వెయిట్‌ లాస్ కోచ్ సలహా: బరువు తగ్గాలనుకునేవారు రెస్టారెంట్లలో చేయకూడని 4 పొరపాట్లు

Best Web Hosting Provider In India 2024

వెయిట్‌ లాస్ కోచ్ సలహా: బరువు తగ్గాలనుకునేవారు రెస్టారెంట్లలో చేయకూడని 4 పొరపాట్లు

HT Telugu Desk HT Telugu

వెయిట్ లాస్ డైట్‌లో ఉన్నారా? సరైన జాగ్రత్తలు తీసుకుంటే బయట తింటూ కూడా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనిపై వెయిట్ లాస్ కోచ్ మెలిస్సా తన అనుభవాలను పంచుకున్నారు.

రెస్టారెంట్లలో చేసే ఈ 4 పొరపాట్లు చేయకండి (istockphoto)

బరువు తగ్గాలనుకునేవారు రెస్టారెంట్లకి వెళ్లాలంటే కాస్త ఆలోచిస్తుంటారు. బయట తినడం వల్ల తమ వెయిట్ లాస్ జర్నీకి ఆటంకం కలుగుతుందేమోనని భయపడుతుంటారు. అయితే, సరైన జాగ్రత్తలు తీసుకుంటే బయట తింటూ కూడా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనిపై వెయిట్ లాస్ కోచ్ మెలిస్సా తన అనుభవాలను పంచుకున్నారు. తాను 9 కిలోలు తగ్గానని చెప్పారు. రెస్టారెంట్లలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదో వివరించారు. జూన్ 7న ఆమె ఈ విషయాలను ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ ద్వారా వెల్లడించారు. “బరువు తగ్గాలనుకునేవారు రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు ఈ పొరపాట్లు చేయకండి” అని ఆమె సూచించారు.

1. డిన్నర్‌ కోసం కేలరీలను ఆదా చేయడం

పొరపాటు: రోజంతా సరిగ్గా తినకుండా, రెస్టారెంట్‌కు బాగా ఆకలితో వెళ్లడం. ఇలా చేయడం వల్ల ఆహారం వాసనలు, దృశ్యాలు ఆకలితో ఉన్న మీ మెదడును ప్రభావితం చేస్తాయి. ఫలితంగా, ఆరోగ్యకరమైనవి కాకుండా రుచికరమైనవి ఎంచుకునే అవకాశం ఉంటుంది.

ఏం చేయాలి?: సాధారణ ఆకలితో వెళ్తే మంచి ఎంపికలు చేసుకోగలుగుతారు. రెస్టారెంట్‌కు ప్లాన్ చేసినప్పటికీ రోజులాగే తినండి. బాగా ఆకలితో వెళ్లకండి. కార్బోహైడ్రేట్లు, కొవ్వులు కాస్త తక్కువగా తీసుకోవచ్చు.

2. కాక్‌టెయిల్‌తో ప్రారంభించడం

పొరపాటు: భోజనం ప్రారంభించే ముందు కాక్‌టెయిల్‌ తీసుకోవడం. ఇలా చేస్తే దాహం తీర్చుకోవడానికి, ఆకలి తీర్చుకోవడానికి ఎక్కువగా తాగే అవకాశం ఉంటుంది. దీనివల్ల అనవసరమైన ద్రవ కేలరీలు శరీరంలోకి చేరుతాయి.

ఏం చేయాలి?: ముందుగా కనీసం ఒక పెద్ద గ్లాసు నీరు తాగండి. దీనివల్ల శరీరానికి కావాల్సిన నీరు అందుతుంది. దాహం కూడా తీరుతుంది. అప్పుడు కూడా మీకు ఏదైనా డ్రింక్ కావాలంటే, తక్కువ మొత్తంలో తాగుతారు లేదా చాలా సార్లు అసలు తాగాలనిపించదు.

3. రెస్టారెంట్‌కు మీ ప్రాధాన్యతలు చెప్పకపోవడం

పొరపాటు: మెనూలో ఉన్నది ఉన్నట్టుగా ఆర్డర్ చేయడం. రెస్టారెంట్లలో ఆహారంలో సాస్‌లు, డ్రెస్సింగ్‌లు, బ్రెడ్‌కు రాసే వెన్న వంటివి ఎక్కువగా వేయడం వల్ల కేలరీలు పెరుగుతాయి.

ఏం చేయాలి?: కేలరీలను తగ్గించడానికి మీకు కావాల్సిన మార్పులను రెస్టారెంట్‌కు చెప్పండి. డ్రెస్సింగ్‌లు, సాస్‌లు పక్కన ఇవ్వమని అడగండి. బ్రెడ్‌కు వెన్న వద్దు అని చెప్పండి. లేదా కూరగాయలను వేయించడానికి బదులుగా ఆవిరిలో ఉడికించమని కోరండి. ఇలా చేస్తే రుచి తగ్గకుండానే కేలరీలు తగ్గుతాయి.

4. డబ్బులు చెల్లించారు కాబట్టి ఎక్కువ తినాలని ఆలోచించడం

పొరపాటు: “నేను డబ్బులు చెల్లించాను కాబట్టి వృథా చేయకూడదు” అనే ఆలోచనతో అవసరం లేకపోయినా ఎక్కువ తినడం. మీకు అవసరం లేని ఆహారం మీ శరీరంలోకి వెళ్లినా, చెత్తబుట్టలోకి వెళ్లినా అది వృథానే.

ఏం చేయాలి?: 80 శాతం కడుపు నిండగానే తినడం ఆపేయండి. ఒకటి రెండు నిమిషాలు మీ ఫోర్క్, స్పూన్ పక్కన పెట్టండి. ఆ తర్వాత మీకు నిజంగా ఇంకా కావాలా అని ఆలోచించండి. వద్దు అనుకుంటే, మీకు సరిపడా తిన్నందుకు సంతోషించండి. అక్కడితో ఆపడం మీ ఆరోగ్యానికి మంచిది.

(గమనిక: ఈ కథనం కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా వైద్య సమస్యల గురించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే ఎల్లప్పుడూ మీ డాక్టర్‌ను సంప్రదించండి.)

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.
Source / Credits

Best Web Hosting Provider In India 2024