100 కోట్ల దిశగా కుబేర.. కలెక్షన్లు కుమ్మేస్తున్న ధనుష్, నాగార్జున మూవీ.. సోమవారం ఎన్ని కోట్లంటే?

Best Web Hosting Provider In India 2024

100 కోట్ల దిశగా కుబేర.. కలెక్షన్లు కుమ్మేస్తున్న ధనుష్, నాగార్జున మూవీ.. సోమవారం ఎన్ని కోట్లంటే?

కుబేర బాక్సాఫీస్ కలెక్షన్ డే 4: శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన కుబేర మూవీని ఆడియన్స్ ఆదరిస్తున్నారు. సోమవారం (జూన్ 3) కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్లే వచ్చాయి. ఈ ధనుష్, నాగార్జున మల్టీ స్టారర్ నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో ఇక్కడ చూసేయండి.

కుబేర పోస్టర్ లో ధనుష్

కుబేర మూవీ కలెక్షన్లలో అదరగొడుతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా నిలకడగా రాణిస్తోంది. బాక్సాఫీస్ దగ్గర సత్తాచాటుతోంది. ఫిల్మ్ రిలీజైన తర్వాత వచ్చిన తొలి సోమవారం (జూన్ 23) కూడా కుబేర కలెక్షన్ల పరంగా సత్తాచాటింది. త్వరలోనే రూ.100 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టే దిశగా ఈ మూవీ సాగుతోంది. కుబేరలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న కీ రోల్స్ ప్లే చేశారు. ఈ సినిమా నాలుగు రోజుల కలెక్షన్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

కలెక్షన్లు ఇలా

కుబేర మూవీ జూన్ 20న థియేటర్లలో రిలీజైంది. నాలుగు రోజుల్లో ఈ సినిమా ఇండియాలో రూ.54.77 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు సక్నిల్క్ వెబ్ సైట్ వెల్లడించింది. విడుదలైన నాలుగో రోజు కుబేర రూ.5.77 కోట్లు కలెక్ట్ చేసింది. రూ.14.75 కోట్ల కలెక్షన్లతో ప్రారంభమైన ఈ చిత్రం శనివారం 11.86 శాతం పెరిగి రూ.16.5 కోట్లు వసూలు చేసింది. ఆదివారం ఈ చిత్రం రూ.17.35 కోట్లు వసూలు చేసింది. ఇప్పటి వరకు ఈ సినిమా మొత్తం నెట్ వసూళ్లు రూ.54.77 కోట్లుగా ఉన్నాయి.

గ్రాస్ వసూళ్లు

కుబేర గ్రాస్ వసూళ్లు త్వరలోనే రూ.100 కోట్లకు చేరే సూచనలు కనిపిస్తున్నాయి. నాలుగు రోజుల్లో ఈ మూవీ గ్రాస్ కలెక్సన్లు రూ.90 కోట్లు దాటినట్లు సమాచారం. ఈ సినిమాకు సోమవారం తెలుగులో 34.56 శాతం ఆక్యుపెన్సీ నమోదైనట్లు సక్నిల్క్ తెలిపింది. తమిళంలో 16.60 శాతం, హిందీలో 10.74 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ సినిమాను తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు.

లక్ష కోట్ల స్కామ్ చుట్టూ సాగే క్రైమ్ థ్రిల్లర్ గా కుబేర తెరకెక్కింది. ఇందులో ఓ స్పెషల్ మెసేజ్ కూడా ఉంది. ముఖ్యంగా ధనుష్, నాగార్జున యాక్టింగ్ వేరే లెవ్ లో ఉంది.

ధనుష్ కు థ్యాంక్యూ

రష్మిక తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ధనుష్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది. ఆయనతో కలిసి దిగిన సెల్ఫీని పోస్ట్ చేస్తూ ‘మీరు ఒక రత్నం.. ప్రతిరోజూ ఎంతో కష్టపడి పనిచేసినందుకు (మనం వేర్వేరు నగరాల్లో ఉన్న ప్రతిసారీ ఈ విషయం తెలుసుకోండి, వేర్వేరు పనులు చేస్తున్నాం, విశ్రాంతి ఎంత ముఖ్యమో మాట్లాడుకుంటాం, కానీ దాని గురించి మనం ఎప్పుడూ ఏమీ చేయలేకపోతున్నాం) కుబేరలో మాత్రమే కాకుండా, ఈ రకమైన ప్రదర్శన కొనసాగిస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు. కానీ మీరు చేసే ప్రతి పనిలోనూ.. నమ్మశక్యం కానిది ఏమీ లేదు..” అని రష్మిక పేర్కొంది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024