నా భార్యతో విడిపోయిన తర్వాత అద్దె ఇంట్లో ఉంటున్నాను.. చిన్నతనం నుంచి ఎప్పుడూ ఇలా లేను: జయం రవి కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

నా భార్యతో విడిపోయిన తర్వాత అద్దె ఇంట్లో ఉంటున్నాను.. చిన్నతనం నుంచి ఎప్పుడూ ఇలా లేను: జయం రవి కామెంట్స్

Hari Prasad S HT Telugu

తమిళ నటుడు జయం రవి తన భార్య ఆర్తితో విడిపోయిన తర్వాత తన పరిస్థితి ఎలా ఉందో ఓ ఈవెంట్లో వివరించాడు. తన జీవితంలో ఎప్పుడూ లేని విధంగా తొలిసారి అద్దె ఇంట్లో ఉంటున్నట్లు అతడు చెప్పడం విశేషం.

నా భార్యతో విడిపోయిన తర్వాత అద్దె ఇంట్లో ఉంటున్నాను.. చిన్నతనం నుంచి ఎప్పుడూ ఇలా లేను: జయం రవి కామెంట్స్

కోలీవుడ్ నటుడు జయం రవి అలియాస్ రవి మోహన్ తన భార్య ఆర్తి రవితో విడిపోయినప్పటి నుండి నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. గాయని, ఆధ్యాత్మిక హీలర్ అయిన కెనీషా ఫ్రాన్సిస్‌తో కలిసి అతను పబ్లిక్ అప్పియరెన్సులు ఇవ్వడంతో అతడు డేటింగ్ లో ఉన్నట్లు పుకార్లు వస్తున్నాయి. తాజాగా సిద్ధార్థ్, ఆర్. శరత్‌కుమార్, దేవయాని, యోగి బాబు, మీతా రఘునాథ్ నటించిన ‘3 బీహెచ్‌కే’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో, రవి మోహన్ తన పరిస్థితి గురించి మాట్లాడుతూ, తాను మొదటిసారి అద్దె ఇంట్లో ఉంటున్నానని చెప్పాడు.

అద్దె ఇంట్లో నివాసంపై రవి మోహన్

గతేడాది భార్యతో విడిపోయినప్పటి నుంచీ జయం రవి తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. తాజాగా అతడు ఓ ఈవెంట్లో మరోసారి తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాడు. ‘3 బీహెచ్‌కే’ అనేది అరవింద్ సచ్చిదానందం రాసిన ఒక చిన్న కథ ఆధారంగా రూపొందించిన ఫ్యామిలీ డ్రామా. ఈ సినిమా కథాంశంతో తాను బాగా కనెక్ట్ అయ్యానని, ఎందుకంటే తాను ఇప్పుడు అద్దె ఇంట్లో ఉంటున్నానని నటుడు రవి మోహన్ చెప్పాడు.

“నేను ఇంతకుముందెన్నడూ అద్దె ఇంట్లో నివసించలేదు. పుట్టినప్పటి నుండి నా సొంత ఇళ్లలోనే ఉన్నాను” అని రవి చెప్పాడు. “ఇప్పుడు నేను అద్దె ఇంట్లో నివసిస్తున్నాను. ఈ సినిమాతో నేను రిలేట్ చేసుకోగలను. ఈ సినిమా నాకు స్ఫూర్తినిచ్చింది. నా మిగిలిన జీవితాన్ని సంతోషంగా గడపాలనుకుంటున్నాను” అని అతడు అన్నాడు.

నెటిజన్ల స్పందన

అయితే జయం రవి కామెంట్స్ ను నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే వాళ్లు స్పందించారు. “ఇతను ఎందుకు ఇలా చెత్త మాట్లాడుతున్నాడు? మీరు కోట్లు సంపాదించిన నటుడు, అద్దె ఇంట్లో ఉంటూ కష్టపడే కార్మికుడిలా మాట్లాడొద్దు” అని ఒకరు అన్నారు. మరొకరు “మీరు ఇంకా వివాహితులు. పైగా వేరే వారితో సంబంధం పెట్టుకున్నారు. కాబట్టి మీరు అద్దె ఇంట్లో ఉండటం సహజమే. సింపతీ కార్డు ప్లే చేయడం ఆపండి” అని అనడం విశేషం.

ఇంకొకరు స్పందిస్తూ.. “రవి మోహన్ దయచేసి మీ అద్దె ఎంత ఉందో కూడా చెప్పండి. అది కచ్చితంగా లక్షల్లోనే ఉంటుంది” అని ఎత్తి చూపగా, మరొకరు “అద్దె ఇంట్లో ఉంటున్నారు, కానీ సినిమాలు నిర్మించగలరు?” అని ప్రశ్నించారు.

భార్యతో రవి విభేదాలు

రవి మోహన్ గతేడాది తన భార్య ఆర్తి నుంచి విడిపోయాడు. ఈ ఇద్దరూ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. ప్రస్తుతం వీళ్ల విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. అయితే అదే సమయంలో అతడు కెనీషా అనే అమ్మాయితో కలిసి తిరుగుతున్నాడు.

తాను ఇంట్లో నుంచి కట్టుబట్టలతో బయటకు వచ్చిన సమయంలో ఆమె మాత్రమే తనకు తోడుగా ఉందని గతంలో అతడు చెప్పాడు. అటు ఆర్తి కూడా రవిపై ఆరోపణలు చేస్తూనే ఉంది. అంతేకాదు అతని నుంచి నెలకు ఏకంగా రూ.40 లక్షల భరణం డిమాండ్ చేస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. 2009లో పెళ్లి చేసుకున్న వీళ్లు.. 15 ఏళ్లు కలిసి ఉన్న తర్వాత గతేడాది విడిపోయారు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024