బ్రహ్మముడి జూన్ 23 ఎపిసోడ్: సింపుల్‌గా పెళ్లి ఆపేసిన రాజ్- భయపడిన కావ్య- స్వప్న కిడ్నాప్- కళావతికి యామిని బ్లాక్ మెయిల్

Best Web Hosting Provider In India 2024

బ్రహ్మముడి జూన్ 23 ఎపిసోడ్: సింపుల్‌గా పెళ్లి ఆపేసిన రాజ్- భయపడిన కావ్య- స్వప్న కిడ్నాప్- కళావతికి యామిని బ్లాక్ మెయిల్

Sanjiv Kumar HT Telugu

బ్రహ్మముడి సీరియల్ జూన్ 23 ఎపిసోడ్‌లో అప్పును నిందిస్తుంది యామిని తల్లి వైదేహి. మీకు మీ కూతురు పెళ్లి కావాలి కదా. ముందు పెళ్లి జరిపించండి అని కావ్య అంటుంది. దాంతో కావ్యకు హగ్ ఇస్తుంది యామిని. నా వల్లే నీకు తొలి ఓటమి అని చెబుతుంది. కానీ, సింపుల్‌గా యామినితో పెళ్లి ఆపుతాడు రాజ్.

బ్రహ్మముడి సీరియల్‌ జూన్ 23వ తేది ఎపిసోడ్

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ఏంటీ అప్పు నువ్ చెప్పింది నిరూపించుకోలేకపోయావ్. ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నావ్ అని అప్పును అడుగుతాడు రాజ్. మీకు ఇంకా అర్థం కాలేదా అల్లుడు గారు. చేయని తప్పుకు నా కూతురుని ఇరికించి పెళ్లి ఆపించాలని చూసింది ఈ అప్పు అని వైదేహి అంటుంది.

సాక్ష్యం లేకుండా

అప్పు గారి మీద నిందలు వేయకండి అని కానిస్టేబుల్ అంటాడు. వీడు చెప్పినదానికి సరైన సాక్ష్యం లేకుండా తీసుకురావడం మనదే తప్పు. వాడిని తీసుకెళ్లండి అని అప్పు అంటుంది. చాలా బాగా నటిస్తున్నారు. మీ ఫ్యామిలీ మీదే అనుమానం కలుగుతోంది. ఈ పెళ్లికి ఆటంకాలన్నీ మీరే చేస్తున్నట్లున్నారు అని వైదేహి అంటుంది. మీకేం ద్రోహం చేశాం అని యామిని ఏడుస్తూ నటిస్తూ అంటుంది.

పర్ఫామెన్స్ ఇరగదీస్తుందిగా. దెబ్బకు రాజ్ పెళ్లి చేసుకోవడం ఖాయం అని రుద్రాణి అంటుంది. యామిని చేసే ఓవరాక్షన్ తట్టుకోలేక చాలు ఆపవే. నువ్వు నీ ఫ్యామిలీ చేస్తున్న నాటకాలు ఏంటో నాకు తెలియదా. మా అల్లుడి గురించి ఆలోచిస్తున్నాను కానీ, ఈపాటికి మీకు చిత్తడైపోయేది అని కనకం అంటుంది. ఎక్కడ గతం చెప్పేస్తుందో అని కనకంతో ఒట్టు వేయించుకుంటుంది కావ్య.

మా చెల్లితో గొడవ కావాల

కనకంను అప్పుతో పంపించేస్తుంది కావ్య. తెలివిగా ఇద్దరిని పంపించావా అని వేదేహి అంటే మీకు మా చెల్లితో గొడవ కావాల మీ కూతురుకి పెళ్లి కావాల అని కావ్య అంటుంది. దాంతో వేదేహి సైలెంట్ అవుతుంది. రామ్ గారు మీరు యామిని తప్పు చేయలేదని నమ్ముతున్నారా అని కావ్య అడిగితే రాజ్ నమ్ముతున్నా అని అంటాడు. అయితే, పెళ్లి చేసుకోమని కావ్య అంటుంది.

దాంతో యామిని వచ్చి కావ్యకు హగ్ ఇచ్చి నువ్వే అర్థం చేసుకున్నావ్ అని బయటకు అంటుంది. కానీ, మెల్లిగా చెప్పానుగా నువ్ తొలిసారి ఓటమి నా వల్ల రుచి చూడబోతున్నావని. ఇక మిమ్మల్ని ఎవరు విడదీయలేరు అని యామిని అంటుంది. ఇప్పుడు కూడా చెబుతున్నాను. ఈ పెళ్లి జరగదు అని కావ్య అంటుంది. దాంతో యామిని తెగ షాక్ అవుతుంది.

