ఇల్లు అనేది ఒక గౌరవం.. నా రియల్ లైఫ్‌కు చాలా కనెక్ట్ అయ్యా.. కన్నప్ప నటుడు శరత్ కుమార్ కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

ఇల్లు అనేది ఒక గౌరవం.. నా రియల్ లైఫ్‌కు చాలా కనెక్ట్ అయ్యా.. కన్నప్ప నటుడు శరత్ కుమార్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

మంచు విష్ణు కన్నప్ప సినిమాలో నటించి మెప్పించిన నటుడు శరత్ కుమార్ కీలక పాత్రలతో అలరిస్తున్నారు. తాజాగా శరత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ 3 బీహెచ్‌కే. సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కిన 3 బీహెచ్‌కే మూవీ ట్రైలర్ రీసెంట్‌గా రిలీజ్ అయింది. 3 బీహెచ్‌కే ట్రైలర్ లాంచ్‌లో నటుడు శరత్ కుమార్ కామెంట్స్ చేశారు.

ఇల్లు అనేది ఒక గౌరవం.. నా రియల్ లైఫ్‌కు చాలా కనెక్ట్ అయ్యా.. కన్నప్ప నటుడు శరత్ కుమార్ కామెంట్స్

కీలక పాత్రలతో అలరిస్తున్నారు నటుడు ఆర్ శరత్ కుమార్. హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ తండ్రి అయిన శరత్ కుమార్ మంచు విష్ణు కన్నప్ప మూవీలో నటించి మెప్పించారు. ఇప్పుడు మరో సరికొత్త సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఆ సినిమానే 3 బీహెచ్‌కే.

శరత్ కుమార్‌తోపాటు

బొమ్మరిల్లు సిద్ధార్థ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీనే 3 బీహెచ్‌కే. ఈ సినిమాలో శరత్ కుమార్‌తోపాటు దేవయాని, మీతా రఘునాథ్, చైత్ర కీలక పాత్రలు పోషించారు. శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ నిర్మించిన 3 బీహెచ్‌కే థియేట్రికల్ ట్రైలర్‌ను జూన్ 27న విడుదల చేశారు.

3 బీహెచ్‌కే ట్రైలర్ లాంచ్

శ్రీ గణేష్ దర్శకత్వం వహించిన 3 బీహెచ్‌కే మూవీ ట్రైలర్ లాంచ్‌ ఈవెంట్‌లో కన్నప్ప నటుడు ఆర్ శరత్ కుమార్ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పుకొచ్చారు. ఇల్లు అనేది ఒక గౌరవం లాంటిదని మాట్లాడారు.

అందరితో కలిసి

యాక్టర్ శరత్ కుమార్ మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం. డైరెక్టర్ శ్రీ గణేష్, ప్రొడ్యూసర్ విశ్వ గారికి థాంక్యూ. ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న శశి గారికి థాంక్యూ. సిద్దు, దేవయాని, చైత్ర, మీతా అందరితో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది” అని అన్నారు.

మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి

“ఇది నా రియల్ లైఫ్‌కి చాలా కనెక్ట్ అయ్యే సినిమా. మనందరం కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. ఇల్లు అనేది అందరి కల. ఈ సినిమాతో చాలా రిలేట్ అవుతున్నాను. ఇల్లు కట్టాలని అందరికీ యాంబిషన్ ఉంటుంది. ఇల్లు అనేది ఒక గౌరవం” అని కన్నప్ప యాక్టర్ శరత్ కుమార్ అభిప్రాయపడ్డారు.

ఒకే దగ్గర కూర్చుని

“ఈ సినిమాని ఒక ఫ్యామిలీ లానే వర్క్ చేసాం. చాలా మంచి వర్క్ చేసాం. అది ఎలా ఉందో మీరే చెప్పాలి. ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర కూర్చుని చూడదగ్గ సినిమా ఇది. ఈ సినిమాలో యాక్టర్లు కాదు క్యారెక్టర్లే కనిపిస్తాయి. తప్పకుండా ఈ సినిమా చూసి మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను” అని తన స్పీచ్ ముగించారు శరత్ కుమార్.

చాలా మంచి సందేశం

దేవయాని మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం. ఇది చాలా అద్భుతమైన కథ. చాలా మంచి సందేశం ఉంది. ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్‌కి థాంక్యూ” అని చెప్పారు.

మా గృహ ప్రవేశానికి రావాలి

“తెలుగు ఆడియన్స్ మంచి కథల్ని ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు. ఇది చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. తప్పకుండా ఈ సినిమాని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఒక ఫ్యామిలీగా మీ అందరిని ఈ సినిమాకి ఇన్వైట్ చేస్తున్నాం. మా గృహ ప్రవేశానికి మీరందరూ రావాలి (నవ్వుతూ). అందరికీ థాంక్యు” నటి దేవయాని తెలిపారు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024