




Best Web Hosting Provider In India 2024

ఇంజినీరింగ్ విద్యార్థులకు అలర్ట్ – టీజీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, ముఖ్య తేదీలివే
తెలంగాణలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీకి ఈఏపీసెట్ – 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. జూన్ 28వ తేదీ నుంచి ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ముఖ్య తేదీల వివరాలను పూర్తి కథనంలో చూడండి….
టీజీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్
బీటెక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఈఏపీసెట్ – 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి వివరాలను పేర్కొంది. మొత్తం 3 విడతల్లో సీట్ల భర్తీని చేపటనున్నారు. జూన్ 28వ తేదీ నుంచి ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. జూలై 7వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంటుంది. జూలై 18వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఉంటుంది.
ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ – ముఖ్య తేదీలు:
- జూలై 28వ తేదీ నుంచి ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా జూలై 7వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంటుంది.
- జూలై 1వ తేదీ నుంచి జూలై 8వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది.
- జూలై 6 నుంచి జూలై 10 వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక.
- జూలై 10వ రోజు ఫ్రీజింగ్ ఆప్షన్.
- జూలై 13వ తేదీన ప్రాథమికంగా సీట్ల కేటాయింపు (మాక్ సీట్లు కేటాయింపు).
- జూలై 14వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మార్పులు చేర్పులకు అవకాశం.
- జూలై 15వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఆప్షన్లపై ఫ్రీజింగ్.
- జూలై 18వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు.
- జూలై 18 నుంచి 22వ తేదీలోపు వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్.
టాపిక్
Ts EapcetTelangana NewsAdmissionsEducation