




Best Web Hosting Provider In India 2024

90స్‌లో మోహన్ బాబుతో కలిసి నటించలేకపోయాను.. అందులో అణువులాంటిదాన్ని.. హీరోయిన్ మధుబాల కామెంట్స్
మంచు విష్ణు నటించిన మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ కన్నప్ప. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, శివ రాజ్ కుమార్, కాజల్ అగర్వాల్, మధుబాల నటించిన కన్నప్ప మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌లో మధుబాల తదితరులు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
టాలీవుడ్ హీరో మంచు విష్ణు యాక్ట్ చేసిన లేటెస్ట్ మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా కన్నప్ప. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన కన్నప్ప చిత్రంలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, శివ రాజ్ కుమార్, కాజల్ అగర్వాల్, మధుబాల వంటి దిగ్గజ నటీనటులు యాక్ట్ చేశారు.
కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో
జూన్ 27న కన్నప్ప మూవీ థియేటరల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సీనియర్ హీరోయిన్ మధుబాల, రైటర్ ఆకెళ్ల శివ ప్రసాద్, నటుడు ముఖేష్ రిషి తదితరులు ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు.
అణువులాంటిదాన్ని
హీరోయిన్ మధుబాల మాట్లాడుతూ .. “ఇంత పెద్ద ప్రపంచం, విశ్వంలో మనం చిన్న అణువులాంటి వాళ్లం. ఇంత పెద్ద కన్నప్ప ప్రపంచంలో నేను ఓ అణువులాంటిదాన్ని. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మోహన్ బాబు గారికి, విష్ణు గారికి థాంక్స్” అని అన్నారు.
90వ దశకంలో
“90వ దశకంలో మోహన్ బాబు గారితో నేను కలిసి నటించలేకపోయాను. కానీ, ఇప్పుడు మోహన్ బాబు గారు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి వారితో నటించడం చాలా సంతోషంగా ఉంది” అని మధుబాల చెప్పుకొచ్చారు.
త్రిదళానికి ఖాండం ప్రభాస్
“కన్నప్ప సినిమా కోసం మాలాంటి డైలాగ్ రైటర్లను కూడా న్యూజిలాండ్‌కు తీసుకెళ్లారంటే వారి శ్రద్ద ఎలాంటిదో చెప్పుకోవచ్చు. త్రిదళంలో మోహన్ బాబు గారు, విష్ణు గారు, హీరోయిన్ గారు అయితే.. ఆ త్రిదళానికి ఖాండం ప్రభాస్ గారు. ఒక్కసారి తెరపైకి ఆయన ఎంట్రీ ఇచ్చాక సినిమా స్థాయి పెరుగుతుంది” అని రచయిత ఆకెళ్ల శివ ప్రసాద్ తెలిపారు.
అంత సులభం కాదు
నటుడు ముఖేష్ రిషి మాట్లాడుతూ .. “కన్నప్ప నాకు ఎంతో ప్రత్యేకం. ఈ మూవీని తీయడం, చేయడం అంత సులభం కాదు. ఎంతో సంకల్ప బలం ఉంటే కానీ ఈ చిత్రాన్ని తీయలేరు. మోహన్ బాబు గారు, విష్ణు గారి వల్లే ఈ మూవీ ఈ స్థాయికి వచ్చింది. జూన్ 27న రాబోతోన్న ‘కన్నప్ప’ని, అందులో ప్రభాస్‌ని చూసి అందరూ ఎంజాయ్ చేస్తారు” అని చెప్పారు.
వర ప్రసాదంగా
“కన్నప్ప కోసం పాట రాయడం నా పూర్వ జన్మ సుకృతం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మోహన్ బాబు, విష్ణు గారికి థాంక్స్. క్లైమాక్స్‌లో విష్ణు బాబు మీద రాసిన సమర గీతం అద్భుతంగా వచ్చింది. ఈ అవకాశాన్ని మోహన్ బాబు, మంచు విష్ణు వర ప్రసాదంగా భావిస్తున్నాను” అని లిరిసిస్ట్ సుద్దాల అశోక్ తేజ అన్నారు.
సంబంధిత కథనం