



Best Web Hosting Provider In India 2024

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మీనా అందానికి ఫ్లాటైపోయిన బాలు – సంజు విశ్వరూపం – ప్రభావతి పంచాయితీ
గుండె నిండా గుడి గంటలు జూన్ 26 ఎపిసోడ్‌లో ఫంక్షన్ కోసం మీనా, బాలుకు తప్ప ఇంట్లో అందరికి బట్టలు కొంటుంది ప్రభావతి. మీనా కోసం బాలు చీర కొని తీసుకొస్తాడు. అప్పులు అవుతున్న గొప్పలకు ఏం తక్కువ లేదని బాలు, మీనాలపై సెటైర్లు వేస్తుంది ప్రభావతి.
శృతి ఫంక్షన్‌కు సంజు, మౌనికలను పిలవాలని నీలకంఠం ఇంటికి వస్తారు ప్రభావతి, సత్యం. వారి ముందు తమ అసలు రంగు బయటపెడతారు సంజు, నీలకంఠం. ఎలా ఉన్నావని మౌనికను అడుగుతుంది ప్రభావతి.మౌనికను రోజుకో రకం టార్చర్ పెడుతున్నాను.
మీ అమ్మాయి మా ఇంట్లో ఎందుకు బాగుంటుంది అని సంజు తిక్కతిక్కగా బదులిస్తాడు. మౌనిక ఒంటిపై నగలేమి లేకుండా బోసిగా కనిపిస్తుంది. నగలు ఏమయ్యాయని ప్రభావతి అడుగుతుంది. బంగారం రేటు పెరిగిందని మేమే అమ్మేశామని సంజు బదులిస్తాడు. సంజు మాటలతో సత్యం, ప్రభావతి బాధపడతారు. సింపుల్‌గా ఉండటమే నాకు ఇష్టం మౌనిక కవర్ చేస్తుంది.
నాతో పెళ్లి ఫిక్సైన తర్వాత…
శృతి, రోహిణి నల్లపూసల ఫంక్షన్‌కు పిలవడానికి వచ్చామని సంజుతో ప్రభావతి అంటుంది. శృతి అంటే నాతో పెళ్లి ఫిక్సైన తర్వాత వీళ్ల అబ్బాయితో లేచిపోయింది ఆమె కదా అని సంజు అంటాడు. మమ్మల్ని అవమానించిన వాళ్ల ఫంక్షన్‌కు వచ్చేది లేదని నీలకంఠం అంటాడు. శృతి ఫ్యామిలీ తమను మోసం చేసిందని సంజు ఫైర్ అవుతాడు. నా భర్తకు, మావయ్యకు ఇష్టంలేని చోటుకు నేను రానని తల్లిదండ్రులతో మౌనిక అంటుంది. కూతురి మాటలకు సత్యం కన్వీన్స్ అవుతాడు. ఇంటి కోడలిగా నువ్వు మాట్లాడింది కరెక్ట్ అని కూతురిని సపోర్ట్ చేస్తాడు.
ప్రభావతి షాక్…
మౌనికలో వచ్చిన మార్పు చూసి ప్రభావతి షాకవుతుంది. మన మౌనికనేనా అని అంటుంది. చిన్న వయసులో అత్తింటి గౌరవం గురించి ఎలా ఆలోచించాలో అలాగే ఆలోచించింది అని కూతురిని వెనకేసుకొని వస్తాడు సత్యం.
డ్రామాలు ఆడుతున్నావు…
ప్రభావతి, సత్యం వెళ్లిపోగానే మౌనికపై ఫైర్ అవుతాడు సంజు. ఎక్కడ మీ అమ్మనాన్నలను నేను అవమానిస్తానో అని తెలివిగా వారిని ఇక్కడి నుంచి పంపించేశావని అంటాడు. సడెన్‌గా మా మీద మీ ఇంటి మీద గౌరవం పుట్టికొచ్చినట్లు భలే డ్రామాలు ఆడావని నోటికి వచ్చినట్లు మాట్లాడుతాడు. తన మాటలకు మౌనిక ధీటుగా బదులివ్వడంతో సంజు కోపం పట్టలేకపోతాడు. ఆమె పీక పట్టుకొని కొట్టబోతాడు. సువర్ణ వచ్చి సంజును అడ్డుకుంటుంది.
