గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: ప్ర‌భావ‌తిపై కామాక్షి పిడిగుద్దులు – బాలు రోక‌లి వైద్యం – శృతి ఫంక్ష‌న్‌లో గొడ‌వ‌ల

Best Web Hosting Provider In India 2024

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: ప్ర‌భావ‌తిపై కామాక్షి పిడిగుద్దులు – బాలు రోక‌లి వైద్యం – శృతి ఫంక్ష‌న్‌లో గొడ‌వ‌ల

HT Telugu Desk HT Telugu

గుండె నిండా గుడి గంట‌లు జూన్ 23 ఎపిసోడ్‌లో బిర్యానీ అర‌గ‌క‌పోవ‌డంతో అజీర్తి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంది ప్ర‌భావ‌తి. ప్ర‌కృతి వైద్యం పేరుతో ప్ర‌భావ‌తి వీపుపై పిడిగుద్దులు కురిపిస్తుంది కామాక్షి. చివ‌ర‌కు బాలు రోక‌లి వైద్యంతో ప్ర‌భావ‌తి స‌మ‌స్య త‌గ్గిపోతుంది.

గుండె నిండా గుడి గంట‌లు జూన్ 23 ఎపిసోడ్‌

మీనా కోసం తాను తీసుకొచ్చిన హ‌ల్వా మొత్తం మ‌నోజ్ తినేసి వెళ్లిపోవ‌డంతో బాలు డిస‌పాయింట్ అవుతాడు. తినేది లాక్కోవ‌డం బాగుండ‌ద‌ని ఆగిపోయాన‌ని అంటాడు. అందుకే మీరు న‌చ్చుతార‌ని భ‌ర్త‌పై మీనా పొగ‌డ్త‌లు కురిపిస్తుంది. మ‌రోవైపు హ‌ల్వా మ‌త్తులో ఇవాళ నాకు నేనే కొత్త‌గా క‌నిపిస్తున్నాను అని రోహిణి చేతిపై ముద్దుపెడ‌తాడు మ‌నోజ్‌. అప్పుడే ప్ర‌భావ‌తి విజిల్ సౌండ్ వినిపిస్తుంది. ఆ విజిల్ సౌండ్‌తో రొమాంటిక్ మూడ్ పోయింద‌ని మ‌నోజ్ చిరాకుప‌డ‌తాడు.

తిన్న‌ది అర‌క్క‌…

మ‌నోజ్ రూమ్ డోర్ కొడుతుంది ప్ర‌భావ‌తి. బిర్యానీ అర‌గ‌లేద‌ని ఏదైనా ట్యాబ్లెట్ ఉంటే ఇవ్వ‌మ‌ని మ‌నోజ్‌ను అడుగుతుంది. తిన్న‌ది అర‌క్క తిప్ప‌లు ప‌డే అవ‌స‌రం త‌న‌కెప్పుడూ రాలేద‌ని మ‌నోజ్ పంచ్ వేస్తాడు.

మీనాకు బాలు ముద్దు పెట్ట‌బోతాడు. అప్పుడే హాల్‌లోకి ప్ర‌భావ‌తి వ‌స్తుండ‌టంతో బాలుకు దూరంగా జ‌రుగుతుంది మీనా. తిన్న‌ది అర‌గ‌క ఇబ్బందులు ప‌డుతూ హాల్‌లో అటూ ఇటూ తిరుగుతుంది ప్ర‌భావ‌తి. ఏమైంద‌ని మీనా, బాలుల‌పై విరుచుకుప‌డుతుంది.

