




Best Web Hosting Provider In India 2024

తెగిపోయిన జూరాల గేట్ల రోప్‌లు – ప్రాజెక్ట్ నిర్వహణపై నీలినీడలు…!
జూరాల ప్రాజెక్టులోని ఇనుప తాళ్లు (రోప్‌లు) తెగిపోయాయి. మరోవైపు భారీగా వరద నీరు తరలివస్తోంది. అయితే 12వ నంబరు గేటు నుంచి నీళ్లు లీకవుతున్నాయి. దీంతో ప్రాజెక్ట్ గేట్ల నిర్వహణపై విమర్శలు వినిపిస్తున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.
జూరాల ప్రాజెక్ట్
కృష్ణా బేసిన్‌లోని జూరాల ప్రాజెక్ట్ భద్రతపై నీలినీడలు అలుముకుంటున్నాయి. తాజాగా నాలుగో గేట్ ఇనుప రోప్(తాళ్లు) తెగిపోవడంతో గేట్ల నిర్వహణపై ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ఎగువ నుంచి భారీ వరద తరలివస్తోంది. దీంతో ప్రాజెక్ట్ భద్రతపై వెంటనే చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
జూరాల ప్రాజెక్ట్ – ముఖ్యమైన అంశాలు:
- కృష్ణా బేసిన్ లోని తెలంగాణ పరిధిలో ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్(ఆత్మకూరు- గద్వాల మధ్య) ఉంటుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఈ ప్రాజెక్ట్ జలప్రదాయినిగా నిలుస్తోంది.
- ఈ జూరాల ప్రాజెక్ట్ 1997లో వినియోగంలోకి వచ్చింది. మొత్తం 67 రేడియల్ గేట్లు ఉన్నాయి. ఇందులో కొన్నిగేట్ల రోప్‌లు నీటి తాకిడితో తుప్పుపట్టాయి. అంతేకాకుండా కొన్ని గేట్ల నుంచి నీటి లీకేజీ సమస్య ఉంది.
- గేట్ల మరమ్మత్తుల కోసం 2022లో రూ.11 కోట్లతో టెండర్లు పిలించారు. ఈ పనులు ప్రారంభయ్యాయి. అయితే అనుకున్నంత పురోగతి కనిపించటం లేదన్న విమర్శలు ఉన్నాయి.
- ప్రస్తుతం రోప్‌ల మార్పిడి పనులు జరుగుతున్నాయి. అయితే తాజాగా నాలుగో గేట్ ఇనుప రోప్ తెగిపోవడంతో ప్రాజెక్ట్ గేట్ల నిర్వహణపై ఆందోళన వ్యక్తమవుతోంది.
- ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు ఎగువ నుంచి లక్ష క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. 12 గేట్ల ద్వారా అంతే మొత్తాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు.
- ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలుగా ఉంటుంది. దీని కింద 1.20 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది.
- తాజా పరిస్థితులపై అధికారులు స్పందిస్తూ… మరమ్మతు పనులు కొనసాగుతున్నాయని చెబుతున్నారు. అయితే ముందస్తుగా వరద రావడం ఆటంకంగా మారిందని అంటున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు వచ్చిన ముప్పు ఏమీ లేదని అభిప్రాయపడుతున్నారు.
- జూరాల ప్రాజెక్టులోని గేట్ రోప్ తెగిపోవడం కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ప్రాజెక్టు నిర్వహణ కూడా రాకపోవడం వల్లే ఇవాళ జూరాల ప్రాజెక్టు డేంజర్ లో పడిందని విమర్శిస్తోంది. జూరాలకు క్రమంగా వరద ఉదృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తోంది.
- ప్రభుత్వం వెంటనే దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు, ఎగువ నుంచి పెరుగుతున్న ఇన్ ఫ్లో ను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ పకడ్బందీగా వ్యవహరించాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జూరాల ప్రాజెక్టుకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు.
టాపిక్
Telangana NewsKrmbKrishna River
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.