ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన తెలుగు హారర్ థ్రిల్లర్- అమ్మవారి శాపం, రక్తం కక్కుకుని చచ్చే కొత్త పెళ్లి కూతుళ్లు- ఎక్కడంటే?

Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన తెలుగు హారర్ థ్రిల్లర్- అమ్మవారి శాపం, రక్తం కక్కుకుని చచ్చే కొత్త పెళ్లి కూతుళ్లు- ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu

ఓటీటీలోకి ఇవాళ డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది తెలుగు హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్. ఛాయ్ బిస్కెట్ ఫెమ్ అభిజ్ఞ వూతలూరు ప్రధాన పాత్రలో నటించిన విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన తెలుగు హారర్ థ్రిల్లర్ సిరీస్- అమ్మవారి శాపం, రక్తం కక్కుకుని చచ్చే పెళ్లి కూతుళ్లు- ఎక్కడంటే?

ఓటీటీలో ఎన్నో రకాల కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీస్‌లు వస్తూ అలరిస్తుంటాయి. వాటిలో ఓటీటీ ఆడియెన్స్‌ను ఎక్కువగా ఎంగేజ్ చేసే కాన్సెప్ట్ భయం. అవును, ఓటీటీ హారర్ థ్రిల్లర్స్‌కు మంచి క్రేజ్ ఉంటుంది. అందుకే రెగ్యులర్‌గా ఈ జోనర్‌కు ఇతర అంశాలు యాడ్ చేసి సినిమాలు, వెబ్ సిరీస్‌లను తెరకెక్కిస్తుంటారు దర్శకనిర్మాతలు.

రెక్కీ వెబ్ సిరీస్ మేకర్స్ నుంచి

అలా ఇవాళ ఓటీటలోకి వచ్చిన తెలుగు సిరీసే విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్. సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ వెబ్ సిరీస్‌కు కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. ఇదివరకు ఓటీటీలో సూపర్ హిట్ అయిన రెక్కీ వెబ్ సిరీస్ నిర్మాతలు ఈ విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్‌ను రూపొందించారు.

కొత్త పెళ్లికూతుళ్ల మరణాలు

ఛాయ్ బిస్కెట్ ఫేమ్ అభిజ్ఞ వూతలూరు, చరణ్ లక్కరాజు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ వెబ్ సిరీస్‌ మూఢ నమ్మకాలు, అంతు చిక్కని కొత్త పెళ్లి కూతుళ్ల మరణాలు వంటి అంశాలతో థ్రిల్లింగ్‌గా సాగుతుంది. విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ కథలోకి వెళితే విరాటపాలెం గ్రామంలో కొత్తగా పెళ్లి అయిన నవ వధువులంత రక్తం కక్కుని చచ్చిపోతుంటారు.

అమ్మవారి శాపం

ఆ గ్రామానికి అమ్మవారు శాపం పెట్టిందని, అందుకే కొత్త పెళ్లి కూతుళ్లు వివాహం జరగ్గానే మరణిస్తున్నారని గ్రామ ప్రజలు నమ్ముతుంటారు. ఈ నేపథ్యంలో ఆ ఊరికి ట్రాన్స్‌ఫర్ అయి వచ్చిన పోలీస్ కానిస్టేబుల్ మీనా ఆ మరణాలను కళ్లారా చూస్తుంది. అది చూసి చలించిపోయిన మీనా ఆ కేసులను ఇన్వెస్టిగేట్ చేస్తుంది.

విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ ఓటీటీ

ఈ క్రమంలోనే మీనా ఏం తెలుసుకుంది? అసలు పెళ్లి కూతుళ్లవి అమ్మవారి శాపంతో జరిగిన మరణాల? లేదా హత్యలా? అనేది విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ సిరీస్‌లోని ఇంట్రెస్టింగ్ అంశాలు. ఇలాంటి సీన్లతో సాగే విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ ఓటీటీలోకి ఇవాళ వచ్చింది.

జీ5 ఓటీటీలో

హారర్ అంశాలు ఉన్న విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ జీ5లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇవాళ (జూన్ 27) జీ5లో తెలుగు భాషలో హారర్ థ్రిల్లర్ సిరీస్ విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ ఓటీటీ రిలీజ్ అయింది. మరి హారర్, మిస్టరీ థ్రిల్లర్ అంశాలు నచ్చే ఓటీటీ ఆడియెన్స్ ఈ సిరీస్‌ను ఎంచక్కా చూసేయొచ్చు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024