ప్రభావతి బిల్డప్‌లు…
బాలు, మీనా హాల్‌లో పడుకోవడానికి సిద్ధమవుతారు. అప్పుడే హాల్‌లోకి ప్రభావతి, శృతి, రోహిణి వస్తారు.
ఫంక్షన్‌కు ఏ చీర కట్టుకోవాలో, ఏ నగలు వేసుకోవాలో అనే డిస్కషన్‌ను హాల్‌లో పెడుతుంది. శృతి, రోహిణిల కోసమే చీరలు కొంటుంది ప్రభావతి. ఫంక్షన్‌కు గొప్పవాళ్లు వస్తారని, వాళ్ల ముందు మనం ఏ మాత్రం తగ్గకూడదని బిల్డప్‌లు ఇస్తుంది. మరి నువ్వు ఏ చీర కట్టుకుంటావని మీనాను అడుగుతాడు బాలు. నాకు ఉన్నవాటిలో మంచిది కట్టుకుంటానని మీనా బదులిస్తుంది. పుట్టింటి పట్టుచీరలు దాచుకోవడానికి బీరువా సరిపోవడం లేదని మీనాపై సెటైర్లు వేస్తుంది ప్రభావతి.
కట్టుకున్నవాడు తెచ్చిన చీరనే…
నా దగ్గర కట్టుకొని చీరలు చాలా ఉన్నాయని ఒకటి ఇస్తానని శృతి అంటుంది. కట్టుకున్నవాడు తెచ్చిన చీరలు తప్పు తాను మరొకరి చీరలు కట్టనని మీనా బదులిస్తుంది. మీనా కోసం బాలు పూలు తెచ్చిన సంగతి శృతి కనిపెడుతుంది. వాళ్లను డిస్ట్రబ్ చేయకూడదని ప్రభావతి, రోహిణిలను తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ప్రభావతి హడావిడి…
ఫంక్షన్ కోసం అందరి కంటే ముందుగానే రెడీ అయిపోయి హడావిడి చేస్తుంది ప్రభావతి. సత్యం కుర్తా వేసుకొని వస్తాడు. అక్కడ జరిగేది రిచ్ ఫంక్షన్, మనం డబ్బున్నవాళ్లలా కనిపించాలని అంటుంది.
మీనా కోసం బాలు చీర కొని తీసుకొస్తాడు.అప్పులు అవుతున్న ఈ సోకులకు ఏం తక్కువ లేదని బాలుపై సెటైర్లు వేస్తుంది. పని పాట లేనివాళ్లే డాబుగా రెడీ అయితే నా భార్యకు ఏం తక్కువ బాలు అంటాడు. నా భార్య అందరి ముందు గొప్పగా ఉండాలని తెచ్చానని బాలు అంటాడు.
సూట్‌లో ఆఫీసర్‌లా…
మనోజ్ సూట్ వేసుకొని రెడీ అవుతాడు. సూట్‌లో ఆఫీసర్‌లా ఉన్నావని మనోజ్‌తో అంటుంది ప్రభావతి. ఆఫీసర్‌లా ఉన్నాడు కానీ ఆఫీసర్ కాదని బాలు పంచ్‌లు వేస్తాడు. కొత్త చీరలో మీనా అందానికి ఫిదా అవుతాడు బాలు. ఫంక్షన్‌లో సత్యం ఫ్యామిలీతో మాట్లాడేది లేదని సురేంద్ర అంటాడు. మన రివేంజ్ కోసమైనా కొద్ది సేపు నటిస్తే చాలని సురేంద్రను ఒప్పిస్తుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.