ఒకే ఫ్రేమ్ లో కిస్సిక్, ఊ అంటావా మావ సాంగ్ భామలు.. సమంత, శ్రీలీల గొడవల పక్కన పెట్టినట్లేనా?

Best Web Hosting Provider In India 2024

ఒకే ఫ్రేమ్ లో కిస్సిక్, ఊ అంటావా మావ సాంగ్ భామలు.. సమంత, శ్రీలీల గొడవల పక్కన పెట్టినట్లేనా?

పుష్ప 2 లోని ప్రత్యేక డాన్స్ నంబర్ లో సమంత స్థానంలో శ్రీలీల నటించడం వల్ల గత సంవత్సరం నుండి వారి మధ్య విభేదాలు ఉన్నాయని పుకార్లు వచ్చాయి. ఇప్పుడు ఈ ఇద్దరు హీరోయిన్లు ఒకే ఫ్రేమ్ లో కనిపించడం హాట్ టాపిక్ గా మారింది.

శ్రీలీల, సమంత

పుకార్లకు తెరపడ్డట్లేనా? ఇద్దరి భామల మధ్య గొడవలేం లేవా? ఒకవేళ ఉన్నా ఆ సమస్యలు సద్దు మణిగయా?.. ఇవీ సమంత, శ్రీలీల కలిసి దిగిన ఫొటోలు చూసిన తర్వాత ఫ్యాన్స్ కు కలుగుతున్న ప్రశ్నలు. అవును.. పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ విషయంలో ఈ ఇద్దరు హాట్ బ్యూటీస్ కు గొడవలు జరిగాయనే ఊహాగానాలు తీవ్రంగా వినిపించిన సంగతి తెలిసిందే.

ఆ ఫొటో వైరల్

ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో సమంత, శ్రీలీల కలిసి కనిపించారు. దీంతో పుష్ప 2 డాన్స్ సాంగ్ వివాదంపై ఉన్న అనుమానాలకు చెక్ పెట్టారు. సమంత, శ్రీలీల ఇద్దరూ కలిసి జీక్యూ ఇండియా మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ యంగ్ ఇండియన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫోటోలో సమంత, శ్రీలీల ఒకరినొకరు చూసుకుంటూ, చేతులు కలిపి ఉంచారు. సమంత బ్లాక్ షీర్ గౌన్ ధరించగా, శ్రీలీల ఆఫ్-షోల్డర్ రెడ్ గౌన్ వేసుకుంది.

వీడియోలో సమంత శ్రీలీల రాక కోసం ఎదురు చూసి, ఆ తర్వాత కలిసి ఫోటో దిగుదామని పిలిచిన దృశ్యం కనిపిస్తుంది. పుష్ప 2 విడుదలైన తర్వాత వారి మధ్య విభేదాలు ఉన్నాయని వచ్చిన పుకార్లకు ఇది చెక్ పెట్టింది.

స్పెషల్ సాంగ్ తో

పుష్ప సినిమాలో సమంత ఊ అంటావా మావ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ స్పెషల్ సాంగ్ అప్పుడు ఊపు ఊపింది. ఇందులో సమంత బోల్డ్ మూవ్స్ రెచ్చగొట్టాయి. అయితే పుష్ప 2లో స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీలను తీసుకున్నారు. ఆమె కిస్సిక్ అనే సాంగ్ చేసింది. దీంతో ఈ సాంగ్ విషయంలోనే సమంత, శ్రీలీల మధ్య గొడవలు జరిగాయనే పుకార్లు వినిపించాయి.

‘కిస్సిక్’ అనే ఆ పాటను సమంత నటించిన ‘ఊ అంటావా’ పాటతో పోల్చారు. ‘ఊ అంటావా’ పాట సూపర్ హిట్ అయితే, ‘కిస్సిక్’ పాటకు మిశ్రమ స్పందన వచ్చింది. ప్రెస్ కాన్ఫరెన్స్ లో శ్రీలీల ఈ విమర్శలకు స్పందిస్తూ, “పాటే నా ఎంపికను సమర్థిస్తుంది. ఇది సాధారణ ఐటెం సాంగ్ కాదు. దీని వెనుక బలమైన కథ ఉంది. సినిమా విడుదలైన తర్వాత అది స్పష్టమవుతుంది” అని స్ట్రాంగ్ గా బదులిచ్చింది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024