టీవీలోకి వచ్చేస్తున్న తండేల్.. నాగచైతన్య సూపర్ హిట్ చిత్రం టెలికాస్ట్ డేట్, టైమ్ వివరాలివే

Best Web Hosting Provider In India 2024

టీవీలోకి వచ్చేస్తున్న తండేల్.. నాగచైతన్య సూపర్ హిట్ చిత్రం టెలికాస్ట్ డేట్, టైమ్ వివరాలివే

తండేల్ సినిమా టీవీ ఛానెల్‍లోకి వస్తోంది. థియేట్రికల్ రిలీజ్‍లో సూపర్ హిట్ అయిన ఈ మూవీ.. ఓటీటీలోనూ మంచి వ్యూస్ సాధించింది. ఇప్పుడు టీవీ ఛానెల్‍లో టెలికాస్ట్ కానుంది. డేట్, టైమ్ వివరాలు వెల్లడయ్యాయి.

టీవీలోకి వచ్చేస్తున్న తండేల్.. నాగచైతన్య, సాయిపల్లవి సూపర్ హిట్ చిత్రం టెలికాస్ట్ డేట్, టైమ్ ఇదే

యువ సామ్రాట్ నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన తండేల్ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయింది. నిజజీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం ఫిబ్రవరి 7వ తేదీన థియేటర్లలో విడుదలైంది. రూ.100కోట్లకు పైగా కలెక్షన్లతో బ్లాక్‍బస్టర్ సాధించింది. ఓటీటీలోనూ ఈ చిత్రం అదరగొట్టింది. ఇప్పుడు తొలిసారి టీవీలో ప్రసారమయ్యేందుకు తండేల్ మూవీ రెడీ అయింది.

టెలికాస్ట్ డేట్, టైమ్

తండేల్ సినిమా జూన్ 29వ తేదీన సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు టీవీ ఛానెల్‍లో టెలికాస్ట్ కానుంది. కొంతకాలంగా త్వరలో ప్రసారం అంటూ ఆ ఛానెల్ చెబుతూ వస్తోంది. ఎట్టకేలకు ఇప్పుడు డేట్, టైమ్ కన్ఫర్మ్ చేసింది. జూన్ 29న సాయంత్రం 6 గంటలకు తండేల్ టీవీ ప్రీమియర్ అంటూ జీ తెలుగు అధికారికంగా ఓ ప్రోమో తీసుకొచ్చింది.

మత్స్యకారుడిగా చైతూ.. యథార్థ ఘటనల ఆధారంగా..

తండేల్ చిత్రంలో మత్య్సకారుడు రాజు పాత్రను నాగచైతన్య పోషించారు. పాకిస్థాన్ జైలులో కొన్ని నెలల పాటు చిత్రహింసలు అనుభవించి స్వదేశం భారత్‍కు తిరిగి వచ్చిన శ్రీకాకుళం మత్స్యకారుల నిజజీవిత ఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాను డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించారు. లవ్ స్టోరీ, ఎమోషన్స్, దేశభక్తి అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ మూవీలో బుజితల్లి అలియాజ్ సత్య పాత్రను సాయిపల్లవి పోషించారు.

తండేల్ కలెక్షన్లు

తండేల్ సినిమా పాజిటివ్ టాక్‍తో థియేట్రికల్ రన్‍లో అదరగొట్టింది. ఈ చిత్రం సుమారు రూ.100కోట్ల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఈ మూవీకి దాదాపు రూ.75కోట్ల బడ్జెట్ అయిందని అంచనా. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మించగా.. అల్లు అరవింద్ సమర్పించారు.

ఏ ఓటీటీలో..

తండేల్ సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమ్ అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో అందుబాటులో ఉంది. ఓటీటీలోనూ ఈ సినిమాకు భారీగానే వ్యూస్ దక్కాయి. స్ట్రీమింగ్ తర్వాత కూడా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. మరి జూన్ 29న జీ తెలుగులో ప్రసారమయ్యే ఈ చిత్రానికి ఎంత టీఆర్పీ వస్తుందనేది చూడాలి.

తండేల్ చిత్రంలో నాగచైతన్య, సాయిపల్లవి సహా ఆడుకాలం నరేన్, ప్రకాశ్ బెలవాది, దివ్య పిళ్లై కరుణాకరన్, బబ్లూ పృథ్విరాజ్, చరణ్‍దీప్, కల్పలత కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమాకు దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఈ మూవీ సక్సెస్‍కు మ్యూజిక్ కూడా ఓ కారణంగా నిలిచింది. ఈ చిత్రానికి షందత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ చేశారు.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024