లెగ్ పీస్ లాగించేదానివి…

వేడి నీళ్ల‌లో జీల‌క‌ర్ర వేసి తీసుకొని ర‌మ్మ‌ని మీనాకు ఆర్డ‌ర్ వేస్తుంది ప్ర‌భావ‌తి. జీల‌క‌ర్ర ప‌ట్టే సందు క‌డుపులో ఉంటే నువ్వు ఇంకో లెగ్ పీస్ లాగించేదానికి క‌దా అని బాలు పంచ్‌లు వేస్తాడు. రాత్రి పూట బిర్యానీలు తిన‌డం అవ‌స‌ర‌మా అని క్లాస్ ఇస్తాడు. హాస్పిట‌ల్‌కు తీసుకెళ్ల‌నా అని అడుగుతాడు బాలు. నువ్వు పెడుతున్నావుగా గ‌డ్డి అవ‌స‌రం లేద‌ని అంటుంది.

కామాక్షి ప్ర‌కృతి వైద్యం..

త‌ర్వాత రోజు ఉద‌యం కూడా అజీర్తి వ‌ల్ల ప్ర‌భావ‌తి అయ్యో…అమ్మ అంటూ మూలుగుతూ ఇబ్బందులు ప‌డుతుంది. ఆమె వీపుపై గ‌ట్టిగా ఒక్క‌టి పీకుతుంది కామాక్షి. ఆ దెబ్బ‌తో అమ్మ అంటూ ప్ర‌భావ‌తి అరుస్తుంది. ఆ సీన్ చూసి అంద‌రూ షాకైపోతారు. మా అమ్మ ఎంత గ‌య్యాలిగంప అయితే మాత్రం ఆమెపై ఇలా ప్ర‌తీకారం తీర్చుకోవాలా అని బాలు అంటాడు.

ఇది ప్ర‌తీకారంతో గుద్దిన పిడి గుద్దు కాద‌ని, గ్యాస్‌ట్ర‌బుల్‌కు ప్ర‌కృతి వైద్యం ఇలాగే చేస్తార‌ని కామాక్షి అంటుంది. నిన్ను అపార్థం చేసుకున్నాన‌ని, నిన్ను ప్ర‌పంచంలో ఆపే శ‌క్తి ఏది లేదు. ఎన్ని పిడిగుద్దులైనా గుద్దుకో అని కామాక్షితో బాలు అంటాడు. అతడి మాట‌ల‌తో ప్ర‌భావ‌తి కంగారు ప‌డిపోతుంది.

ప్ర‌భావ‌తికి క్లాస్‌…

ప్ర‌భావ‌తిని హాస్పిట‌ల్‌కు తీసుకెళ్ల‌డం మంచిద‌ని మీనా అంటుంది. బిల్ పాతిక‌వేలు అవుతుంద‌ని బాలు ఆపేస్తాడు. ఏదైనా చూడ‌గానే ఆబ‌గా తింటే ఇలాగే ఉంటుంద‌ని స‌త్యం కూడా ప్ర‌భావ‌తికి క్లాస్ ఇస్తాడు.

అంద‌రూ మాట్లాడుతుండ‌గానే ప్ర‌భావ‌తి వీపుపై గ‌ట్టిగా మ‌రో పిడిగుద్దు గుద్దుతుంది కామాక్షి. వామ్మో అని అరుస్తుంది ప్ర‌భావ‌తి. నువ్వు ఓ ప‌ట్టు ప‌ట్టు …ఒక్క గుద్దుకే బ్రేవ్‌ మ‌నాలి అని మీనాతో బాలు అంటాడు.

చూస్తూ చూస్తూ అత్త‌య్య‌పై ఎలా కొట్ట‌గ‌ల‌ను అని మీనా అంటుంది.

