ఓటీటీలోకి ఇవాళ వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్ కోర్ట్ రూమ్ డ్రామా.. 8.5 రేటింగ్.. ఎక్కడ చూడాలంటే?

Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి ఇవాళ వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్ కోర్ట్ రూమ్ డ్రామా.. 8.5 రేటింగ్.. ఎక్కడ చూడాలంటే?

Sanjiv Kumar HT Telugu

ఓటీటీలోకి ఇవాళ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ కోర్ట్ రూమ్ డ్రామా మూవీ ది వర్డిక్ట్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. వరలక్ష్మీ శరత్ కుమార్, సీనియర్ హీరోయిన్ సుహాసిని, శ్రుతి హరిహరన్ ప్రధాన పాత్రలో నచించిన ఈ సినిమాకు ఏకంగా 8.5 రేటింగ్ వచ్చింది. ది వర్డిక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌పై లుక్కేద్దాం.

ఓటీటీలోకి ఇవాళ వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్ కోర్ట్ రూమ్ డ్రామా.. 8.5 రేటింగ్.. ఎక్కడ చూడాలంటే?

ఓటీటీలోకి ప్రతివారం ఎన్నో రకాల సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంటాయి. వారంలో సుమారు 20 నుంచి 30 వరకు ఓటీటీ సినిమాలు రిలీజ్ అవుతుంటే అవన్నీ రోజుకు కొన్ని డిజిటల్ ప్రీమియర్ అవుతుంటాయి. అలా ఇవాళ ఓటీటీలోకి ఓ న్యూ క్రైమ్ థ్రిల్లర్ కోర్ట్ రూమ్ డ్రామా చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

రివేంజ్, మిస్టరీ అంశాలు

ఆ సినిమానే ది వర్డిక్ట్. అంటే తీర్పు అని అర్థం వస్తుంది. తమిళంలో క్రైమ్ థ్రిల్లర్ కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కింది ది వర్డిక్ట్. ఇందులో మిస్టరీ, రివేంజ్, లవ్ స్టోరీ వంటి అంశాలు కూడా ఉన్నాయి. ది వర్డిక్ట్ సినిమాకు క్రిష్ణ శంకర్ కథ, దర్శకత్వం రెండు వహించారు. అలాగే, ప్రకాష్ మోహన్ దాస్ ది వర్డిక్ట్ మూవీకి నిర్మాతగా వ్యవహరించి నిర్మించారు.

హనుమాన్‌తో ఫుల్ క్రేజ్

ఆదిత్య రావు సంగీతం అందించిన ఈ సినిమాకు అగ్ని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించారు. ది వర్డిక్ట్ సినిమాలో హనుమాన్‌తో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న బ్యూటిఫుల్ వరలక్ష్మీ శరత్ కుమార్, సీనియర్ హీరోయిన్ సుహాసిని, యంగ్ బ్యూటి శ్రుతి హరిహరన్ ప్రధాన పాత్రలు పోషించారు.

తెలుగు లేడి కమెడియన్ కూడా

ఈ ముగ్గురితోపాటు ది వర్డిక్ట్ సినిమాలో నిర్మాత అయిన ప్రకాష్ మోహన్ దాస్ మరో కీలక పాత్ర పోషించారు. అలాగే ఈ సినిమాలో తెలుగు లేడి కమెడియన్, నటి విద్యుల్లేఖ రామన్ కూడా నటించారు. ఇక మే 30న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్సే వచ్చింది. కోర్ట్ రూమ్ డ్రామా, థ్రిల్లర్ అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఐఎమ్‌డీబీ రేటింగ్

ది వర్డిక్ట్ సినిమాపై రివ్యూలు కూడా పాజిటివ్‌గానే వచ్చాయి. అంతేకాకుండా ఐఎమ్‌డీబీ సంస్థ నుంచి ది వర్డిక్ట్ సినిమా పదికి ఏకంగా 8.5 రేటింగ్ సాధించుకుంది. మరి ఇలాంటి ది వర్డిక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు ఇవాళ (జూన్ 26) వచ్చేసింది. సన్ నెక్ట్స్ (Sun NXT OTT)లో నేడు ది వర్డిక్ట్ ఓటీటీ రిలీజ్ అయింది.

ది వర్డిక్ట్ ఓటీటీ

అయితే, కేవలం తమిళ భాషలో మాత్రమే ది వర్డిక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. భాషతో సంబంధం లేదనుకుంటే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో ది వర్డిక్ట్‌ను ఓటీటీలో ఎంచక్కా వీక్షించేయొచ్చు.

ది వర్డిక్ట్ కథ

ఇక ది వర్డిక్ట్ కథలోకి వెళితే.. ఒక బిలినియర్ అమెరికన్ మహిళ అనుమానాస్పదంగా చనిపోయి ఉంటుంది. ఆమెను భారతీయ మహిళ మర్డర్ చేసినట్లు ఆరోపణలు వస్తాయి. దాంతో ఇండియన్ వుమెన్‌ను అరెస్ట్ చేస్తారు పోలీసులు. ఈ హత్య కేసు నుంచి తన భార్యను ఎంతగానో ప్రేమించే భర్త ఎలా కాపాడాడు అనేదే ది వర్డిక్ట్ మూవీ స్టోరీ.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024