వారియర్ అవతార్‌లో రష్మిక మందన్నా.. కొత్త సినిమా అనౌన్స్ చేసిన నేషనల్ క్రష్.. టైటిల్ గెస్ చేయండి.. రష్మికను కలవండి

Best Web Hosting Provider In India 2024

వారియర్ అవతార్‌లో రష్మిక మందన్నా.. కొత్త సినిమా అనౌన్స్ చేసిన నేషనల్ క్రష్.. టైటిల్ గెస్ చేయండి.. రష్మికను కలవండి

Hari Prasad S HT Telugu

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన కొత్త మూవీ అనౌన్స్ చేసింది. వరుసగా బ్లాక్‌బస్టర్లు అందుకుంటున్న ఆమె.. తాజాగా వారియర్ లుక్ లో ఉన్న పోస్టర్ తో కొత్త సినిమాపైనా అంచనాలు భారీగా పెంచేసింది. అంతేకాదు ఈ మూవీ టైటిల్ సరిగ్గా అంచనా వేస్తే.. తానే వాళ్లను కలుస్తానని కూడా రష్మిక చెప్పడం విశేషం.

వారియర్ అవతార్‌లో రష్మిక మందన్నా.. కొత్త సినిమా అనౌన్స్ చేసిన నేషనల్ క్రష్.. టైటిల్ గెస్ చేయండి.. రష్మికను కలవండి

రష్మిక మందన్నా గత మూడు, నాలుగేళ్లుగా బాక్సాఫీస్ దగ్గర అన్నీ బ్లాక్‌బస్టర్ హిట్స్ అందిస్తూ దూసుకెళ్తోంది. తెలుగులోనే కాదు ఇండియాలోనే ఏ హీరోయిన్ కు సాధ్యం కాని రికార్డు ఇది. ఆమె కథల ఎంపిక అలా ఉంటోంది మరి. తాజాగా తన కొత్త మూవీ అనౌన్స్ అయింది. ఇందులోనూ రష్మిక లుక్ ఆకట్టుకుంటోంది.

రష్మిక కొత్త మూవీ

నేషనల్ క్రష్ గా పేరుగాంచిన రష్మిక మందన్నా ఇప్పుడు అసలుసిసలు పాన్ ఇండియా స్టార్ గా నిలుస్తోంది. తాజాగా కుబేర సక్సెస్ తో రష్మిక మరో మెట్టు పైకి ఎక్కింది. ఈ నేపథ్యంలో ఆమె నెక్ట్స్ ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను శుక్రవారం (జూన్ 27) ఉదయం 10:08 గంటలకు రిలీజ్ చేయనున్నారు. గురువారం (జూన్ 26) ప్రీలుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఇందులో రష్మిక చాలా పవర్‌ఫుల్ గా ఓ వారియర్ గా కనిపిస్తోంది. ఈ పోస్టర్ ఓ అడవి బ్యాక్‌డ్రాప్ లో ఉంది. ఇందులో ఓ చెట్టు కాలిపోతుండగా పక్కనే రష్మిక చేతిలో ఓ బళ్లెం పట్టుకొని నిల్చొంది. ఆమెకు ఎదురుగా శత్రుమూక దూసుకురావడం చూడొచ్చు. ఆ పోస్టర్ పై హంటెడ్, వూండెడ్, అన్‌బ్రోకెన్ అనే పదాలు రాసి ఉన్నాయి. ఈ పోస్టర్ తోనే రష్మిక కొత్త సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

రష్మిక కొత్త మూవీ గురించి..

రష్మిక మందన్నా కొత్త సినిమా ప్రీలుక్ పోస్టర్ చాలా పవర్‌ఫుల్ గా ఉంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ కథ, అందులో ఆమె పాత్రపై చర్చ మొదలైంది. మరోసారి రష్మిక చాలా శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నట్లు స్పష్టమవుతోంది. రష్మిక ఈ పోస్టర్ ను తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసింది. “నా నెక్ట్స్ మూవీకి టైటిల్ ఏమై ఉంటుందో మీరు ఊహించగలరా? ఎవరూ ఊహించలేరని అనుకుంటున్నాను. కానీ ఒకవేళ మీరు గెస్ చేస్తే మాత్రం నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను” అని రష్మిక క్యాప్షన్ ఉంచింది.

రష్మిక నటిస్తున్న ఈ కొత్త సినిమాను అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తోంది. అంతకుమించి ఈ కొత్త ప్రాజెక్ట్ గురించి ఎలాంటి సమాచారం మేకర్స్ వెల్లడించలేదు. శుక్రవారం (జూన్ 27) టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ సమయంలోనే పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ చూడని పాత్రలో రష్మికను చూడబోతున్నామా అన్న ఆసక్తి మాత్రం అభిమానుల్లో నెలకొంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024