బాక్స‌ర్‌లా మీనా…

ఈ స‌మ‌స్య నా వ‌ల్ల వ‌చ్చింది కాబ‌ట్టి నేనే తీర్చుస్తా అంటూ ప్ర‌భావ‌తి వీపుపై పిడిగుద్దులు గుద్ద‌డానికి రెడీ అవుతుంది శృతి. ఏంటి బాక్స‌ర్‌లా త‌యార‌య్యావ‌ని శృతిని ర‌వి ఆపేస్తాడు. అజీర్తి త‌గ్గ‌డానికి నా ద‌గ్గ‌ర ఓ ఐడియా ఉంద‌ని బాలు అంటాడు. కిచెన్‌లోకి వెళ‌తాడు. రోక‌లి తీసుకొని ఆవేశంగా వ‌స్తాడు. బాలు ఎక్క‌డ త‌న‌ను కొడ‌తాడో అని భ‌య‌ప‌డి ప్ర‌భావ‌తి ప‌రుగులు తీస్తుంది. గ్యాస్ స‌మ‌స్య పోతుంది. నాకు న‌యం అయిపోయింద‌ని సంబ‌ర‌ప‌డుతుంది. రోక‌లి వైద్యంబాగా ప‌నిచేసింద‌ని బాలు అంటాడు.

శోభ‌న కండీష‌న్‌…

ప్ర‌భావ‌తిని వెతుక్కుంటూ శోభ‌న వ‌స్తుంది. శృతి, రోహిణి న‌ల్ల‌పూస‌ల ఫంక్ష‌న్‌కు బాలు, మీనా రావ‌ద్ద‌ని కండీష‌న్ పెడుతుంది. మా వారి రిటైర్‌మెంట్ ఫంక్ష‌న్‌లో నాకు నా భ‌ర్త‌కు బాలు వ‌ల్ల చాలా అవ‌మానం జ‌రిగింది. చెల్లెలి పెళ్లిలో కూడా బావ‌పైనే బాలు చేయిచేసుకున్నాడు.

ఇప్పుడు న‌ల్ల‌పూస‌ల ఫంక్ష‌న్‌లో బాలు గొడ‌వ‌లు చేసినా చేస్తాడ‌ని, అత‌డు మాత్రం వేడుక‌కు రాకూడ‌ద‌ని చెబుతుంది. బాలు ఫంక్ష‌న్‌కు రాకుండా తాను చూసుకుంటాన‌ని శోభ‌న‌కు మాటిస్తుంది ప్ర‌భావ‌తి. బాలు లేక‌పోతేనే ఈ ఫంక్ష‌న్ ప్ర‌శాంతంగా ఉంటుంద‌ని అంటుంది.

బాలు కూడా వ‌స్తున్నాడు..

శోభ‌న పెట్టిన కండీష‌న్ గురించి భ‌ర్త స‌త్యానికి చెబుతుంది ప్ర‌భావ‌తి. బాలు వ‌స్తే గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయ‌ని శోభ‌న‌, సురేంద్ర భ‌య‌ప‌డుతున్నార‌ని అంటుంది. స‌త్యం మాత్రం అందుకుఒప్పుకోడు. బాలు రావాల్సిందేన‌ని అంటాడు. శోభ‌న‌కు ఫోన్ చేసి బాలు కూడా వ‌స్తున్నాడ‌ని ప్ర‌భావ‌తి చెబుతుంది.

ప్లాన్ స‌క్సెస్‌…

త‌మ ప్లాన్ స‌క్సెస్ అయ్యింద‌ని శోభ‌న‌, సురేంద్ర సంబ‌ర‌ప‌డ‌తాడు. బాలును అడ్డుపెట్టుకొని స‌త్యాన్ని దారుణంగా అవ‌మానించాల‌ని అనుకుంటారు. మ‌రోవైపు ఫంక్ష‌న్‌లో బాలు నోరు ఎత్త‌కుండా సెలైంట్‌గా ఉండాల‌ని, ఏదైనా గొడ‌వ చేస్తే తాను భ‌ద్ర‌కాళిలా మారుతాన‌ని ప్ర‌భావ‌తి అంటుంది. ఖ‌చ్చితంగా ఫంక్ష‌న్‌లో గొడ‌వ చేస్తాన‌ని బాలు అంటాడు. అక్క‌డితో నేటి గుండె నిండా గుడి గంట‌లు సీరియ‌ల్ ముగిసింది.

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024