పదిహేనేళ్ల పిల్లాడికి బ్లడ్ క్యాన్సర్.. ఈ పోరాటంలో మీ సాయం కోరుతోంది ఆ కుటుంబం

Best Web Hosting Provider In India 2024

పదిహేనేళ్ల పిల్లాడికి బ్లడ్ క్యాన్సర్.. ఈ పోరాటంలో మీ సాయం కోరుతోంది ఆ కుటుంబం

HT Telugu Desk HT Telugu

బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న తమ పదో తరగతి పిల్లవాడికి బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం ఓ కుటుంబం సాయం అర్థిస్తోంది.

బ్లడ్ క్యాన్సర్ తో చికిత్స పొందుతున్న విద్యార్థి

పదో తరగతి చదువుతున్న ఆ చిన్న ప్రాణం.. ఎన్నో కలలు, ఆశలు, బతకాలనే తపనతో నిండి ఉంది. కానీ విధి అతడిపై ఓ క్రూరమైన పరీక్షను విసిరింది. ఆ చిన్నారి తేపల్లి నాగ చైతన్య (వయసు 15 సంవత్సరాలు) బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఆ పిల్లాడి ప్రాణాన్ని కాపాడాలంటే వెంటనే బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ (ఎముక మజ్జ మార్పిడి) ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. దానికి 50 లక్షలకు పైగా ఖర్చవుతుంది అంటున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరికొన్ని రోజుల్లో ఆపరేషన్ చేయాల్సి ఉంది.

చికిత్స జరుగుతున్న ఆసుపత్రి: బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, హైదరాబాద్.

చికిత్స చేస్తున్న డాక్టర్: డా. పవన్ కుమార్

కానీ ఇక్కడే అసలైన గుండె కోత మొదలైంది. ఈ ధైర్యవంతుడైన పిల్లాడికి తండ్రి లేడు. నాలుగేళ్ల క్రితం ఆర్థిక సమస్యల వల్ల తండ్రి తేపల్లి రత్నాకర్ చనిపోయారు. అతని తల్లి, ఓ నిరుపేద మహిళ. ఆమెకు సరైన ఆదాయం లేదు. ప్రస్తుతం ఈ పిల్లాడిని బాబాయి తేపల్లి విజయ్ (ఫోన్ నెం: 9912784850) చూసుకుంటున్నారు. తన కొడుకు ప్రాణాలను కాపాడుకోవడానికి వారు చేయని ప్రయత్నం లేదు. ఉన్న కాస్త ఆస్తిపాస్తులు అమ్ముకుంటూ, ఎవరి కాళ్ళకు మొక్కాలో తెలియక అష్టకష్టాలు పడుతున్నారు. మాకు సౌకర్యాలు వద్దు, మా బిడ్డ ప్రాణం బతికితే చాలు అంటోంది ఆ కుటుంబం.

మీకు తోచిన సహాయం చేయాలని ఆ కుటుంబం వేడుకుంటోంది. అది ఎంత చిన్న మొత్తమైనా సరే, ముందుకు రావాలని వేడుకుంటోంది. ఈ చిన్నారికి బతికే అవకాశం కల్పించడానికి చేయి చేయి కలుపుతారని ఆశిస్తోంది. మళ్ళీ ఆ చిరునవ్వును చూడటానికి కారణమవ్వాలని ప్రార్థిస్తోంది.

ఆర్థిక సహాయం చేయదలిచిన వారు ఈ వివరాలను ఉపయోగించగలరు.

ఖాతా వివరాలు:

అకౌంట్ నెం: 62395457851

IFSC: SBIN0021183

బ్యాంక్ పేరు: SBI

లేదా

G-Pay / PhonePe నెంబర్: 9912784850 (తేపల్లి నాగ చైతన్య)

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.
Source / Credits

Best Web Hosting Provider In India 2024