





Best Web Hosting Provider In India 2024

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక్, దీప రొమాంటిక్ డ్యాన్స్.. దీపపై పారు దొంగతనం కుట్ర.. జ్యో మీద దశరథ్ కు అనుమానం
కార్తీక దీపం 2 సీరియల్ జూన్ 24 ఎపిసోడ్ లో కార్తీక్ వ్యవహరించే తీరుపై సందేహపడతాడు శివన్నారాయణ. కానీ జ్యోత్స్ననే మారిపోయిందని దశరథ్ అనుకుంటాడు. అటు కార్తీక్, దీప పాటకు స్టెప్పులు వేస్తారు. ఆ వీడియోలు పంపి జ్యోకు వార్నింగ్ ఇస్తుంది దీప. దీపపై పారు దొంగతనం ఆరోపణలు చేస్తుంది.
కార్తీక దీపం 2 ఈ రోజు ఎపిసోడ్ లో మన కంపెనీ రూల్స్ మార్చి రాశాను అని శివన్నారాయణకు దశరథ్ చూపిస్తాడు. కార్తీక్ చెక్ ఇచ్చిన సీన్ నే శివన్నారాయణ గుర్తు చేసుకుంటాడు. తాత నా మీద ఇంకా కోపం పోలేదా? అని జ్యోత్స్న అంటే.. కార్తీక్ గురించి ఆలోచిస్తున్నా అని శివన్నారాయణ అంటాడు. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయాలని అడగాలి లేదా డబ్బో, నగలో అడగాలి.. చెక్ ఏమో జ్యోకు ఇచ్చాడు అని శివన్నారాయణ చెప్తాడు. నేను ఇచ్చిన చెక్ మీద కోట్లు రాసుకుని కార్లు, బంగళాలు కొనుక్కోవచ్చు అలాంటిది నేను ఇచ్చిన సెకండ్ హ్యాండ్ స్కూటీ ఎందుకు తీసుకున్నాడని శివన్నారాయణ అంటాడు.
కార్తీక్ పై అనుమానం
అగ్రిమెంట్ కోసమే ఇంటికి వచ్చినట్లు అనిపించడం లేదూ అని కార్తీక్ గురించి శివన్నారాయణ అనుమానం వ్యక్తం చేస్తాడు. నాన్న వాడికి మనమంటే ప్రేమ నాన్న అని దశరథ్ అంటే.. నీ కూతురును కాదని దీప మెడలో తాళి కట్టినప్పుడు ఇలాగే అనుకోగలిగావా అని ఎదురు ప్రశ్నిస్తాడు శివన్నారాయణ. దీపను ఎవరో పొడిస్తే మన ఇంటికి పోలీసులను పంపాడు, అది ప్రేమేనా? అని అడుగుతాడు. జ్యోత్స్న మీద అనుమానం నాన్న అని దశరథ్ అంటాడు. నువ్వు వాడికి సపోర్ట్ చేస్తే ఏంటీ దశరథ నీ పద్ధతేం నచ్చడం లేదు అని శివన్నారాయణ అసహనం వ్యక్తం చేస్తాడు.
జ్యో మారిపోయింది
నా మనవరాలు ఏ తప్పూ చేయదు, ఏదైనా తప్పు జరిగినా అది కార్తీక్, దీప కారణంగానే అని శివన్నారాయణ అంటాడు. వాళ్ల గురించి మీరెందుకు గొడవ పడతారు, దీప కార్తీక్ భార్యగా ఉన్నంతకాలం కార్తీక్ మన మనిషి కాలేడు అని సుమిత్ర చెబుతుంది. వాడు మారలేదు, మన కూతురే మారిపోయింది అని జ్యో గురించి మనసులో అనుకుంటాడు దశరథ్.
అరుంధతిని చూస్తున్నా
ఇటు తమ ఇంట్లో ఆరుబయట ఆకాశంలోకి చూస్తున్న కార్తీక్ దగ్గరకు దీప వస్తుంది. మన పెళ్లి పెద్ద అరుంధతి ఎక్కడ ఉందా అంటూ చూస్తున్న అని కార్తీక్ చెెప్తాడు. ఇంత మంచి పెళ్లాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తామని చూస్తున్నా అంటాడు. అయితే అత్తకు థ్యాంక్స్ చెప్పాలని దీప అంటుంది. తెల్లవార్లూ అడుగుతూనే ఉంటా అని కార్తీక్ అంటే.. తెల్లవార్లూ చెప్తూనే ఉంటా అని దీప అంటుంది. నిద్రకు ఆగలేవని కార్తీక్ అనగానే కోపంతో లేచి వెళ్లబోతుండగా ఆమె పైట సోఫాకు చిక్కుకుంటుంది.
సాంగ్ స్టెప్పులు
దీంతో కోపాలు చాలండీ శ్రీమతి గారు అంటూ ఇద్దరు సాంగ్ వేసుకుంటారు. చక్కగా నవ్వుకుంటూ స్టెప్పులు వేస్తారు. బావామరదళ్లు అన్నాక ఆ మాత్రం సరదాలు, సరసాలు లేకపోతే ఎలా అని కార్తీక్ ఏదో చెప్పబోతుంటే దీప నిద్రొస్తుంది అంటుంది. మరోవైపు గొడవలన్నీ తీరిపోయాక తిరుపతి వెళ్దాం అల్లుడు అంటూ కాశీతో కావేరి చెప్తుండగా శ్రీధర్ ఎంట్రీ ఇస్తాడు. ఈ గొడవలు ఇప్పట్లో తేలవని అంటాడు. అన్నయ్య గురించి జాగ్రత్తగా మాట్లాడండీ అని స్వప్న అంటే.. కూతురు మీద కోప్పడతాడు శ్రీధర్. స్వప్నను ఏం అనొద్దని కాశీ అంటే నువ్వు నా కూతురుకు మొగుడివో నాకు మొగుడివో అర్థం కావడం లేదని మండిపడతాడు శ్రీధర్.
