ఏడాది వయస్సున్న కూతురికి రోల్స్​ రాయిస్​ని గిఫ్ట్​ ఇచ్చిన భారత వ్యాపారవేత్త..

Best Web Hosting Provider In India 2024


ఏడాది వయస్సున్న కూతురికి రోల్స్​ రాయిస్​ని గిఫ్ట్​ ఇచ్చిన భారత వ్యాపారవేత్త..

Sharath Chitturi HT Telugu

ఫాదర్స్​ డే సందర్భంగా ఒక భారతీయ వ్యాపారవేత్త.. తన కూతురికి రోల్స్​ రాయిస్​ కారును గిఫ్ట్​గా ఇచ్చారు. ఆ కూతురి వయస్సు ఏడాది!

రోల్స్​ రాయిస్​తో భారత వ్యాపారవేత్త (Instagram/@lovindubai)

దుబాయ్‌లో నివసిస్తున్న ఒక భారతీయ వ్యాపారవేత్త చేసిన పని ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఫాధర్స్​ డే సందర్భంగా.. ఏడాది వయస్సున్న తన కూతురికి ఆయన కస్టమైజ్డ్​ పింక్ రోల్స్ రాయిస్ కారును బహుమతిగా ఇచ్చాడు.

ఏడాది వయస్సున్న కూతురికి రోల్స్​ రాయిస్​..

ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక వీడియోలో.. ANAX డెవలప్‌మెంట్స్ వ్యవస్థాపకుడు సతీష్ సాన్‌పాల్, తన భార్య తబిందా సాన్‌పాల్‌తో కలిసి తమ ఏడాది కూతురు ఇసాబెల్లా సాన్‌పాల్‌కు లగ్జరీ కారు తాళాలను బహుమతిగా ఇస్తూ కనిపించారు.

ఆ వీడియోలో మెరిసే మెటాలిక్ పింక్ కారు, దాని లోపల ఉన్న ఆల్-పింక్ లగ్జరీ ఇంటీరియర్స్ కనిపించాయి. కారు నేమ్‌ప్లేట్‌పై “అభినందనలు, ఇసాబెల్లా” అని రాసి ఉంది. అలాగే, కారు లోపల కింద ఉన్న ఒక చిన్న నోట్ ప్రకారం.. ఈ కారును పసిపాప కోసం ఇంగ్లాండ్‌లో కస్టమ్-మేడ్ చేసి, ఈ సందర్భం కోసం యూఏఈకి దిగుమతి చేసుకున్నారు. కారు సీట్లపై చిన్నారి పేరులోని మొదటి అక్షరాలు కూడా ఉన్నాయి.

వీడియో క్లిప్‌లో.. ఈ కుటుంబం తమ రోల్స్ రాయిస్ కారులో వచ్చి చిన్నారికి బహుమతిగా తెచ్చిన కస్టమ్ కారును తీసుకెళ్లడం చూడవచ్చు. కారు తాళాలు అందజేసే ముందు చిన్నారిని నృత్యం, సంగీతంతో అలరించారు. అనంతరం ఆమె తన కారులో మొదటిసారి కూర్చుంది. “సతీష్ సాన్‌పాల్ ఫాధర్స్​ డే విజేతగా నిలిచాడు. అతను తన అమూల్యమైన చిన్నారి ఇసాబెల్లా సతీష్ సాన్‌పాల్ కోసం దుబాయ్‌లో కస్టమ్-బిల్ట్ రోల్స్ రాయిస్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఇది ఒక ‘దుబాయ్ డాడ్’ యాక్ట్​,” అని ఆ పోస్ట్ క్యాప్షన్ పేర్కొంది.

వీడియోను ఇక్కడ చూడండి:

గతంలోనూ భారీ వేడుకలు..

ఈ భారతీయ వ్యాపారవేత్త తన చిన్నారి కోసం ఇలా భారీగా ఖర్చు చేయడం ఇదే మొదటిసారి కాదు! గత ఫిబ్రవరిలో, సాన్‌పాల్ తన కుమార్తె మొదటి పుట్టినరోజును దుబాయ్‌లోని అట్లాంటిస్ ది రాయల్‌లో అత్యంత ఘనంగా జరిపారు. ఈ అల్ట్రా-లగ్జరీ వేడుకలో రాహత్ ఫతే అలీ ఖాన్, తమన్నా భాటియా, అతిఫ్ అస్లాం, నోరా ఫతేహి వంటి ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొన్నారు.

ఆ లగ్జరీ హోటల్‌ను వింటర్ వండర్‌ల్యాండ్‌గా మార్చారు. ఇందులో మంచుతో చేసిన షాన్డిలియర్‌లు, నేలపై కృత్రిమ మంచు, శీతాకాలపు తెల్లని చెట్లు ఏర్పాటు చేశారు. గత సంవత్సరం లండన్‌లో ఫిబ్రవరి 25న పుట్టిన ఆ చిన్నారి, డిస్నీ ప్రిన్సెస్‌కు సరిపోయే బాల్ గౌను ధరించి, ఒక అద్భుతమైన క్యారేజ్‌లో వేడుకకు చేరుకుంది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link