నిన్ను కోరి జూన్ 27 ఎపిసోడ్: శ్రుతిని ఎత్తుకున్న విరాట్- చంద్రకళ దురదగుంటాకు శిక్ష- మెట్లపై నుంచి కిందపడిన రఘురాం!

Best Web Hosting Provider In India 2024

నిన్ను కోరి జూన్ 27 ఎపిసోడ్: శ్రుతిని ఎత్తుకున్న విరాట్- చంద్రకళ దురదగుంటాకు శిక్ష- మెట్లపై నుంచి కిందపడిన రఘురాం!

Sanjiv Kumar HT Telugu

నిన్ను కోరి సీరియల్ జూన్ 27 ఎపిసోడ్‌లో కామాక్షి, శ్రుతి పచ్చళ్లు ఇంకోసారి చేస్తే ఊరుకోను కస్టమర్ వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. కాలు బెణికినట్లు శ్రుతి నాటకం ఆడి విరాట్ ఎత్తుకునేలా చేస్తుంది. దాంతో కామాక్షి, శ్రుతికి చంద్రకళ దురదగుంటాకు శిక్ష వేస్తుంది. రఘురాంను చంద్రకళ కిందపడేసేలా చేస్తుంది శాలిని.

నిన్ను కోరి సీరియల్ జూన్ 27 ఎపిసోడ్‌

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కామాక్షి, శ్రుతి పికిల్స్ కొన్న కస్టమర్ ఇంటికి వస్తుంది. మోడ్రన్ పికిల్స్ మీవేనా. చాలా డిఫరెంట్ కాంబినేషన్‌లో పచ్చళ్లు చేశారు అని అడుగుతుంది. అవును, కలబంద కాకరకాయ. అది ప్రత్యేకంగా షుగర్ పేషంట్స్ కోసం చేశాం అని కామాక్షి చెబుతుంది.

పచ్చళ్లు పెడితే ఊరుకోను

మా ఆయనకు షుగర్ లేదు కానీ మీరు పెట్టిన పచ్చడి తిని హాస్పిటల్ పాలయ్యారు అని లేడి కస్టమర్ చెప్పి కామాక్షి, శ్రుతిని తిడుతుంది. కామన్ సెన్స్ వాడి అయినా పచ్చళ్లు పెట్టండి. లేదా ఇంకోసారి ఇలాంటి పచ్చళ్లు పెడితే ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది కస్టమర్. దాంతో ఇక నుంచి అయినా పనికిరాని పచ్చళ్లు పెట్టి వాళ్లు వీళ్లతో తిట్టించుకోవద్దని శ్యామల అంటుంది.

పచ్చళ్ల వ్యాపారం దెబ్బతినడంతో కామాక్షి, శ్రుతి బాధలో ఉంటారు. ఇద్దరు చిరాకు పడుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి విరాట్ రావటం విరాట్ని చూసి చంద్రకళ కాఫీ కావాలా బావా అని అడుగుతుంది. దానికి విరాట్ నీ కాఫీ వద్దు నువ్వు వద్దు అని చెప్పి వెళ్లిపోతాడు. ఈ క్రమంలో శృతికి ఒక ఐడియా వస్తుంది.

అదంతా యాక్టింగ్

విరాట్ బావతో నేను దగ్గరగా మూవ్ అయితే చంద్రకళకి నచ్చదు కాబట్టి దానికి చిరాకు పుట్టిస్తాను అని విరాట్‌కి దగ్గర అవటానికి కింద పడినట్లు యాక్ట్ చేస్తుంది శ్రుతి. అలాగే, కాళ్లు బెణికినట్లు, నొప్పి బాగున్నట్లు, అస్సలు నడవలేకపోతున్నట్లు విలవిలలాడుతున్నట్లు నటిస్తుంది శ్రుతి. అదంతా యాక్టింగ్ అని చంద్రకళకు కన్నుకొట్టి సైగ చేసి మరి చూపిస్తుంది శ్రుతి.

