షాకింగ్.. నాని, హిట్ 3 టీమ్ కు మద్రాస్ హైకోర్టు లీగల్ నోటీసులు.. స్టోరీ కాపీ కొట్టారనే కేసు

Best Web Hosting Provider In India 2024

షాకింగ్.. నాని, హిట్ 3 టీమ్ కు మద్రాస్ హైకోర్టు లీగల్ నోటీసులు.. స్టోరీ కాపీ కొట్టారనే కేసు

క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యాక్షన్ థ్రిల్లర్ గా థియేటర్లలో ఆడియన్స తో విజిల్స్ కొట్టించిన హిట్ 3 మూవీకి చిక్కొచ్చిపడింది. హిట్ 3 కథను తన నుంచి కాపీ కొట్టారని విమలవేలన్ అనే స్క్రిప్ట్ రైటర్ ఆరోపించడంతో మద్రాస్ హైకోర్టు నానితో పాటు మూవీ టీమ్ కు లీగల్ నోటీసులు పంపింది.

హిట్ 3లో నాని స్టిల్

థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన నాని సినిమా హిట్ 3కి షాక్ తగిలింది. మద్రాస్ హై కోర్టు నానితో పాటు హిట్ 3 టీమ్ కు తాజాగా లీగల్ నోటీసులు పంపించింది. ఈ సినిమా కథను తన నుంచి కాపీ కొట్టారని స్క్రిప్ట్ రైటర్ విమలవేలన్ అలియాస్ విమల్ ఆరోపించారు. విమల్ పిటిషన్ తో మద్రాస్ హై కోర్టు నోటీసులు పంపించింది.

తన కథ అని

సూపర్ హిట్ ఫ్రాంఛైజీ హిట్ లో మూడో సినిమాగా హిట్ ది థర్డ్ కేస్ సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా స్టోరీ తనదేనని విమల్ ఆరోపిస్తున్నారు. స్టోరీ కాపీ కొట్టారంటూ అతను మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు లైవ్ లా నివేదిక పేర్కొంది. హిట్ 3 స్టోరీ తన కథకు అనధికారిక అనుసరణ అని విమల్ హైకోర్టుకు తెలిపారు. ఇది 2021 ఆగస్టు 4 న సౌత్ ఇండియన్ ఫిల్మ్ రైటర్స్ అసోసియేషన్లో రిజిస్టర్ అయిన స్క్రిప్ట్ కాపీ అని అతను పేర్కొన్నారు.

నానికి స్క్రిప్ట్

తనతో కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో 2022 ఆగస్టు 8న నానికి స్క్రిప్ట్ సమర్పించానని, కానీ ఎలాంటి స్పందన రాలేదని విమల్ పేర్కొన్నారు. కానీ హిట్ 3 విడుదలయ్యాక థియేటర్స్ లో చూశానన్నారు. చిన్న చిన్న మార్పులతో తన కథనే సినిమాగా తీశారని తెలిసి షాక్ అయ్యానని స్క్రిప్ట్ రైటర్ విమల్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. తన స్క్రిప్ట్ కు, సినిమాకు ఉన్న పోలికల జాబితాను కూడా సమర్పించారు.

ఇప్పటికే నోటీసులు

తన మేధో సంపత్తిని ఉల్లంఘించడం మానుకోవాలని విమల్ గతంలో నానితో పాటు హిట్ 3 టీంకు లీగల్ నోటీసులు పంపినా స్పందన లేదు. సినిమా లాభాల్లో 20 శాతం నష్టపరిహారం చెల్లించాలని విమల్ డిమాండ్ చేస్తున్నారు. ఆ చిత్ర బృందం తనకు ఆర్థికంగా నష్టం కలిగించిందని ఆయన వాదిస్తున్నారు. రైటర్స్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోతున్నారు. దీనిపై స్పందించేందుకు హైకోర్టు హిట్ 3 బృందానికి జూలై 7 వరకు గడువు ఇచ్చింది.

సూపర్ హిట్

హిట్: ది థర్డ్ కేస్ శైలేష్ కొలను హిట్ ఫ్రాంచైజీలో మూడవ భాగం. 2020 లో విడుదలైన మొదటి భాగంలో విశ్వక్ సేన్ ఎస్పీ విక్రమ్ రుద్రరాజుగా నటించారు. తెలంగాణ రాష్ట్ర హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ (హిట్)లో పోలీసు అధికారిగా పనిచేస్తున్న ఆయన పీటీఎస్డీతో బాధపడుతుంటాడు. అడివి శేష్ 2022లో ఆంధ్రప్రదేశ్ హిట్ టీమ్ మెంబర్ ఎస్పీ కృష్ణ దేవ్ అలియాస్ కేడీగా నటించాడు. ఈ ఏడాది మేలో విడుదలైన హిట్ 3లో నాని అర్జున్ సర్కారుగా అదరగొట్టాడు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.119.25 కోట్లు వసూలు చేసింది. ఇక కార్తీ కథానాయకుడిగా ‘హిట్ 4’ తెరకెక్కనుంది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024