ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ యూత్ మూవీ.. ముద్దులేవి అంటూ టైటిల్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్ యూత్ మూవీ.. ముద్దులేవి అంటూ టైటిల్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

మరో యూత్ రొమాంటిక్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఫీల్ గుడ్ స్టోరీతో వచ్చిన ఈ మూవీని ఎక్కడ చూడాలంటే? ఓటీటీ, స్ట్రీమింగ్ వివరాలు మీకోసం.

ఓటీటీలోకి యూత్ రొమాంటిక్ మూవీ (x/etv win)

ప్రతి సండేలాగే ఈ రోజు (జూన్ 22) కూడా మరో కొత్త సినిమా ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఏవి అలనాటి ముద్దులు అనే రొమాంటిక్ టైటిల్ తో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ కల్యాణ్, నటాషా జంటగా నటించిన ఈ మూవీ ఆదివారం నుంచే స్ట్రీమింగ్ అవుతుంది.

నేరుగా ఓటీటీలోకి

ఏవి.. అలనాటి ముద్దులు అంటూ డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేసింది ఈ సినిమా. ఆదివారం నుంచి ఈటీవీ విన్ లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. గత మూడు నెలలుగా ప్రతి ఆదివారం ఓ కొత్త షార్ట్ మూవీని తీసుకొస్తున్న ఈటీవీ విన్ ఈసారి కూడా అలాంటిదే మరో సినిమాను అందిస్తోంది. అందులో భాగంగానే ఏవి అలనాటి ముద్దులు ఓటీటీలోకి వచ్చేసింది.

ఊహించని అనురాగం

ఊహించని అనురాగం, భావోద్వేగాల కథే ఏవి.. అలనాటి ముద్దులు అని ఈటీవీ విన్ ప్లాట్ ఫామ్ చెబుతోంది.

“ఊహించని అనురాగం, భావోద్వేగాల కథ ఇది. ఏవి అలనాటి ముద్దులు.. కథా సుధ నుంచి వస్తున్న ఈ కథ జూన్ 22 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. స్టోరీ, స్క్రీన్‌ప్లే, ప్రొడ్యూసర్, దర్శకత్వ పర్యవేక్షణ కే రాఘవేంద్రరావు కాగా.. డైరెక్టర్ రాంకీ. కృష్ణకాంత్ డైలాగులు అందించాడు. అర్జున్ కల్యాణ్, నటాషా నటించారు. కిరణ్ కుమార్ మ్యూజిక్ అందించాడు” అని ఈ మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని వెల్లడిస్తూ ఈటీవీ విన్ పోస్టు చేసింది.

కథా సుధ మూవీస్

ఈటీవీ విన్ కథా సుధలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రతి ఆదివారం ఓ కొత్త షార్ట్ మూవీ వస్తున్న విషయం తెలిసిందే. 30 నుంచి 40 నిమిషాల నిడివితో ఇవి ఉంటున్నాయి. గత ఆదివారం కూడా ప్రేమంటే ఇది కదా పేరుతో ఓ కొత్త షార్ట్ మూవీ వచ్చింది.

ఈటీవీ విన్ ఓటీటీ కొన్ని నెలలుగా కథా సుధ పేరుతో ఓ సరికొత్త సిరీస్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రతి ఆదివారం ఓ సరికొత్త షార్ట్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే 13 ఎపిసోడ్లు వచ్చేశాయి. కథాసుధలో భాగంగా ఏప్రిల్ 6న తొలి మూవీ స్ట్రీమింగ్ అయింది. ఆ రోజు ఉత్తరం, లైఫ్ పార్ట్‌నర్ అనే రెండు ఎపిసోడ్లు వచ్చాయి.

ఆ తర్వాత లవ్ యు నానమ్మ, వెండి పట్టీలు, ట్రింగ్ ట్రింగ్, పెంకుటిల్లు, సుందరం గాడి ప్రేమ కథ, కాలింగ్ బెల్, నాతి చరామి, అమృతవల్లి, డియర్ డాడీ,ప్రేమంటే ఇది కదా లాంటి షార్ట్ మూవీస్ వచ్చాయి.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024