





Best Web Hosting Provider In India 2024

రజనీకాంత్ కూలీ నుంచి వచ్చేసిన ఫస్ట్ సింగిల్.. చికిటు చికిటు అంటూ అదిరే స్టెప్పులేసిన సూపర్ స్టార్
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కూలీ మూవీ నుంచి చికిటు చికిటు అంటూ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. అనిరుధ్ అదిరిపోయే బీట్, సూపర్ స్టార్ స్టైలిష్ స్టెప్స్ తో ఈ సాంగ్ దుమ్ము రేపుతోంది. మరి ఈ సాంగ్ ఎలా ఉందో మీరే చూడండి.
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న మూవీ కూలీ. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ బుధవారం (జూన్ 25) సాయంత్రం 6 గంటలకు రిలీజైంది. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. చికిటు చికిటు అంటూ మాస్ బీట్స్ తో సాగిన ఈ పాటలో సూపర్ స్టార్ వేసిన స్టెప్స్ హైలైట్ అని చెప్పొచ్చు.
చికిటు చికిటు.. ఇన్‌స్టాంట్ హిట్
రజనీకాంత్ లీడ్ రోల్లో నటిస్తున్న కూలీ మూవీ ఆగస్ట్ 14, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇక తాజాగా వచ్చిన చికిటు చికిటు సాంగ్ గురించి చెప్పాలంటే.. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, టి. రాజేందర్ బీట్ బాక్సింగ్, అరివు రాసిన లిరిక్స్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోంది. ‘చికిటు’ సాంగ్ ప్రోమో జూన్ 24న విడుదలై, రజనీకాంత్ స్టైలిష్ అవతార్‌తో అభిమానులను ఆకర్షించింది.
“బ్రో.. వాట్ దా.. చాలు బ్రో, ఓ హాట్ కప్ టీ తర్వాత మళ్లీ వద్దాం” అంటూ పాట ప్రారంభమవుతుంది. మొదట టీ.రాజేందర్, అనిరుధ్ పాటలో కనిపిస్తారు. ఆ తర్వాత సూపర్ స్టార్ ఎంట్రీ ఇస్తాడు. రజనీ గ్రేస్‌తో నిండిన డ్యాన్స్ స్టెప్స్‌తో అభిమానులను ఉర్రూతలూగించిందీ పాట. ఈ ఫస్ట్ సింగిల్ తో కూలీ మూవీపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.
కూలీ మూవీ గురించి..
‘కూలీ’లో రజనీకాంత్ తోపాటు నాగార్జున అక్కినేని, ఉపేంద్ర, శ్రుతి హాసన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పూజా హెగ్డే ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించనుంది. ఈ పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. హిందీలో ‘మజ్దూర్’ టైటిల్‌తో విడుదలవుతున్న ఈ మూవీ, రజనీకాంత్ మాస్ ఇమేజ్‌ను లోకేశ్ కనగరాజ్ స్టైల్‌లో చూపించబోతోంది.
సోషల్ మీడియాలో ‘చికిటు’ సాంగ్ రిలీజ్‌తో అభిమానులు ఉత్సాహంగా స్పందిస్తున్నారు. “రజనీ స్టైల్, అనిరుధ్ బీట్స్, లోకేశ్ విజన్.. ఈ సాంగ్ ఫైర్!” అని ఒక అభిమాని కామెంట్ చేశారు. ఈ సాంగ్ విడుదలను విజయ్ పుట్టినరోజు కారణంగా జూన్ 21 నుంచి జూన్ 25కు మార్చినట్లు సమాచారం.
ఆగస్టు 14న ‘కూలీ’తో పాటు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన ‘వార్ 2’ కూడా రిలీజ్ కానుంది. ఇది బాక్సాఫీస్ వద్ద భారీ వార్ జరగబోతున్నట్లు స్పష్టం చేస్తోంది. రజనీకాంత్ మాస్ అప్పీల్, లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ తో ‘కూలీ’ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ ‘చికిటు’ సాంగ్ ‘కూలీ’ సినిమాకు ఉన్న హైప్‌ను మరింత పెంచింది.
సంబంధిత కథనం