





Best Web Hosting Provider In India 2024

నేను మా సొంతిల్లు కోసం ఎదురు చూశాను.. బొమ్మరిల్లులోని తండ్రికొడుకుల ఎమోషన్ చూస్తారు.. హీరో సిద్ధార్థ్ కామెంట్స్
బొమ్మరిల్లు సినిమాతో హీరోగా ఎంతో క్రేజ్ తెచ్చుకున్న సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ 3 బీహెచ్‌కే. సిద్ధార్థ్ కెరీర్‌లో 40వ సినిమాగా వస్తున్న 3 బీహెచ్‌కే ట్రైలర్‌ను జూన్ 27న విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 3 బీహెచ్‌కే ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో సిద్ధార్థ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
హీరో సిద్ధార్థ్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ క్రేజ్ ఉంది. బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, ఓయ్ తదితర సినిమాలతో ఎంతో పాపులర్ అయ్యాడు. ఇప్పుడు హీరో సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ 3 బీహెచ్‌కే. సిద్ధార్థ్ తన కెరీర్‌లో 40వ సినిమాగా త్రీ బీహెచ్‌కే మూవీ తెరకెక్కింది.
3 బీహెచ్‌కే ట్రైలర్ రిలీజ్
3 బీహెచ్‌కే సినిమాకు శ్రీ గణేష్ దర్శకత్వం వహించారు. 3 బీహెచ్‌కే మూవీ ట్రైలర్‌ను జూన్ 27న విడుదల చేశారు. ఈ సందర్భంగా గ్రాండ్‌గా ఏర్పాటు చేసిన 3 బీహెచ్‌కే ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో సిద్ధార్థ్ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పాడు. తన సొంతిల్లు కోసం ఎదురుచూడటంపై సిద్ధార్థ్ మాట్లాడాడు.
రియల్ లైఫ్ నుంచి
హీరో సిద్ధార్థ్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. 3 బీహెచ్‌కే మూవీ ఫ్యామిలీని మీకు పరిచయం చేయాలి. అరుణ్ విశ్వా ఎగ్జైటింగ్ ప్రొడ్యూసర్. ఈ సినిమా ఒక రియల్ లైఫ్ నుంచి వచ్చిన కథ. ఈ సినిమా చూసిన తర్వాత వెంటనే మా నాన్నని గట్టిగా హగ్ చేసుకోవాలని అనిపించింది” అని అన్నాడు.
బొమ్మరిల్లులో చూశారు
“తండ్రి కొడుకుల రిలేషన్‌షిప్‌ని బొమ్మరిల్లు సినిమాలో చూశారు. ఆ సినిమా నాకు చాలా నేర్పించింది. అలాంటి సినిమా తర్వాత మళ్లీ తండ్రి కొడుకుల రిలేషన్‌షిప్, ఎమోషన్‌ను 3 బీహెచ్‌కే సినిమాలో చూస్తారు. ఈ సినిమా చూసినప్పుడు నాకు ఎలాంటి అనుభూతి కలిగిందో మీకు కూడా ఆ అనుభూతి కలుగుతుందని భావిస్తున్నాను” అని సిద్ధార్థ్ తెలిపాడు.
హగ్ చేసుకోడానికి పక్కనే
“మీ ఫ్యామిలీని తీసుకుని థియేటర్స్‌కి వెళ్లండి. వాళ్లని హగ్ చేసుకోవడానికి మీ పక్కనే ఉంటారు. శ్రీ గణేష్ ఎక్స్‌ట్రార్డినరీ రైటర్, డైరెక్టర్. తను ఈ కథ చెప్పినప్పుడే చాలా ఎమోషనల్‌గా అనిపించింది. సొంత ఇల్లు అందరి కల. నేను కూడా చిన్నప్పుడు మా సొంతిల్లు కోసం ఎదురు చూశాను. మనందరం అలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచే వచ్చాము”అని సిద్ధార్థ్ పేర్కొన్నాడు.
మెయిన్ క్యారెక్టర్ ఇల్లు
“ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఇల్లు. అందులో మెయిన్ క్యారెక్టర్స్ శరత్ కుమార్ గారు, దేవయాని గారు. వాళ్లు ఈ సినిమాలో నటించడం మర్చిపోలేని అదృష్టం. ఇది నా 40వ సినిమా. అలాంటి సినిమాలో ఇంత మంచి యాక్టర్స్ ఉండటం నా అదృష్టం” అని హీరో సిద్ధార్థ్ చెప్పుకొచ్చాడు.
సంబంధిత కథనం