





Best Web Hosting Provider In India 2024

రెండో రోజు పెరిగిన కుబేర కలెక్షన్స్- సూర్య మూవీని బీట్ చేసిన ధనుష్ చిత్రం- ఎన్ని కోట్లు వచ్చాయి? తెలుగులో హిట్ కావాలంటే?
ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించిన సినిమా కుబేర. తెలుగు, తమిళ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన కుబేర జూన్ 20న థియేటర్లలో విడుదలై మంచి పాజిటివిటీ తెచ్చుకుంటుంది. ఈ నేపథ్యంలో కుబేర రెండు రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ లుక్కేద్దాం.
డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ కుబేర. నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా, జిమ్ సర్బ్ నటించిన కుబేర మూవీ జూన్ 20న థియేటర్లలో విడుదలై అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో కుబేర కలెక్షన్స్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి.
కుబేర డే 1 కలెక్షన్స్
కుబేర మూవీకి తొలిరోజు వరల్డ్ వైడ్‌గా రూ. 30 కోట్ల గ్రాస్ వచ్చినట్లు సోషల్ మీడియాలో మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అలాగే, కేవలం ఇండియాలో ఓపెనింగ్ డే నాడు కుబేర మూవీకి రూ. 14.75 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ సంస్థ సక్నిల్క్ తెలిపింది.
ఒక్కో రాష్ట్రంలో
ఈ 14.75 కోట్లలో తెలుగు నుంచి రూ. 10 కోట్లు, తమిళం ద్వారా రూ. 4.5 కోట్లు, కన్నడ వెర్షన్‌కు రూ. 2 లక్షలు, హిందీ బెల్ట్‌లో రూ. 23 లక్షలు నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది కుబేర. అలాగే, ఓవర్సీస్ నుంచి ఓపెనింగ్ డే నాడు ఈ సినిమాకు రూ. 10.15 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది.
కుబేర రెండో రోజు వసూల్లు
ఇక రెండో రోజు శనివారం (జూన్ 21) భారత్‌లో కుబేర మూవీకి రూ. 16 కోట్ల నెట్ వసూల్లు వచ్చినట్లు సమాచారం. అంటే, తొలి రోజుతో పోలిస్తే ఇండియాలో రెండో రోజున కుబేర నెట్ కలెక్షన్స్ పెరిగాయి. ఇక రెండు రోజుల్లో భారత్‌లో కుబేర మూవీకి రూ. 30.75 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సక్నిల్క్ వెల్లడించింది.
కుబేర థియేటర్ ఆక్యుపెన్సీ
ఇక వరల్డ్ వైడ్‌గా కుబేర మూవీకి రెండు రోజుల్లో రూ. 50 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు. అలాగే, కుబేర తెలుగు వెర్షన్‌కు రెండో రోజు థియేటర్ ఆక్యుపెన్సీ 66.19 శాతం నమోదు అయింది. ఇక హైదరాబాద్‌లో మాత్రం 71.65 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు చేసుకుంది కుబేర.
కుబేర హిట్ కావాలంటే?
ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో కుబేర సినిమాకు రూ. 33 కోట్ల బిజినెస్ జరిగింది. దీంతో రూ. 34 కోట్లకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. రెండు రోజుల్లో తెలుగులో కుబేరకు రూ. 18 కోట్ల షేర్ వచ్చే అవకాశం ఉంది. దీంతో తెలుగులో కుబేర హిట్ కావాలంటే ఇంకా రూ. 16 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం