





Best Web Hosting Provider In India 2024

నిన్ను కోరి జూన్ 24 ఎపిసోడ్: చంద్రకు పోటీగా తల్లీకూతుళ్ల పచ్చళ్ల బిజినెస్- ఇంట్లో ఫొటోషూట్- కోడలిని కాపాడిన జగదీశ్వరి
నిన్ను కోరి సీరియల్ జూన్ 24 ఎపిసోడ్లో చంద్రకళకు పోటీగా పచ్చళ్ల బిజినెస్ పెడతారు తల్లీకూతుళ్లు కామాక్షి, శ్రుతి. అందుకోసం ఫొటోషూట్ చేస్తారు. తల్లితో ఉన్న చంద్రకళ ఫొటోను శ్యామల చూసేలా శాలిని కింద పడేస్తుంది. అది చూడకుండా ఉండేలా జగదీశ్వరి వచ్చి అడ్డుగా నిల్చుంటుంది. దాంతో శ్యామల వెళ్లిపోతుంది.
నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో తల్లి జగదీశ్వరిన తన చేతికి కట్టు కట్టడంతో మురిసిపోతాడు విరాట్. చంద్రకళ అడిగితే ఇన్నిరోజుల తర్వాత అమ్మ స్పర్శ తగిలింది. అమ్మకు నా మీద కోపం ఉన్న లోపల ప్రేమ ఉంది. ఎప్పటిలా నాపై ప్రేమ చూపిస్తుందని నాకు నమ్మకం ఉందని చెబుతాడు విరాట్.
నీకు దూరం చేయాలని
నీకు ఎలా ఉందో నాకు నీ మీద అలాగే ఉందని చంద్రకళ అంటుంది. నటించకు చంద్ర. నాకు దెబ్బ తగిలితే నువ్ రాలేదని విరాట్ అంటే.. అత్తయ్య రావడం చూసే నేను ఆగిపోయాను. అత్తయ్య బయటపడే సందర్భాన్ని నీకు దూరం చేయాలని అనుకోలేదని చంద్ర అంటుంది. తర్వాత ఇంట్లోకి ఫొటోగ్రాఫర్స్ వస్తారు. విరాట్ పిలిపించుకున్నాడనుకుని భలే సర్ప్రైజ్ ప్లాన్ చేశావని శ్యామల అంటుంది.
నాకేం తెలియదని విరాట్ అంటే వాళ్లను పిలిచింది తనేనని కామాక్షి చెబుతుంది. కామాక్షి, శ్రుతి రెడీ అయి ఉంటారు. రోజులు మారాలి, పోస్టులు మారాలి, పెత్తనాలు పడిపోవాలి అని ఛత్రపతి డైలాగ్ కొడుతుంది కామాక్షి. తల్లీకూతుళ్లు ఇద్దరు బిజినెస్ పెడుతున్నట్లు చెబుతారు. ఏం బిజినెస్ అని చంద్రకళ అడిగితే నిన్ను కొల్లగొట్టే బిజినెస్ అని కామాక్షి అంటుంది.
పచ్చళ్లు బిజినెస్ అని శ్రుతి అంటుంది. మా పచ్చళ్లు బ్రాడ్కాస్ట్లో ఉంటాయి. నేరుగా కస్టమర్స్ దగ్గరికే వెళ్తాయి అని శ్రుతి చెబుతుంది. పచ్చళ్ల బిజినెస్ కోసం తల్లీకూతుళ్లు కామాక్షి, శ్రుతి ఫొటోషూట్ చేస్తూ పోజులు ఇస్తారు. తమ పచ్చళ్లకు మోడ్రన్ పికిల్స్ అని పేరు పెట్టినట్లు శ్రుతి చెబుతుంది. ఇవన్నీ మీకు అవసరమా అని శాలిని తిట్టి వెళ్లిపోతుంది.