భయపడిన యామిని

ఇంత జరిగిన కావ్య ఇంతలా ఎలా కాన్పిడెంట్‌గా ఉందని భయపడుతుంది. రాజ్‌ను తాళి కట్టమని పంతులు చెబుతాడు. కళావతితో జరిగింది అంతా గుర్తు చేసుకుంటాడు రాజ్. యామిని తాళి కట్టమనడంతో లేస్తాడు. యామిని గుండెలపై తాళి ఉంటుంది. కానీ, తాళిని కట్టకుండా పడేస్తాడు రాజ్. సారీ యామిని అని రాజ్ అంటాడు. దాంతో షాక్ అయి లేస్తుంది యామిని.

అది చూసిన కనకం విజిల్ కొడుతుంది. పెళ్లి చేసుకుంటే చస్తానని చెప్పావ్. కానీ, ఈ పెళ్లి చేసుకుంటే రోజంతా చస్తూ బతకాలి. నన్ను క్షమించు అని వెళ్లిపోతాడు రాజ్. వీళ్లు ఇంత కష్టపడితే రాజ్ ఏంట్రీ ఇంత సింపుల్‌గా పెళ్లి ఆపేసాడు అని రుద్రాణి అంటుంది. నీ నమ్మకమే కాపాడింది అని కావ్యతో ఇందిరాదేవి అంటుంది. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాం. క్షమించు అని అపర్ణ అంటుంది.

యామిని ఉక్రోశం

కావ్య అనుకుంది సాధించినట్లు నవ్వుతుంటే యామిని మాత్రం ఉక్రోశంతో చూస్తుంది. కట్ చేస్తే దుగ్గిరాల ఇంట్లో అంతా డ్యాన్స్ చేస్తారు. ఈ దరిద్రం చూడటానికా ఇంత కష్టపడ్డాం అని రుద్రాణి అంటుంది. ఇక యామిని అడ్డు తొలిగిపోయింది కాబట్టి కావ్య కోసం రాజ్ వెతుక్కుంటూ వస్తాడని రాహుల్ అంటాడు. ఇంతలో కావ్య వచ్చి మ్యూజిక్ ఆపేస్తుంది. ఈ గోల ఏంటని నిలదీస్తుంది కావ్య.

రాజ్ పెళ్లి ఆపడాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. వీళ్ల బంధం ఎంత గట్టిదో అని అపర్ణ అంటుంది. నేను టెన్షన్ పడుతుంటే మీకు కామెడీగా ఉందా అని కోప్పడుతుంది కావ్య. టెన్షన్ ఎందుకు రాజ్ వచ్చి పెళ్లి చేసుకుంటాడుగా అని అంతా అంటారు. అక్కడ యామిని ఉంది. పెళ్లి ఆగిపోతే ఊరుకుంటుందా. అసలు అక్కడ యామిని ఏం చేస్తుందా అని కంగారుగా ఉందని భయపడుతూ చెబుతుంది కావ్య.

స్వప్న కిడ్నాప్

అటువైపు యామిని వెళ్లి డోర్ క్లోజ్ చేసుకుంటుంది. తల్లిదండ్రులు, రాజ్ వచ్చి డోర్ కొడతారు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా. అది ప్రాణాలు తీసుకునేలా చేశావ్ అని రాజ్‌ను నిందిస్తుంది వైదేహి. దానికైమైనా అయితే మేము భరించలేం. దానికి కారణం నవ్వే అవుతావ్ వైదేహి అంటుంది.

తర్వాత రాజ్ వచ్చి లవ్ ప్రపోజ్ చేస్తే నువ్వు రెజెక్ట్ చేయాలి అని కళావతిని యామిని బ్లాక్ మెయిల్ చేస్తుంది. స్వప్న హాస్పిటల్‌కు వెళ్లలేదు కిడ్నాప్ అయిందని కావ్యకు యామిని చెబుతుంది. స్వప్న దగ్గరికి వెళ్లాలి అని ఇంట్లో కావ్య చెప్పి వెళ్లబోతుంటే రాజ్ వస్తాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024