




Best Web Hosting Provider In India 2024

నిరుద్యోగులకు శుభవార్త – తెలంగాణ వైద్యారోగ్యశాఖ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్, ముఖ్య తేదీలివే
తెలంగాణ వైద్యారోగ్యశాఖ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా మొత్తం 607 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జూలై 10వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి.
తెలంగాణ వైద్యారోగ్యశాఖ ఉద్యోగ నోటిఫికేషన్
రాష్ట్రంలో మళ్లీ కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు జారీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా వైద్యారోగ్యశాఖ నుంచి భారీ నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థుల నుంచి జూలై 10వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగ నోటిఫికేషన్ – ముఖ్య వివరాలు
- ఉద్యోగ ప్రకటన – మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు, తెలంగాణ ప్రభుత్వం.
- ఉద్యోగాల పేరు – అసిస్టెంట్ ప్రొఫెసర్
- మొత్తం ఖాళీలు – 607 ఉద్యోగాలు (మల్డీ జోన్ 1 లో 379, మల్టీ జోన్ 2లో 228 ఉన్నాయి)
- దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 46 ఏళ్ల లోపు ఉండాలి.
- దరఖాస్తుదారులు సంబంధిత విభాగంలో ఉత్తీర్ణులై ఉండాలి. అధికారిక వెబ్ సైట్ లో ఈ వివరాలను తెలుసుకోవచ్చు.
- ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జూలై 10వ తేదీతో ప్రారంభమవుతుంది.
- అర్హులైన అభ్యర్థులు జూలై 17 సాయంత్రం 5 గంటలలోపు అప్లికేషన్ చేసుకోవాలి.
- జూలై 18వ తేదీ నుంచి జూలై 19వ తేదీ వరకు అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.
- కేవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తారు.
- ఎంపికైన వారికి నెల జీతం – రూ. 68,900 – రూ. 2,05,500
- దరఖాస్తు రుసుం కింద రూ. 500 చెల్లించాలి. ఇక ప్రాసెసింగ్ ఫీజు కింద రూ. 200 చెల్లించాలి,
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్యూఎస్, దివ్యాంగ అభ్యర్థులకు ప్రాసెసింగ్ ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు.
- వంద పాయింట్ల ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. 80 పాయింట్లను అకడమిక్స్ లో సాధించిన మార్కుల ఆధారంగా కేటాయిస్తారు. మరో 20 పాయింట్లను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేసిన వారికి వర్తింపజేస్తారు. ఈ వివరాలను నోటిఫికేషన్ లో వివరంగా ఇచ్చారు.
- అధికారిక వెబ్ సైట్ – https://mhsrb.telangana.gov.in
ఈ లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలను పూర్తిగా తెలుసుకోవచ్చు
సంబంధిత కథనం
టాపిక్
RecruitmentJobsTelangana News