ఫ్యామిలీ ఫొటో బయటకు
మరోవైపు చంద్రకళ పాటలు పాడుకుంటూ తన బ్యాగ్ సర్దుకుంటుంది. ఇంత హుషారుగా ఎందుకుందని శాలిని ఓ కన్నేసి చూస్తుంది. ఇంతలో బ్యాగ్ నుంచి తల్లితో చంద్రకళ దిగిన ఫొటో కిందపడుతుంది. అది తన ఫ్యామిలీ ఫొటోనా అని డౌట్ పడిన శాలిని చంద్రకళ వెళ్లగానే గదిలోకి వెళ్తుంది. వెళ్లి ఆ ఫొటో చూస్తుంది శాలిని. దొరికావ్ చంద్ర. ఇప్పుడు ఈ ఫొటో శ్యామల పిన్ని ముందు పెడితే నీ పుట్టింటి రహస్యం తెలిసిపోయి ఇంట్లోంచి గెంటేస్తుంది అని శాలిని అనుకుంటుంది.
నేను చేసినట్లు తెలియకుండా ఎలాగైనా తన కళ్లముందు పడేలా చేస్తాను అని ప్లాన్ చేస్తుంది శాలిని. ఆ ఫొటోను కామాక్షి, శ్రుతికి చూపించి తన ప్లాన్ చెబుతుంది శాలిని. తర్వాత శ్యామల వస్తున్న దారిలో ఆ ఫొటోను విసిరిపడేస్తుంది శాలిని. అది చంద్రకళ చూస్తుంది. శ్యామల దగ్గరికి చంద్రకళ వచ్చి నిల్చుంటుంది. లంచ్ గురించి అడిగితే చంద్ర చెబుతుంది.
శ్యామల ఫొటో చూడకుండా వెళ్లిపోతుంటే కింద చూసుకుని నడవండి. తడిగా ఉందని శాలిని అంటుంది. ఏంటీ నన్ను పడేయటానికి ఏమైనా ప్లాన్ చేశావా అని శ్యామల అంటుంది. అప్పుడు ఫ్లోర్ అంతా చూస్తూ ఫొటోవైపుకు శ్యామల చూడబోతుండంగా.. జగదీశ్వరి వచ్చి అడ్డుగా నిల్చుంటుంది. అలా పుట్టింటి రహస్యం తెలియకుండా చంద్రకళను కాపాడుతుంది జగదీశ్వరి.
కోడలిగా ఒప్పుకున్నట్లేగా
చంద్రకళతో చిన్న పని ఉందని జగదీశ్వరి అంటే.. శ్యామల నువ్వు ఉండు నేను వంట చేస్తాను అని శ్యామల వెళ్లిపోతుంది. ఫొటో అడ్డుగా తప్పుకుంటుంది జగదీశ్వరి. దాంతో ఆ ఫొటోను చంద్ర తీసుకుంటుంది. నీ ఆటలు సాగుతున్నాయని మైమర్చిపోతున్నావేమో. జాగ్రత్త. ఇలాంటివి నీ రూమ్ వరకే చూసుకో అని జగదీశ్వరి వార్నింగ్ ఇస్తుంది.
ఓ పక్క కోడలు అంటే గిట్టనట్టే ఉంటుంది. మరోవైపు కాపాడుతూనే ఉంటుంది అని కామాక్షి అంటుంది. మంచి ఛాన్స్ మిస్ అయిందమ్మ అని శ్రుతి అంటుంది.
గదిలోకి వెళ్లిన చంద్ర లోపల దాచిపెడుతుంది. అత్తయ్యకు థ్యాంక్స్ చెప్పాలి అని వెళ్లి చెబుతుంది. పెద్ద ప్రమాదం నుంచి కాపాడారు. అంటే మీరు నన్ను కోడలిగా యాక్సెప్ట్ చేసినట్లేగా అని చంద్రకళ అంటుంది. అక్కడితో నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్