బ్రహ్మముడి ప్రోమో: అప్పు ప్లాన్ అట్టర్ ఫ్లాప్- యామిని మెడలో పడిన తాళి-పర్మిషన్ ఇచ్చిన కావ్య- రాజ్‌కు రెండో భార్యగా మరదలు

Best Web Hosting Provider In India 2024

బ్రహ్మముడి ప్రోమో: అప్పు ప్లాన్ అట్టర్ ఫ్లాప్- యామిని మెడలో పడిన తాళి-పర్మిషన్ ఇచ్చిన కావ్య- రాజ్‌కు రెండో భార్యగా మరదలు

Sanjiv Kumar HT Telugu

బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో కావ్యను యామిని చంపించడానికి ప్రయత్నించిందని అప్పు నిరూపించలేకపోతుంది. దాంతో సంతోషంగా పెళ్లి చేసుకోమని కావ్య పర్మిషన్ ఇచ్చేస్తుంది. యామిని మెడలో రాజ్ తాళి కట్టినట్లు చూపిస్తారు. అలా రాజ్‌కు రెండు భార్యగా యామిని మారుతుంది. దాంతో అపర్ణ, ఇందిరాదేవి షాక్ అవుతారు.

బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో

బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో యామినికి రాజ్ తాళి కడుతుండగా పోలీసులు వస్తారు. కళావతిని చంపించడానికి ప్రయత్నించినందుకు యామినిని అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు చెబుతారు. కావ్యతో రాజ్ సన్నిహితంగా ఉంటుండాని, నీకు అడ్డుగా ఉన్నాడనే అక్కసుతో కావ్యను చంపించడానికి ప్రయత్నించావని అప్పు చెబుతుంది.

కోటి రూపాయల సుపారీ

కావ్యను చంపించడానికి రఘు అనే కిల్లర్‌కు కోటి రూపాయలు సుపారీ ఇచ్చినట్లు అప్పు చెబుతుంది. కానీ, కిల్లర్ రఘు మాత్రం తనకు యామిని ఎవరో తెలియదని, అప్పుడే మొదటిసారి చూస్తున్నట్లు ప్లేట్ ఫిరాయించేస్తాడు. దాంతో అంతా షాక్ అవుతారు. కోటి రూపాయలు ఇచ్చిన వీడియో ఉందని అప్పు చెప్పి ఫోన్‌లో చూస్తుంది. కానీ, ఆ వీడియో కూడా మాయం అయి ఉంటుంది.

కల్యాణ్, అప్పు పడుకున్నప్పుడు వాళ్ల గదిలోకి వెళ్లిన రాహుల్ దొంగచాటుగా ఆ ఫోన్ అప్పు వేలి ముద్రలతో లాక్ తీసి వీడియో డిలీట్ చేస్తాడు. ఆ విషయాన్ని రాహుల్, రుద్రాణి, యామిని గుర్తు చేసుకుంటారు. అలా యామిని తాను చేసిన నేరానికి సాక్ష్యం లేకుండా చేస్తుంది. ఇక అప్పును ఏంటిది అని రాజ్ అడుగుతాడు. నువ్ చెప్పింది నిజమని నిరూపించుకోలేవా అని నిలదీస్తాడు రాజ్.

మాటలు నమ్మకు బావ

తాను చెప్పేది నిజం అని, కానీ, వీడియో డిలీట్ అయిందని, రఘు అబద్ధం చెబుతున్నాడని అప్పు అంటుంది. వాళ్ల మాటలు నమ్మకు బావ. తన అక్కకు నిన్ను ఇచ్చి పెళ్లి చేయాలని కావాలనే నాపై ఇదంతా కుట్ర చేస్తున్నారని యామిని ఎమోషనల్‌గా చెబుతుంది. దాంతో అనవసరంగా ఒక అమ్మాయిపై ఎందుకు అబద్ధాలు చెబుతున్నారు. ఎందుకు నేరం మోపాలని చూస్తున్నారు అని రాజ్ అంటాడు.

రాజ్ అలా అనేసరికి అప్పు నోట మాట రాదు. మొత్తానికి అప్పు ప్లాన్ బెడిసికొడుతుంది. ఇక ఇదంతా చూసిన కావ్య రంగంలోకి దిగుతుంది. యామిని ఏ తప్పు చేయలేదని మీరు నమ్ముతున్నారా అని రాజ్‌ను కావ్య అడుగుతుంది. నమ్ముతున్నాను అని రాజ్ అంటాడు. నువ్ ఏ తప్పు చేయలేదని రామ్ గారే నమ్ముతున్నారు. పెళ్లికి పెట్టిన ముహుర్తానికి ఇంకా సమయం ఉంది. సంతోషంగా పెళ్లి చేసుకో అని యామినికి, రాజ్‌కు పర్మిషన్ ఇస్తుంది కావ్య.

మాంగళ్య ధారణ కానివ్వు

దాంతో యామిని తెగ సంతోషిస్తుంది. ఇదేంటీ ఇదే స్వయంగా ఒప్పేసుకుంది అని మనసులో అనుకుంటుంది యామిని. లేచిన అందరిని కూర్చోమని పంతులు చెబుతాడు. కావ్య ఏంటీ ఇలా చెప్పింది అని ఇందిరాదేవి, అపర్ణ, కనకం అనుకుంటారు. అసలు దీని ధైర్యం ఏంట్రా అని రాహుల్‌తో రుద్రాణి చెబుతూ ఆశ్చర్యపోతుంది. బాబు మాంగళ్య ధారణ కానివ్వు అని రాజ్‌కు పంతులు తాళి అందిస్తాడు.

రాజ్ మాత్రం కావ్యను బాధగా చూస్తాడు. కావ్య మాత్రం ప్రశాంతంగా చూస్తూ ఉంటుంది. అపర్ణ, ఇందిరాదేవి తెగ కంగారుపడిపోతుంటారు. పెళ్లి ఎలాగైన ఆగిపోవాలని దేవుడుని ప్రార్థిస్తుంటుంది అపర్ణ. భజంత్రీలు మోగుతుంటాయి. యామినికి రాజ్ తాళి కట్టినట్లు చూపిస్తారు. యామిని మెడలో తాళి పడినట్లు ఉంటుంది. అది చూసి అపర్ణ, ఇందిరాదేవి షాక్ అయిపోతారు.

రెండో భార్యగా యామిని

కావ్య మాత్రం పట్టనట్లు ప్రశాంతంగా ఉంటుంది. రుద్రాణి, రాహుల్ మాత్రం సంతోషంగా అక్షింతలు వేసినట్లు చూపించారు. అలా కిల్లర్ రఘుతో చేసిన అప్పు ప్లాన్ అట్టర్ ప్లాఫ్ కావడంతో రాజ్‌కు రెండో భార్యగా రామ్ మరదలిగా వచ్చిన యామిని మారుతుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024