అది చూసి దీన్ని ఏదానా చేయాలి అని చంద్రకళ అనుకుంటుంది. తర్వాత శ్రుతిని ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెడతాడు. నా కాలికి ఏదైనా పెయిన్ బామ్ రాయి బావా అని విరాట్‌ను శ్రుతి అడుగుతుంది. బామ్ కాదు ఉమ్మెత్త ఆకుతో కాలికి మర్దన చేస్తే నొప్పి త్వరగా తగ్గుతుందని శాలిని చెబుతుంది. దాంతో కామాక్షి వెళ్లి ఉమ్మెత్త ఆకు తీసుకొని గ్రైండ్ చేస్తుంది. అది సరిగా గ్రైండ్ అవ్వకపోవడంతో చంద్రకళ వచ్చి అందులో నీళ్లు పోయమని చెబుతుంది.

దురదగుంటాకు కలిపి

నీళ్ల కోసం కామాక్షి వెళ్లినప్పుడు చంద్రకళ అందులో దురదగుంటాకులు కలుపుతుంది. ఆ ఆకులను శ్రుతికి రాస్తాడు విరాట్. కొద్దిసేపటి తర్వాత శృతి, కామాక్షి దురదతో గోక్కుంటూ ఇబ్బందిపడతారు. అప్పుడు చంద్రకళ వచ్చి వాళ్లతో నేను అందులో దురదగుంటాకు కలిపానని, ఇదే మీకు శిక్ష అని చెబుతుంది. దాంతో ఇద్దరూ షాక్ అయిపోయి దురదతో ఏడుస్తుంటారు.

ఆ తర్వాత చంద్రకళ రఘురామ్ దగ్గరికి వస్తుంది. తన ఆవేదన చెప్పుకుంటుంది. దానికి రఘురాం కళ్లు చెమ్మగిల్లుతాయి. ఈ లోపు అక్కడికి శ్యామల వస్తుంది. మన మాటలు మామయ్య వింటున్నాడని చంద్రకళ చెపుతుంది. దానితో అందరూ వస్తారు. ఇన్నాళ్ల నుంచి మావయ్య మన మాటలు వింటున్నాడు అని చెప్పడంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు.

కిందపడిపోయిన రఘురాం

దాంతో శ్యామల వచ్చి నువ్వే అన్నయ్యని చల్లగాలికి తీసుకెళ్లి మాట్లాడుతూ ఉండు. తను త్వరగా కోలుకుంటాడని చంద్రకళతో చెబుతుంది. రఘురామ్‌ని చంద్రకళ తీసుకెళ్తుంటే అక్కడ కింద పడేటట్లు శాలిని ప్లాన్ చేస్తుంది. దానికి తగినట్లుగానే డోర్ మ్యాట్ తగిలి చంద్రకళ కింద పడుతుంది. వీల్ చైర్‌లో ఉన్న రఘురామ్‌ని వదిలేస్తుంది చంద్ర.

మెట్ల పైనుంచి రఘురాం కిందపడిపోతాడు. తలకు దెబ్బ తగిలి రక్తం వస్తుంది. అది చూసిన ఇంట్లో వాళ్లందరూ చంద్రకళనే కావాలని పడేసింది అన్నట్టు నానా మాటలు అని తిడతారు. వెంటనే క్రాంతి ఫోన్ చేసి ఆయుర్వేద డాక్టర్‌ను పిలుస్తాడు. ఆయుర్వేద డాక్టర్ వచ్చి చెక్ చేసిన తర్వాత పర్వాలేదు సౌమ్యంగానే ఉన్నారు. కానీ అంత అజాగ్రత్తగా ఉంటే ఎలా అని చెప్పి వెళ్లిపోతాడు.

శాలిని ప్లాన్ సక్సెస్

దాంతో చంద్రకళని అందరూ విమర్శిస్తారు. దానికి చంద్రకళ చాలా బాధగా దిక్కుతోచని స్థితికి గురైపోతుంది. పక్కకు వెళ్లి బాధపడుతుంటుంది. శాలిని ప్లాన్ సక్సెస్ అవుతుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024