పారు అత్తయ్య ఫోన్ చేశారని శ్రీధర్ అంటాడు.సెకండాఫ్ ఏం జరిగిందో నేను చెప్తా అని.. తాత ఇచ్చిన చెక్ ను జ్యోత్స్నకు ఇచ్చాడంటా కార్తీక్. ఆవిడేమో రూపాయి రాసిందంటా. ఎప్పటికీ ఇలాగే ఉండిపోతారు అంటూ శ్రీధర్ వెళ్లిపోతాడు. అక్క, బావ ఆదర్శంగా నిలిచిపోతారు, వాళ్లను అర్థం చేసుకోవాలంటే ముందు మనం మనుషులం కావాలి అంటూ కార్తీక్, దీప గురించి చెప్తాడు కాశీ.
వీడియోలు పంపించిన దీప
బావ, దీప కలిసి ఏదో పెద్ద ప్లాన్ లోనే ఉన్నారని జ్యోత్స్న అనుకుంటుంది. ఇంతలో దీప, కార్తీక్ డ్యాన్స్ వీడియోలు, కలిసి ఉన్న ఫొటోలు జ్యో ఫోన్ కు వస్తాయి. వెంటనే కార్తీక్ ఫోన్ నుంచి కాల్ వస్తుంది. ఎందుకు పంపావు బావ అంటే.. పంపింది బావ కాదు మరదలు అని దీప ఇటు నుంచి మాట్లాడుతుంది. ఆ వీడియోలు ఎలా ఉన్నాయో చెప్పమంటుంది దీప. బాగా తేడాగా కనిపిస్తున్నావ్ కానీ తొందర్లోనే అన్నీ సెట్ అవుతాయి అని దీప అంటుంది.
నా బావ
నువ్వు ఊబి లాంటిదానివి, పైకి మామూలుగానే ఉంటావ్ కానీ అడుగు పెడితే లాగేస్తావ్ అని జ్యోత్స్నతో దీప అంటుంది. దీనికి కౌంటర్ ఉంటుంది అని జ్యో చెప్తుంది. నీ బావ కాదు నా బావ అని దీప అంటే జ్యో చిరాకుతో ఉగిపోతుంది. ఇది మూణ్నాళ్ల ముచ్చటే అని జ్యోత్స్న అంటే.. అవును అని పేరు పెట్టి పిలుస్తుంది దీప. నీకు ముందు ఉంది పెద్ద పండగ, ప్రతి రాత్రి శివరాత్రే, ప్రతి రోజు ముత్యాలమ్మ జాతరే అని వార్నింగ్ ఇస్తుంది దీప.
నిజాన్ని దాచి
నేను ఈ ఇంటి వారసురాలిని కాదు, కానీ ఫీల్ అవుతున్నా కదా నిజం బయట పడితే మూణ్నాళ్ల ముచ్చటే కదా అని పారిజాతంతో జ్యో అంటుంది. ఆ విషయం తెలిస్తే దీప ఎందుకు అలా మాట్లాడుతుందే అని పారు అంటే.. ఎందుకంటే అదే అసలైన.. అని చెప్పబోతు జ్యో ఆగిపోతుంది. దీప అసలైన వారసురాలని పారుకు తెలియదు కదా అని జ్యో మనసులోనే అనుకుని ఆపేస్తుంది. దాసును బాబాయ్ అంటుంది కదా అలా తెలిసిందేమోనని జ్యో కవర్ చేస్తుంది.
పారు హెల్ప్
దీప ఇంట్లో ఉండకూడదు, నువ్వే పంపాలి అని పారును హెల్ప్ అడుగుతుంది జ్యో. దాని సంగతి నేను చూస్తా అని పారు అంటుంది. దీపను ఇంట్లోకి రానిచ్చి చాలా పెద్ద తప్పు చేశా అని జ్యో మనసులోనే అనుకుంటుంది. పొద్దున దీప కాఫీలు ఇస్తుండగా పారు యాక్టింగ్ స్టార్టు చేస్తుంది. కాంచన పెళ్లికి నా కోసం కొన్న వజ్రాల దుద్దుల్లో ఓ బుట్ట కనిపించడం లేదు సుమిత్ర అని పారు అనగానే.. ఎక్కడైనా పెట్టి మర్చిపోయావేమో అని శివన్నారాయణ అంటాడు.
దొంగతనం ఆరోపణలు
స్నానం చేసి రెడీ అయ్యాక ఒక్కటి కనిపించడం లేదని పారు అంటుంది. మిస్ అవడం కాదు దొంగతనం చేశారు అని పారు అరుస్తుంది. వాళ్లు కచ్చితంగా గజ దొంగలే అయి ఉంటారు, పోలీస్ కంప్లయింట్ ఇద్దాం అని కార్తీక్ అంటాడు. దొంగతనం చేసింది నీ పెళ్లామే అని పారు ఆరోపణలు చేస్తుంది. గది శుభ్రం చేసేందుకు వచ్చి, బీరువా తెరిచి చేత్తో పట్టుకుపోయావు అని కట్టు కథ అల్లుతుంది పారు. ఊరికే నిందలు వేస్తే ఉరికించి కొట్టాలని పెద్దలు అన్నారు అని కార్తీక్ కౌంటర్ వేస్తాడు. సుమిత్ర పద అంటూ వెతకడానికి వెళ్తుంది పారు. దీంతో కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్