




Best Web Hosting Provider In India 2024
గ్యాస్ సిలిండర్ లీక్, పాములా బుసలు కొట్టిన పైపు- ఆ వెంటనే భారీ పేలుడు.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి!
ఓ ఇంటికి సంబంధించిన గ్యాస్ సిలిండర్ లీక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గ్యాస్ లీక్ అవ్వడంతో పేలుడు సంభవించింది. ఇద్దరు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ ఇంట్లో.. ఓ గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యింది. సిలిండర్ పైపు పాములా బుసలు కొట్టింది. సిలిండర్‌ని ఫిక్స్ చేసేందుకు ఇద్దరు ప్రయత్నించారు. కానీ కొంతసేపటికి భారీ పేలుడు సంభవించింది. ఆ దృశ్యాలు ఇంట్లోని సీసీటీవీ కెమెరాకు చిక్కాయి.
అసలేం జరిగింది..?
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ గ్యాస్ సిలిండర్ లీక్ వీడియో లొకేషన్‌పై క్లారిటీ లేదు. కానీ ఈ ఘటన జూన్ 18 మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జరిగినట్టు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది.
వీడియోలో ఒక ఇల్లు ఉంది. లీక్ అవుతున్న సిలిండర్ పైపును ఓ మహిళ పట్టుకుని కనిపించింది. కానీ ఆ సిలిండర్ కింద పడి గిర్రగిర్ర తిరగడం మొదలుపెట్టింది. అది చూసి, ఆమె బయటకు పరుగులు తీసింది.అక్కడి నుంచి కొంతసేపటి వరకు ఆ సిలిండర్‌లో గ్యాస్ లీక్ అవుతూ వచ్చింది. ఆ పైపు పాములా బుసలు కొట్టింది.
1 నిమిష తర్వాత.. గ్యాస్ లీక్ ఆగిపోయి, పైపు పడిపోయింది. ఇంతలో ఆ మహిళతో పాటు ఒక పురుషుడు ఇంటికి రెండువైపుల నుంచి లోపలికి ప్రవేశించారు. సిలిండర్‌ని పైకి తీసే ప్రయత్నం చేశారు.
కానీ వెనక కిచెన్‌లో నుంచి మంటలు మొదలయ్యాయి. వెంటనే భారీ పేలుడు సంభవించింది! హాల్లో మంటలు అంటుకున్నాయి. ఆ మహిళ, పరుషుడు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన దృశ్యాలను ఇక్కడ చూడండి :
ఘర్ కే కలేష్ అనే ట్విట్టర్ అకౌంట్ నంచి ఈ వీడియో అప్లోడ్ అయ్యింది.
“వాళ్లు అదృష్టవంతులు. కిటికీలు, డోర్లు ఓపెన్ చేసి ఉండటంతో గ్యాస్ బయటకు వెళ్లిపోయింది. పేలుడు ప్రభావం తక్కువగా ఉంది,” అని పోస్టు క్యాప్షన్‌లో రాసి ఉంది.
ఈ వీడియోకి 12.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు.
“వాళ్లు చాలా అదృష్టవంతులు. ఒక్క సెకన్ తర్వాత పెద్ద విషాదం జరిగుండేది,” అని ఒకరు కామెంట్ చేశారు.
“ఈ పూర్తి వ్యవహారం తీవ్ర విషాదానికి దారి తీసేది. ప్రొఫెషనల్ సాయం లేకుండా మీకు మీరుగా గ్యాస్ లీక్ని ఫిక్స్ చేయాలని దయచేసి చూడకండి,” అని మరొకరు రాసుకొచ్చారు.
“వెన్నులో వణుకు వచ్చింది. ఏదో సినిమాలో సీన్లా అనిపించింది. కానీ ఇది నిజంగా జరిగింది,” అని ఇంకొకరు కామెంట్ చేశారు.
“చూడటానికే భయంగా ఉంది. కానీ, గ్యాస్ వాసన వస్తుంటే మెయిన్ వాల్వ్ మూసేయండి,” అని ఓ నెటిజన్ టిప్ ఇచ్చారు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link