





Best Web Hosting Provider In India 2024

ఆ సూపర్ హిట్ సినిమా తెగ నచ్చేసింది.. విలువైన టైమ్ కు సరిపోయేదే.. మహేష్ బాబు కామెంట్లు.. అది ఏ ఓటీటీలో ఉందంటే?
సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఓ సినిమా పిచ్చిపిచ్చిగా నచ్చేసింది. డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీని ఆలస్యంగా చూసినా.. ఫిల్మ్ టీమ్ పై మహేష్ ప్రశంసలు కురిపించారు. అద్భుతమైన సినిమా అంటూ కొనియాడారు. ఆ మూవీ ఏ ఓటీటీలో ఉందంటే?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళితో ఎస్ఎస్ఎంబీ 29 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ షూటింగ్ నుంచి గ్యాప్ దొరికితే వెకేషన్లు, మూవీలు చూడటంతో గడిపేస్తున్నారు మహేష్. తాజాగా ఓటీటీలో ఓ మూవీ చూశారు. అది ఆయనకు తెగ నచ్చేసింది. దీంతో ఆ మూవీని పొగిడేస్తూ ఎక్స్ లో పోస్టు చేశారు. ఇంతకీ ఆ సినిమా ఏదంటారా? అదే.. ఓటీటీలో దుమ్ము రేపుతోన్న ‘అనగనగా’.
అర్హత కలిగిందే
అనగనగా మూవీపై మహేష్ బాబు ప్రశంసలు కురిపించారు. కచ్చితంగా మీ సమయానికి తగిన అర్హత కలిగిందే అని ఎక్స్ లో బుధవారం పోస్టు చేశారు. ‘‘సింపుల్, ఎమోషనల్ స్టోరీ అనగనగాను అద్భుతంగా చెప్పారు. ఈ సినిమా కచ్చితంగా మీ సమయానికి తగ్గ అర్హత కలిగిందే. సుమంత్, మొత్తం టీమ్ గొప్ప పనితీరు కనబరిచారు. నా ప్రేమను పంపిస్తున్నా’’ అని మహేష్ ట్వీట్ చేశారు.
ఏ ఓటీటీలో ఉందంటే
విద్యా వ్యవస్థలోని లోపాలతో పాటు తండ్రీ కొడుకుల బంధాన్ని ఎమోషనల్ గా చూపించిన ఈ మూవీ మహేష్ బాబుకు కూడా నచ్చేసింది. ఈ మూవీ డైరెక్ట్ గా ఓటీటీలోకి రిలీజైంది. మే 15న ఈ సినిమా నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది. అప్పటి నుంచి ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది ఈ మూవీ. సన్నీ సంజయ్ ఈ మూవీకి డైరెక్టర్.
150 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్
అనగనగా మూవీ ఇప్పటికే స్ట్రీమింగ్ లో కొత్త రికార్డులు నెలకొల్పుతుంది. ఇప్పటికే 150 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ ను దాటేసింది. ఇంకా ఆ సినిమా స్ట్రీమింగ్ మినట్స్ భారీగా పెరిగే అవకాశముంది. ఈ మూవీ సుమంత్ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. వ్యాస్ సర్ గా, తండ్రి అతని యాక్టింగ్ కట్టిపడేసింది.
ఎమోషనల్ మూవీ
విద్యా వ్యవస్థలోని లోపాలను, విద్యారంగాన్ని ఎలా వ్యాపారంగా మారుస్తున్నారో అనే విషయాన్ని చెబుతూనే.. తండ్రీ కొడుకుల మధ్య అనుబంధాన్ని చక్కగా చాటింది అనగనగా మూవీ. ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరూ ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే మరో లెవల్ లో ఉంది. పిల్లలను ఎలా చూసుకోవాలి? వాళ్లకు ఎలాంటి విద్య అందించాలనేది ఈ సినిమాలో చక్కగా చూపించారు.
అనగనగా సినిమాను ప్రశంసిస్తూ మహేష్ బాబు ఎక్స్ లో పెట్టిన పోస్టుకు సుమంత్ రియాక్టయ్యారు. ‘‘నా ప్రియమైన సోదరా థ్యాంక్యూ. చాలా చాలా ప్రశంసించాల్సిందే ఇది’’ అని రిప్లే ఇచ్చారు.
సంబంధిత కథనం