




Best Web Hosting Provider In India 2024

బంగాళాఖాతంలో అల్పపీడనం – ఏపీలోని ఈ జిల్లాలకు వర్ష సూచన
ఏపీలో మరికొన్నిరోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణశాఖ వివరాలను వెల్లడించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని పేర్కొంది. ఈ ప్రభావంతో కొన్ని జిల్లాల్లో వానలు పడుతాయని వివరించింది.
వాయువ్య బంగాళాఖాతంతో పాటు దానిని ఆనుకుని ఉన్న ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాల్లో గురువారం అల్పపీడనం ఏర్పడింది. ఈ ప్రభావంతో ఏపీలో మరికొన్నిరోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
ఏపీలో వర్షాలు…
అల్పపీడనం ప్రభావంతో ఇవాళ(జూన్ 27) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ,కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శనివారం(జూన్ 28) రోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడకక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడొచ్చు. మిగిలిన చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆదివారం రోజూ కూడా ఇదే మాదిరి పరిస్థితులు ఉండొచ్చు.
టాపిక్