.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024