ఓటీటీలో బోల్డ్ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. 8.2 రేటింగ్.. తెలుగులోనే స్ట్రీమింగ్.. ఫ్రీగా చూసేయొచ్చు!

Best Web Hosting Provider In India 2024

ఓటీటీలో బోల్డ్ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. 8.2 రేటింగ్.. తెలుగులోనే స్ట్రీమింగ్.. ఫ్రీగా చూసేయొచ్చు!

Sanjiv Kumar HT Telugu

ఓటీటీలో బోల్డ్ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఏక్ థీ బేగం మంచి ఆదరణ దక్కించుకుంది. శృంగార, యాక్షన్, లవ్, రొమాంటిక్ సీన్లతో సాగే ఏక్ థీ బేగం ఐఎమ్‌డీబీ నుంచి 8.2 రేటింగ్ సాధించుకుంది. తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఏక్ థీ బేగం సిరీస్‌ను ఇక్కడ ఫ్రీగా చూసేయొచ్చు.

ఓటీటీలో బోల్డ్ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. 8.2 రేటింగ్.. తెలుగులోనే స్ట్రీమింగ్.. ఫ్రీగా చూసేయొచ్చు!

ఓటీటీలో ఎన్నో రకాల కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీస్‌లు అలరిస్తుంటాయి. అయితే, అవి ఎలాంటి జోనర్ అయిన తెరకెక్కించే విధానం సరికొత్తగా ఉంటే వాటికి మంచి ఆదరణ లభిస్తుంది. అలా ఓటీటీలో మంచి ఆదరణ దక్కించుకున్న వెబ్ సిరీస్ ఏక్ థీ బేగం.

నవల ఆధారంగా

బోల్డ్ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఏక్ థీ బేగం రెండు సీజన్స్‌తో ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ సిరీస్‌కు సచిన్ దారేకర్, జై తంక్ దర్శకత్వం వహించారు. సప్న దిది అనే నవల ఆధారంగా ఏక్ థీ బేగంను సచిన్ దారేకర్ రచించారు. ఈ సిరీస్‌లో అనూజ సాథే, అంకిత్ మోహన్, చిన్మయి మండ్లేకర్, రాజేంద్ర శిసాట్కర్, అభ్‌జీత్ చావన్ కీలక పాత్రలు పోషించారు.

శృంగార సన్నివేశాలు

శృంగార సన్నివేశాలు, యాక్షన్, వయోలెన్స్, లవ్ స్టోరీ, రొమాంటిక్ సీన్లతో ఏక్ థీ బేగం వెబ్ సిరీస్‌ను మలిచారు. నిజానికి ఇది ఒక మరాఠీ సిరీస్. కథ అంతా ముంబైలో జరుగుతుంది. ఇద్దరు భార్యాభర్తలు పెళ్లి చేసుకుని ముంబైకి వస్తారు. అయితే, భర్త మాత్రం ఒక గ్యాంగ్‌స్టర్ దగ్గర పనిచేస్తాడు.

చిదిమేసిన వారిపై పగ

డ్రగ్స్‌కు సంబంధించిన విషయంలో భర్తను రౌడీలు చంపేస్తారు. ఈ క్రమంలోనే భర్తను, కడుపులో బిడ్డను పోగొట్టుకుంటుంది భార్య. తన జీవితాన్ని చిదిమేసిన వారిపై పగ తీర్చుకోవాలనుకుంటుంది భార్య. సప్నగా పేరు మార్చుకుని బార్ డ్యాన్సర్‌గా అవతారం ఎత్తుతుంది.

అందంతో లోబరుచుకుని

ఒక్కొక్క గ్యాంగ్‌స్టర్‌ను, తన భర్త హత్యకు కారణమైన ఒక్కొక్కరిని తన అందంతో లోబరుచుకుని చంపుతుంది. మరి అలా తన భర్త ప్రాణాలు తీసిన వారిని కనిపెట్టి చంపగలిగిందా? గ్యాంగ్స్‌స్టర్స్ చేతిలో సప్న ఏమైంది? వంటి థ్రిల్లింగ్ అంశాలతో ఏక్ థీ బేగం తెరకెక్కింది.

8.2 ఐఎమ్‌డీబీ రేటింగ్

ఏక్ థీ బేగం రెండు సీజన్స్‌తో వచ్చింది. మొదట సీజన్‌లో 14 రెండో సీజన్‌లో 12తో మొత్తంగా రెండు సీజన్స్‌లో 26 ఎపిసోడ్స్‌ ఉన్నాయి. ఈ సిరీస్‌కు ఐఎమ్‌డీబీ నంచి పదికి ఏకంగా 8.2 రేటింగ్ వచ్చింది. అంటే, స్టోరీ రొటీన్‌గా ఉన్న టేకింగ్ ఆకట్టుకునేలా ఉంటుందని తెలుస్తోంది.

ఏక్ థీ బేగం ఓటీటీ

ఇక ఏక్ థీ బేగం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మరాఠీలోనే కాకుండా హిందీ, తెలుగు వంటి మూడు భాషలో ఏక్ థీ బేగం సీజన్ 1, సీజన్ 2 ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఎమ్ఎక్స్ ప్లేయర్‌లో ఏక్ థీ బేగం సిరీస్‌ను ఫ్రీగా చూసేయొచ్చు. ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఎమ్ఎక్స్ ప్లేయర్ ఒరిజినల్ సిరీస్ అయిన ఎక్ థీ బేగంను పెద్దలు ఉచితంగా చూడొచ్చు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024