




Best Web Hosting Provider In India 2024

వారం ముందుగానే ఓటీటీలోకి వచ్చేసిన పొలిటికల్ కామెడీ డ్రామా.. ఆ సూపర్ హిట్ వెబ్ సిరీస్ లో నాలుగో సీజన్.. ఎక్కడ చూడొచ్చంటే?
సూపర్ హిట్ వెబ్ సిరీస్ నాలుగో సీజన్ ఓటీటీలోకి వచ్చేసింది. ఓ గ్రామంలో ఎన్నికల డ్రామా నేపథ్యంలో వచ్చే బలమైన ఎమోషన్, కామెడీతో ఈ సిరీస్ ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అయింది. ఈ రోజు (జూన్ 24) ను డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఆ సిరీస్ ఏంటీ? ఎక్కడ ఉంది? అనే విషయాలు ఇక్కడ తెలుసుకోండి.
హిందీ వెబ్ సిరీస్ ల్లో పంచాయత్ సిరీస్ కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఓ విలేజ్ లో పొలిటికల్ డ్రామాగా వచ్చే ఈ సిరీస్ లో కామెడీకి కొదవ ఉండదు. తొలి మూడు సీజన్లు సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ నాలుగో సీజన్ వచ్చేసింది. మంగళవారం (జూన్ 24) నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఏ ఓటీటీలో అంటే?
పంచాయత్ సీజన్ 4 వెబ్ సిరీస్ ఓటీటీలో రిలీజైంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ కంటే వారం రోజుల ముందే ఈ సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ రోజు నుంచే ఆడియన్స్ కు అందుబాటులో ఉంది. ఈ హిందీ వెబ్ సిరీస్ ఈ సారి మరింత ప్రత్యేకంగా రెడీ అయింది. ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూసిన ఆ టైమ్ రానే వచ్చింది.
జితేంద్ర, నీనా
ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న వెబ్ సిరీస్ పంచాయత్ సీజన్ 4 ట్రైలర్‌ను ఒక వారం క్రితం విడుదల చేసి, ఓటీటీ విడుదల తేదీ ముందుకు తెచ్చినట్లు నిర్మాతలు ధ్రువీకరించారు. ఈ సిరీస్ తో జితేంద్ర కుమార్, నీనా గుప్తా మరోసారి ఆడియన్స్ ను మెప్పించడానికి వచ్చేశారు. ఈ వెబ్ సిరీస్ నాలుగో సీజన్ ట్రైలర్ తోనే అంచనాలు పెరిగిపోయాయి.
పంచాయతీ ఎన్నికలు
మొదటి మూడు సీజన్ల భారీ విజయం తరువాత.. జితేంద్ర కుమార్, నీనా గుప్తా, రఘుబీర్ యాదవ్ సూపర్ హిట్ రాజకీయ డ్రామా పంచాయత్ కొత్త సీజన్‌తో ప్రేక్షకులను అలరించడానికి వచ్చేశారు. ఈ సిరీస్ మధ్యప్రదేశ్‌లోని మహోడియా గ్రామంలో ఉన్న పంచాయతీ కార్యాలయంలో షూట్ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన్, భూషణ్ శిబిరాల మధ్య ఫైట్ ఇందులో చూడొచ్చు.
అక్కడి నుంచి
దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహించిన పంచాయత్ సీజన్ 4 వెబ్ సిరీస్ ఉత్తరప్రదేశ్‌లోని ఫులేరా అనే ఒక దూరప్రాంత గ్రామం చుట్టూ సాగుతుంది. అక్కడ పంచాయతీ కార్యదర్శిగా చేరిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కథ కీలకం. ఈ కొత్త సిరీస్ పంచాయతీ సీజన్ 3 క్లిఫ్హాంగర్ నుంచి ప్రారంభమై జితేంద్ర కుమార్, సచివ్ జీ, నీనా గుప్తా, మంజు దేవి ఇలా అందరి చుట్టూ తిరుగుతుంది. పొలిటికల్ డ్రామా, కామెడీతో పాటు లవ్ యాంగిల్ కూడా ఈ సిరీస్ లో మెప్పించేలా ఉందనే టాక్ వినిపిస్తోంది.
సంబంధిత కథనం