





Best Web Hosting Provider In India 2024

డ్రగ్స్ కేసులో అరెస్టయిన శ్రీరామ్ చేసిన తెలుగు సినిమాలు ఏవో తెలుసా? ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఇదే.. ఓ లుక్కేయండి
శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ డ్రగ్స్ వాడినట్లు తేలడం కలకలం రేపుతోంది. తెలుగు, తమిళంలో సినిమాలు చేసిన ఈ నటుడి గురించి నెటిజన్లు తెగ వెతుకుతున్నారు. మరి అతను తెలుగులో చేసిన సినిమాలు ఏవో తెలుసా? ఓ లుక్కేయండి.
టాలీవుడ్ లో హీరో, సైడ్ క్యారెక్టర్, విలన్ తరహా వేషాలతో పాపురల్ అయ్యాడు శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్. మన ఏపీకి చెందిన అతను తమిళనాడులో డ్రగ్ కేసులో అరెస్టు కావడం కలకలం రేపుతోంది. మెడికల్ టెస్టుల్లో శ్రీరామ్ డ్రగ్స్ వాడినట్లు తేలిందని పోలీసులు చెప్తున్నారు. 40 సార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో శ్రీరామ్ తెలుగులో చేసిన సినిమాలు ఏవి? అనే చర్చ జోరందుకుంది. మీరూ ఓ సారి చూసేయండి.
ఆ సినిమాతో అడుగు
2002లో వచ్చిన తమిళ సినిమా రోజా కూటమ్ తో తెరంగేట్రం చేశాడు శ్రీకాంత్. ఆ సినిమాకు ఐటీఎఫ్ఏ ఉత్తమ నూతన నటుడి అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాతి ఏడాది ఒకరికి ఒకరు సినిమాతో తెలుగులో అడుగుపెట్టాడు శ్రీకాంత్. ఇందులో డ్యుయల్ రోల్ పోషించాడు. ఆ తర్వాత నాలుగేళ్ల పాటు మళ్లీ తెలుగులో కనిపించలేదు. తమిళ్ సినిమాలతో బిజీ అయిపోయాడు.
వెంకటేష్ మూవీతో
శ్రీకాంత్ తిరిగి 2007లో టాలీవుడ్ కు వచ్చాడు. వెంకటేష్ హీరోగా వచ్చిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో వాసు క్యారెక్టర్ చేశాడు శ్రీకాంత్. హీరో ఫ్రెండ్ గా, హీరోయిన్ ను పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించే పాత్రలో శ్రీకాంత్ తెలుగు ఫ్యాన్స్ కు గుర్తుండే ఉంటాడు. 2010లో పోలీస్ పోలీస్ అనే తెలుగు సినిమా చేశాడు శ్రీకాంత్.
తెలుగులో ఇవి
తెలుగులో శ్రీకాంత్ సినిమాలకు గ్యాప్ వచ్చేది. 2011లో దడ, 2012లో నిప్పు మూవీస్ చేశాడు. మళ్లీ 2017లో లై సినిమాలో కనిపించాడు. రాగల 24 గంటల్లో, జై సేన, వై, అసలేం జరిగింది, 10త్ క్లాస్ డైరీస్, రావణాసుర, పిండం, వలారి సినిమాల్లో నటించాడు. వెబ్ సిరీస్ ల్లోనూ యాక్ట్ చేశాడు. చివరగా జియోహాట్ స్టార్ ఓటీటీలో వచ్చిన హరికథలో కనిపించాడు.
అందుకే పేరు మార్పు
నిజానికి శ్రీకాంత్ అనేది ఈ యాక్టర్ రియల్ పేరు. కానీ తెలుగులో అప్పటికే నటుడు శ్రీకాంత్ ఉన్నాడు. పైగా ఆయన ఫేమస్. అందుకే అదే పేరుతో టాలీవుడ్ లో మరో నటుడు అంటే ఇబ్బందేమో అని ఈ శ్రీకాంత్ పేరు మార్చుకున్నాడు. టాలీవుడ్ సినిమాల కోసం మాత్రం తన పేరును శ్రీకాంత్ నుంచి శ్రీరామ్ గా మార్చుకున్నాడు.
తెలుగు, తమిళ్
శ్రీకాంత్ బ్లడ్ లోనే తెలుగు, తమిళ్ కనెక్షన్ ఉంది. అతని తండ్రి ఏపీలోని చిత్తురూకు చెందినవాళ్లు. తల్లిది ఏమో తమిళనాడు. చెన్నైలో పుట్టిన శ్రీకాంత్ హైదరాబాద్ లో పెరిగాడు. అతని తండ్రి ఎస్బీఐ బ్యాంకులో ఉద్యోగం చేేసేవాళ్లు. 2008లో వందన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు శ్రీకాంత్. వీళ్లకు ఇద్దరు పిల్లలున్నారు.
సంబంధిత కథనం